AP Inter Toppers 2026: ఏపీ ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన అమ్మాయిలు.. టాప్ ర్యాంకులన్నీ వారివే
ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలు 2026 బుధవారం (ఏప్రిల్ 15) ఉదయం 10.31 గంటలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజా ఫలితాల్లో దాదాపు అన్ని జిల్లాల్లో అన్ని కాలేజీల్లో అమ్మాయిలే టాపర్లుగా నిలిచారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల్లో అబ్బాయిలు..

అమరావతి, ఏప్రిల్ 15: ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలు 2026 బుధవారం (ఏప్రిల్ 15) ఉదయం 10.31 గంటలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజా ఫలితాల్లో దాదాపు అన్ని జిల్లాల్లో అన్ని కాలేజీల్లో అమ్మాయిలే టాపర్లుగా నిలిచారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల్లో అబ్బాయిలు 2,28,908 రాయగా.. 1,65,859 మంది (72 శాతం) ఉత్తీర్ణత పొందారు. సెకండ్ ఇయర్‌లో 2,14,620 మంది పరీక్షలు రాయగా..1,63, 804 మంది (76 శాతం) మంది ఉత్తీర్ణత పొందారు. ఇక ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల్లో అమ్మాయిలు 2,42,956 మంది రాయగా.. 1,95,667 మంది (81 శాతం) ఉత్తీర్ణత పొందారు. ఇంటర్ సెకండ్ ఇయర్‌లో 2,31,917 మంది పరీక్షలు రాయగా.. వీరిలో 1,96,012 మంది (85 శాతం) ఉత్తీర్ణత పొందారు.
ఏపీ ఇంటర్ ఫలితాల 2026 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఈ ఏడాది ఇంటర్ ఫలితాల్లో విద్యార్ధులు గరిష్ఠ స్థాయిలో ఉత్తీర్ణత సాధించడం విశేషం. గత 12 ఏళ్ల చరిత్రలో కనీవినని రీతిలో ఉత్తీర్ణత నమోదైంది. ఈ ఏడాది ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో 5,10,307 మంది, సెకండ్ ఇయర్‌లో 5,05,609 మంది విద్యార్ధులు (జనరల్, ఓకేషన్) పరీక్షలు రాశారు. మొత్తం10,15,916 మంది రాయగా.. వీరిలో ఫస్ట్ ఇయర్‌లో 77 శాతం, సెకండ్ ఇయర్‌లో 81 శాతం ఉత్తీర్ణత సాధించారు. జిల్లాల వారీగా చూస్తే ఏపీ ఇంటర్ ఫలితాల్లో కృష్ణా జిల్లా అత్యధికంగా ఉత్తీర్ణత శాతం నమోదు చేసింది. ఏకంగా 92 శాతం మార్కులతో సత్తా చాటింది. ఆ తర్వాత స్థానంలో గుంటూర్ 88 శాతం, ఎన్టీఆర్ జిల్లా 87 శాతం మార్కులతో అదరగొట్టాయి.
ఇంటర్ ఫలితాల్లో అత్యల్ప ఉత్తీర్ణత అన్నమయ్య జిల్లాల్లో నమోదైంది. ఈ జిల్లాలో ఫస్ట్ ఇయర్‌లో 11,832 మంది పరీక్షలు రాయగా.. వీరిలో 7,981 మంది (67 శాతం), సెకండ్ ఇయర్‌లో 12886 మంది పరీక్షలు రాయగా.. 7,969 మంది (62 శాతం)విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




