AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar Card: ఆధార్ ఇంట్లో మర్చిపోయారా..? మీ వాట్సప్‌లోనే సులువుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.. ఈ నెంబర్‌కు మెస్సేజ్ చేస్తే..

మీకు అర్జంట్‌గా ఆధార్ కార్డు అవసరం పడిందా.. కానీ మీ దగ్గర అందుబాటులో లేదా.. అయితే ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీ వాట్సప్ నుంచే సులువుగా డౌన్ లోడ్ చేసుకుని ఉపయోగించుకోవచ్చు. నిమిషాల్లోనే ఈ ప్రక్రియ పూర్తవుతుంది. ఎలా అంటే..

Aadhaar Card: ఆధార్ ఇంట్లో మర్చిపోయారా..? మీ వాట్సప్‌లోనే సులువుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.. ఈ నెంబర్‌కు మెస్సేజ్ చేస్తే..
Aadhaar Download
Venkatrao Lella
|

Updated on: Aug 13, 2026 | 1:28 PM

Share

ఆధార్ ఎప్పుడు అవసరం పడుతుందో తెలియదు. దీంతో చాలామంది తమ వెంటే ఎల్లప్పుడూ క్యారీ చేస్తూ ఉంటారు. వ్యాలెట్‌లో ఆధార్ కార్డు అందుబాటులో ఉంచుకుంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతీ సర్వీస్, సేవలు పొందేందుకు ఈ కార్డు తప్పనిసరిగా మారింది. ఈ కారణం వల్ల నిరంతరం మన జేబులో ఉంచుకోవాల్సి వస్తోంది. కొంతమంది ఇంట్లో ఆధార్ కార్డు పెట్టి మర్చిపోతుంటారు. ఇలాంటి సమయంలో ఆధార్ అవసరమైతే ఇంటికి వెళ్లడం లేదా కుటుంబసభ్యులు ఫొటో తీసి పంపించడం లాంటివి అవసరం లేదు. మీరే స్వయంగా వాట్సప్ ద్వారా నిమిషాల వ్యవధిలోనే ఈ-ఆధార్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ ఎలా అనేది ఇప్పుడు చూద్దాం.

వాట్సప్ ద్వారా ఆధార్ డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా?

-మందుగా +91-9013151515 నంబర్‌ను మీ ఫోన్‌లో సేవ్ చేసుకోవాలి

-అనంతరం వాట్సప్ ఓపెన్ చేసి ఆ నెంబర్‌కు హాయ్ లేదా నమస్తే అని మెస్సేజ్ పంపాలి

-ఆ తర్వాత వచ్చే ఆప్షన్లలో డిజిలాకర్ సర్వీసెస్ ఎంచుకోవాలి

-డిజిలాకర్ వివరాలతో లాగిన్ అవ్వాలి

-డిజిలాకర్ లాగిన్స్ లేకపోతే ముందుగా వాటిని సృష్టించుకోవాలి. డిజిలాకర్ వెబ్ సైట్ లేదా యాప్ ద్వారా క్రియేట్ చేసుకోవచ్చు

-ఆ తర్వాత ఆధార్ నెంబర్ నమోదు చేయాలి

-ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాలి

-అనంతరం డిజిలాకర్‌లో మీ పత్రాల జాబితా కనిపిస్తుంది. అందులో ఆధార్ ఆప్షన్ ఎంచుకోవాలి

-అనంతరం పీడీఎఫ్ ఫార్మట్‌లో మీ ఆధార్ వస్తుంది

-దానిని డౌన్ లోడ్ చేసుకుని ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు.

ఏవేవి అవసరం..

ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నెంబర్ ఉండాలి. అలాగే డిజిలాకర్ అకౌంట్ కలిగి ఉండాలి. ఆ డాక్యుమెంట్ డిజిలాకర్‌లో సేవ్ చేసుుని ఉండాలి. అక్కడ సేవ్ చేసి ఉండకపోతే మీరు డౌన్ లోడ్ చేసుకోలేరు. ఇక వాట్సప్ ఇంటర్ ఫేస్ ద్వారా ఒకసారి ఒక పత్రాన్ని మాత్రమే డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఆధార్‌తో పాటు పాన్ లాంటివి ఒకేసారి డౌన్ లోడ్ చేసుకోలేరు. చాలామందికి ఈ ఆప్షన్ ఉందని తెలియక ఉపయోగించుకోలేకపోతున్నారు. చాలామంది యూఐడీఏఐ వెబ్ సైట్ లేదా ఆధార్ యాప్‌లోకి వెళ్లి ఈ-ఆధార్ డౌన్ లోడ్ చేసుకుంటారు. కానీ అలాంటి అవసరం లేకుండా వాట్సప్‌లోనే సులువుగా ఈ ప్రక్రియ ఉపయోగించి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. రెండు, మూడు నిమిషాల్లోనే ఈ పని పూర్తవుతుంది. ఈ-ఆధార్‌ను ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు.

Follow Us