ఎప్పుడైనా ఆలోచించారా? ఇంట్లో ఒకటి కంటే ఎక్కు మనీ ప్లాంట్ మొక్కలు ఉండొచ్చా?

Samatha

13  August 2026

జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ప్రతి ఒక్కరూ వాస్తు నియమాలు పాటిస్తారు. కొంత మంది మాత్రమే వాటిని ఉల్లంఘిస్తారు.

అయితే చాలా మంది ఈ మధ్య కాలంలో వాస్తు పరంగా కలిసి రావాలి అని, ఇంటిలో ధనాభివృద్ధి జరగాలని మనీ ప్లాంట్ మొక్కలను నాటుకుంటున్నారు.

కొందరు కేవలం ఒక్క మొక్క మాత్రమే నాటితే మరికొంత మంది ఏకంగా రెండు మూడు అంతకు మించిన మొక్కలను కూడా తమ ఇంటిలో నాటుకుంటున్నారు.

మరి వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటిలో ఒకటి కంటే ఎక్కు మనీ ప్లాంట్ మొక్కలు ఉండొచ్చా అంటే? ఎక్కువ మనీ ప్లాంట్ మొక్కలు ఉండటంలో తప్పు లేదంట.

ఇంటిలో కేవలం ఒక్క మనీ ప్లాంట్ మొక్క మాత్రమే నాటుకోవాలని ఏం లేదు. ఎన్ని అయినా నాటు కోవచ్చు. కానీ మొక్కల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలంట.

ముఖ్యంగా తప్పకుండా ఆగ్నేయ దిశలో మనీ ప్లాట్ మొక్క ఒకటి ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. ఇది చాలా కీలకం.

అంతే కాకుండా మీరు ఇంటిలో పెట్టుకున్న మనీ ప్లాంట్ మొక్కలు, ఎప్పుడూ కూడా నేలవైపకు వంగి ఉండకుండా చూసుకోవాలి.

నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదని పాఠకులు గమనించాలి.