వాట్ ఏ టైటిల్.. వాళ్ల రూట్‌లో అనిల్ రావిపూడి..!
టాలీవుడ్‌లో వినూత్నమైన టైటిల్స్‌కు చిరునామాగా నిలిచిన అనిల్ రావిపూడి మరోసారి ఆసక్తికరమైన పేరుతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న మల్టీస్టారర్‌కు ‘జనవరి 13న విడుదల’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. కథకు తగ్గట్టుగా టైటిల్‌ను జస్టిఫై చేయడంలో దిట్టైన అనిల్, ఈసారి కూడా ప్రమోషన్లను ముందుగానే మొదలుపెట్టినట్టే కనిపిస్తోంది.
ఓ సినిమాకు ముందుగా ఆకర్షించేది టైటిలే. అది కానీ బాగా కుదిరిందా సగం సినిమా సక్సెస్ అయినట్లే. ప్రమోషన్ కూడా అక్కడ్నుంచే మొదలవుతుంది. అందుకే ఈ విషయంలో అనిల్ రావిపూడి రూటే వేరు. ఒకప్పటి EVV, జంధ్యాలను గుర్తు చేసేలా వెరైటీ టైటిల్స్ వైపు అడుగులేస్తుంటారు. ఇప్పుడూ ఇదే చేస్తున్నారు. ఈసారి అనిల్ క్రియేటివిటీ మామూలుగా లేదు. మరి అదేంటో చూద్దామా..? అనిల్ రావిపూడి.. సక్సెస్ మిషన్ ఆఫ్ టాలీవుడ్..! ప్రతీసారి పండక్కి రావడం.. బాక్సాఫీస్ బద్దలు కొట్టడం.. 3 నెలల్లో మరో కథ రాయడం.. ఆర్నెళ్లలో సినిమా తీయడం.. మళ్లీ సంక్రాంతి రేసు.. రిపీటూ అన్నట్లుంటుంది అనిల్ తీరు. ఇప్పుడూ ఇదే చేస్తున్నారీయన. వెంకటేష్, కళ్యాణ్ రామ్‌తో చేయబోయే మల్టీస్టారర్‌ను పండక్కే రెడీ చేస్తున్నారు. జూన్ 22 నుంచి షూట్ షురూ కానుంది. కథ, స్క్రీన్ ప్లే విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో.. టైటిల్ దగ్గర కూడా అలాగే ఉంటారు అనిల్ రావిపూడి. ఒకప్పటి ఈవీవీ, జంద్యాల లాంటి లెజెండ్స్‌ని గుర్తు చేసేలా ఈయన టైటిల్స్ విభిన్నంగా ఉంటాయి. సంక్రాంతికి వస్తున్నాం అంటూ బ్లాక్‌బస్టర్ కొట్టినా.. ఎఫ్ 2 అంటూ ఫన్ అండ్ ఫ్రస్టేషన్ చూపించినా.. చిరంజీవి ఒరిజినల్ నేమ్ శంకరవరప్రసాద్ గారు అని పెట్టినా అన్నీ అనిల్‌కే సాధ్యం. వెంకీ, కళ్యాణ్ రామ్ సినిమాకు ‘జనవరి 13న విడుదల’ అనే డిఫెరెంట్ టైటిల్ పరిశీలనలో ఉంది. సంక్రాంతికి వస్తున్నాం టైటిల్‌ను కథలో జస్టిఫై చేసినట్లే.. ఈసారి అదే చేయాలని చూస్తున్నారు అనిల్. ఒకవేళ టైటిల్ ఇదే అయితే మాత్రం.. టైటిల్‌తో పాటే రిలీజ్ డేట్ కూడా చెప్పినట్లే అవుతుంది. మొత్తానికి ముహూర్తానికి ముందే ప్రమోషన్స్‌తో పిచ్చెక్కిస్తున్నారు ఈ దర్శకుడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఈ రూల్స్ తెలియకపోతే మీ జేబుకు చిల్లే!
నాన్నా ఒక్క అడుగు ముందుకు వెయ్యి.. దువ్వూరు కుటుంబ విషాదం వెనుక సీసీటీవీ బయటపెట్టిన నిజాలు
నిన్న కటిక నేలపై.. నేడు హాయిగా కుర్చీలో.. సిద్ధిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో పరిస్థితి ఇదీ
ప్రెగ్నెన్సీ నుంచి బిడ్డకు 6 నెలలు వచ్చే వరకు.. రూ.4 లక్షలు ఖర్చు.. మరి చదువుల సంగతి?
ప్రెగ్నెన్సీ నుంచి బిడ్డకు 6 నెలలు వచ్చే వరకు.. రూ.4 లక్షలు ఖర్చు
130 అడుగుల ఎత్తునుంచి పడినా బ్రతికే ఉంది..
గుడ్ల రక్షణకు ప్రాణాలను పణంగా పెట్టిన మాతృప్రేమ
ఒక సాధారణ వెల్డర్.. రాత్రికి రాత్రి కోటీశ్వరుడు ఎలా అయ్యాడు!
మాయమైపోతున్న మాన్సూన్.. రైతుల్లో టెన్షన్ టెన్షన్
బద్రీనాథ్ క్షేత్రానికి ముఖేశ్ అంబానీ కళ్లు చెదిరే విరాళం
ఆస్తులు పంచి అంత్యక్రియల ఖర్చులు అకౌంట్లో వేసి. కుటుంబం ఆత్మహత్య

