AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tech Tips: వర్షంలో ఫోన్ తడిచిందా?.. టెన్షనొద్దు.. జస్ట్ ఈ 5 స్టెప్స్ ఫాలో అవ్వండి చాలు!

వర్షాకాలంలో సాధారణంగా బయటకు వెళ్లినప్పుడు.. వర్షం వచ్చి మన ఫోన్, ల్యాప్‌ట్యాప్ వంటి తడిచిపోతూ ఉంటాయి. అలా తడిచిన వాటిని రిపేర్ చేయించాలంటే పెద్ద ఖర్చే అవుతుంది. కాబట్టి ఈ రెయినీ సీజన్‌లో పొరపాటు ఫోన్ తడిస్తే.. దాన్ని ఇంట్లోనే ఈజీగా ఎలా బాగు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

Tech Tips: వర్షంలో ఫోన్ తడిచిందా?.. టెన్షనొద్దు.. జస్ట్ ఈ 5 స్టెప్స్ ఫాలో అవ్వండి చాలు!
Water Damaged Phone Repair
Anand T
|

Updated on: Aug 13, 2026 | 1:35 PM

Share

వర్షకాలంలో వాన ఎప్పుడు వస్తుందో మనం అస్సలు గెస్ చేయలేం. ఇప్పుడు వర్షం ఏం రాదులే అనుకొని మనం బయటకువెళ్లిన సమయంలోనే కరెక్ట్‌గా వర్షం వస్తుంది. అప్పుడు మన తడవడంతో పాటు మన పాకెట్‌లో ఉన్న మొబైల్ కూడా తడిచిపోతుంది. అంతేకాదు వర్షం నుంచి తప్పించుకోవడానికి పరిగెత్తే క్రమంలో ఫోన్ చేయి జారి నీటిలో కూడా పడిపోవచ్చు. అలాంటప్పుడు ఫోన్ సరిగ్గా పనిచేయకపోతే ఏం చేయాలో తెలియక చాలా మంది టెన్షన్ పడతారు. తర్వాత మొబైల్ షాప్‌కు వెళ్లి రిపేర్ చేయించుకుంటారు. కానీ మీకు కొన్ని సింపుల్ చిట్కాలు తెలిస్తే.. ఇంట్లోనే మీ ఫోన్‌ను మళ్లీ పాతదానిలా మార్చుకోవచ్చు.

మొబైల్ ఫోన్ వర్షంలో తడిస్తే వెంటనే ఏం చేయాలి?

ఫోన్‌ను వెంటనే స్విచ్ ఆఫ్ చేయండి: ఒక వేళ మీ ఫోన్ వర్షం వల్ల తడిస్తే, ఆలస్యం చేయకుండా వెంటనే దాన్ని స్విచ్ ఆఫ్ చేయండి. అలాగే ఆన్‌లో పెడితే షార్ట్ సర్క్యూట్ జరిగి మదర్‌బోర్డ్ పాడైపోయే ప్రమాదం ఉంటుంది.

సిమ్ తీసేయండి: మీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన వెంటనే అందులో ఉన్న సిమ్ ట్రేని కూడా బయటకు తీయండి. దాంతో పాటు సిమ్ కార్డ్, మెమరీ కార్డ్‌లను కూడా బయటకు తీయాలి. దీనివల్ల ఫోన్ లోపలికి గాలి సరిగ్గా ఆరి, లోపల ఉన్న తేమ త్వరగా ఆరిపోతుంది.

పొడి గుడ్డతో తుడవండి: ఫోన్ పైన ఉన్న నీటిని శుభ్రమైన, పొడి పత్తి గుడ్డ లేదా టిష్యూ తీసుకొని నీటుగా తుడవండి. అయితే, ఫోన్‌ను ఆరబెట్టడానికి హేర్ డ్రైయర్ మాత్రం వాడకండి. ఎందుకంటే డ్రైయర్ నుండి వచ్చే వేడి గాలి ఫోన్ లోపలి సూక్ష్మ భాగాలను పాడు చేయొచ్చు.

చార్జ్ చేయవద్దు: తడిచిన ఫోన్‌ను ఎప్పుడు ఛార్జింగ్ పెట్టేందుకు ప్రయత్నించకండి. ఎందుకంటే ఇలా చేయడం ద్వారా కొన్ని షార్ట్ సర్క్యూట్ జరిగే ప్రమాదం ఉంటుంది. లేదా ఫోన్ హార్డ్‌వేర్ దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి ఫోన్ నీళ్లలో బాగా తడిస్తే కనీసం రెండు రోజుల వరకు దానికి చార్జింగ్ పెట్టకూడదు.

బియ్యంలో ఉంచండి: ఫోన్ బయటి భాగాన్ని మంచిగా తుడిచిన తర్వాత, దాన్ని బియ్యం ఉన్న డబ్బాలో ఉంచండి. బియ్యానికి తేమను త్వరగా పీల్చుకునే సహజ శక్తి ఉంటుంది. కనీసం 24 నుండి 48 గంటల పాటు ఫోన్‌ను బియ్యంలోనే ఉంచండి. మధ్య మధ్యలో ఫోన్‌ను బయటకు తీసి చెక్ చేసే తప్పు చేయకండి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి,

Follow Us