AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హాలీవుడ్ హవా మామూలు కాదు.. ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న 3 ఇంగ్లీష్ సినిమాలు

హాలీవుడ్ హవా మామూలు కాదు.. ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న 3 ఇంగ్లీష్ సినిమాలు

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Jun 19, 2026 | 6:55 PM

Share

ఒకప్పుడు భారత బాక్సాఫీస్‌పై పెద్దగా ప్రభావం చూపని హాలీవుడ్ సినిమాలు ఇప్పుడు పరిస్థితిని పూర్తిగా మార్చేస్తున్నాయి. ‘అబ్సెషన్’, క్రిస్టోఫర్ నోలెన్ తెరకెక్కిస్తున్న ‘ది ఒడిస్సీ’, ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ చిత్రాలు భారత ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్, సోషల్ మీడియా ట్రెండ్స్ చూస్తుంటే ఈ సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇండియాలో హాలీవుడ్ సినిమాలు ఎవరు చూస్తారు.. చూసినా మన సినిమాలను డిస్టర్బ్ చేసే రేంజ్ వాటికెక్కడ ఉంటుంది అనుకుంటారు. కానీ ఈ మధ్య సీన్ మారిపోతుంది. ఇంగ్లీష్ మూవీస్ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రఫ్ ఆడిస్తున్నాయి.. ఏ మాత్రం లైట్ తీసుకున్నా మన సినిమాలకే ఎర్త్ పెడుతున్నాయి. తాజాగా ఓ మూడు హాలీవుడ్ సినిమాలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. అబ్సెషన్.. గత రెండు మూడు వారాలుగా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర బాగా వినిపిస్తున్న పేరు ఇది. మైఖేల్ జాన్స్టన్, ఇండే నవారెట్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని ఫేమస్ యూ ట్యూబర్ కర్రీ బార్కర్ డైరెక్ట్ చేసారు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన అబ్సెషన్.. హాలీవుడ్‌నే కాదు ఇండియన్ బాక్సాఫీస్‌ను కొల్లగొడుతుంది. ఇప్పటికే 80 కోట్లు వసూలు చేసి 100 కోట్ల వైపు అడుగులేస్తుంది. అబ్సెషన్ చూసి సోషల్ మీడియాలో స్పెషల్ రివ్యూలు పోస్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్.. దాంతో మరింత ఆదరణ పెరుగుతుంది. అలాగే ఇండియాలో ట్రెండ్ అవుతున్న మరో సినిమా ది ఒడిస్సీ. క్రిస్టోఫర్ నోలెన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం జూలై 17న విడుదల కానుంది.. ముంబైలో జరగబోయే ప్రీమియర్‌కు నోలెన్ రానున్నారు. గ్రీకు కవి రాసిన హోమర్ అనే కావ్యం ఆధారంగా ఒడిస్సీని తీశారు నోలెన్. పూర్తిగా ఐమాక్స్ కెమెరాలతో తీసిన ది ఒడిస్సీ టికెట్ ధరలు మెట్రో సిటీస్‌లో 3 వేల వరకు ఉన్నాయి. అయినా కూడా ఎగబడి కొంటున్నారు ఆడియన్స్. అలాగే స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే సినిమాపై కూడా ఇండియాలో భారీ అంచనాలున్నాయి. వరల్డ్ వైడ్‌గా జూలై 31న విడులవుతుంటే.. మన దగ్గర ఓరోజు ముందే వస్తున్నాడు స్పైడర్ మ్యాన్. ఈ మూడు సినిమాలు ప్రస్తుతం బాగా ట్రెండ్ అవుతున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వాహనదారులకు బిగ్ అలర్ట్‌.. ఈ రూల్స్ తెలియకపోతే మీ జేబుకు చిల్లే!

నాన్నా ఒక్క అడుగు ముందుకు వెయ్యి.. దువ్వూరు కుటుంబ విషాదం వెనుక సీసీటీవీ బయటపెట్టిన నిజాలు

నిన్న కటిక నేలపై.. నేడు హాయిగా కుర్చీలో.. సిద్ధిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో పరిస్థితి ఇదీ

ప్రెగ్నెన్సీ నుంచి బిడ్డకు 6 నెలలు వచ్చే వరకు.. రూ.4 లక్షలు ఖర్చు.. మరి చదువుల సంగతి?

మధుమేహం, గుండె జబ్బులు లేని “డిజైనర్‌ బేబీస్‌”

Follow Us