AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాలీవుడ్ హీరోల కోసం ప్రపంచాన్నే సెట్స్‌గా మార్చేస్తున్న దర్శకులు!

టాలీవుడ్ హీరోల కోసం ప్రపంచాన్నే సెట్స్‌గా మార్చేస్తున్న దర్శకులు!

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Jun 19, 2026 | 6:51 PM

Share

టాలీవుడ్ దర్శకులు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అరుదైన లొకేషన్స్‌లో సినిమాలు తెరకెక్కించేందుకు మొగ్గు చూపుతున్నారు. రాజమౌళి-మహేష్ బాబు ‘వారణాసి’ నుంచి ఎన్టీఆర్ ‘డ్రాగన్’, నాని ‘బ్లడీ రోమియో’ వరకు అనేక భారీ చిత్రాలు విదేశాల్లో షూటింగ్ జరుపుకుంటున్నాయి. అంటార్కిటికా నుంచి యూరప్, ఆఫ్రికా వరకు విస్తరించిన ఈ లొకేషన్స్ సినిమాలకు అంతర్జాతీయ స్థాయి విజువల్ గ్రాండియర్‌ను తీసుకురానున్నాయి.

సినిమా తీయడంలో ఒక్కో దర్శకుడికి ఒక్కో శైలి ఉంటుంది.. కొందరు సెట్లలో ఎక్కువ సినిమా చేస్తుంటారు.. మరికొందరు రియల్ లొకేషన్స్ వైపు అడుగులు వేస్తుంటారు. కానీ మన దర్శకులు మాత్రం ఇప్పుడంతా ఒకేదారిలో వెళ్తున్నారు. పెద్ద సినిమాలన్నీ మ్యాగ్జిమమ్ ప్రపంచం నలుమూలలా వెళ్లి ఫారెన్ లొకేషన్స్‌లోనే షూట్ చేస్తున్నారు. అలాంటి సినిమాలు, లొకేషన్స్‌పైనే ఎక్స్‌క్లూజివ్ స్టోరీ.. ఈ టీజర్ చూసినపుడే వారణాసిని రాజమౌళి ఎంత గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారో అర్థమైపోయింది.. ముఖ్యంగా ఇప్పటి వరకు తెలుగు సినిమా కాదు ఇండియన్ సినిమా చూడని లొకేషన్స్‌లో దీన్ని షూట్ చేస్తున్నారు. జర్మనీలోని ఎగ్జోటిక్ లొకేషన్స్‌తో పాటు.. అంటార్కిటికాలో షూట్ చేసుకున్న మొదటి ఇండియన్ సినిమాగా చరిత్ర సృష్టించింది వారణాసి. అంటార్కిటికా మాత్రమే కాదు.. ఇంకా చాలా దేశాల్లో వారణాసి షూట్ చేయనున్నారు. ఇందులో ప్రపంచ యాత్రికుడిగా మహేష్ నటిస్తున్నారు. ఇక నానితో చేయబోయే బ్లడీరోమియో కోసం లండన్, హంగేరీ రాజధాని బుడాపెస్ట్ లాంటి లొకేషన్స్ జల్లడ పడుతున్నారు సుజీత్. ఈ సినిమా షూటింగ్ ఆగస్ట్ నుంచి మొదలు కానుందని తెలుస్తుంది. ఇండియాలో 20 శాతం మాత్రమే షూట్ చేసుకోబోతుంది బ్లడీ రోమియో. జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ షూటింగ్ కూడా ప్రపంచ నలుమూలలా జరుగుతుంది. ఆఫ్రికన్ కంట్రీస్‌లో.. మరీ ముఖ్యంగా టునీషియా పరిసర ప్రాంతాల్లో యాక్షన్ సీన్స్ షూట్ చేయడానికి రెక్కీ కూడా పూర్తైంది. ఈస్ట్ ఐరోపా, వెస్ట్ ఆసియా సరిహద్దులో ఉన్న ‘బ్లాక్ సీ’ సమీపంలోనూ డ్రాగన్ షూట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. టీజర్‌లోనే చాలా లొకేషన్స్ ఎక్స్‌ప్లోర్ చేసారు ప్రశాంత్ నీల్. సుకుమార్, రామ్ చరణ్ సినిమా షూటింగ్ కూడా ఎక్కువ భాగం ఫారెన్‌లోనే జరగనున్నట్లు తెలుస్తుంది. రంగస్థలం, పుష్ప పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో చేసిన సుక్కు.. ఈసారి నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో తరహాలో ఓల్డ్ స్కూల్‌కు వెళ్తున్నారని ప్రచారం జరుగుతుంది. పెద్దికి పూర్తి భిన్నంగా సుకుమార్ సినిమా ఉండబోతుంది. 2027లో ఇది సెట్స్‌పైకి వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వాహనదారులకు బిగ్ అలర్ట్‌.. ఈ రూల్స్ తెలియకపోతే మీ జేబుకు చిల్లే!

నాన్నా ఒక్క అడుగు ముందుకు వెయ్యి.. దువ్వూరు కుటుంబ విషాదం వెనుక సీసీటీవీ బయటపెట్టిన నిజాలు

నిన్న కటిక నేలపై.. నేడు హాయిగా కుర్చీలో.. సిద్ధిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో పరిస్థితి ఇదీ

ప్రెగ్నెన్సీ నుంచి బిడ్డకు 6 నెలలు వచ్చే వరకు.. రూ.4 లక్షలు ఖర్చు.. మరి చదువుల సంగతి?

మధుమేహం, గుండె జబ్బులు లేని “డిజైనర్‌ బేబీస్‌”

Follow Us