AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సొంతగడ్డపై ఆస్ట్రేలియాకు ఊహించని పరాభవం.. బంగ్లా దెబ్బకు 9 ఏళ్ల నాటి చెత్త రికార్డ్ బ్రేక్..!

Australia Embarrasses at Home: సొంతగడ్డపై ఆస్ట్రేలియా నమోదు చేసిన ఈ అవమానకర స్కోరు అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చింది. బంగ్లాదేశ్ వేగవంతమైన బౌలర్లు చూపించిన ప్రదర్శన టెస్టు క్రికెట్‌లో సరికొత్త శకానికి నాంది పలికింది. ఈ ఘోర పతనం నుంచి కోలుకుని ఆస్ట్రేలియా మ్యాచ్‌లో ఎలా పుంజుకుంటుందో రాబోయే రోజుల్లో చూడాలి.

సొంతగడ్డపై ఆస్ట్రేలియాకు ఊహించని పరాభవం.. బంగ్లా దెబ్బకు 9 ఏళ్ల నాటి చెత్త రికార్డ్ బ్రేక్..!
Aus Vs Ban 1st Test Records
Venkata Chari
|

Updated on: Aug 13, 2026 | 1:20 PM

Share

Australia vs Bangladesh 1st Test: డార్విన్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో ఆస్ట్రేలియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాట్ కమిన్స్ సేన మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 198 పరుగులకే కుప్పకూలింది. బంగ్లాదేశ్ పేసర్ హసన్ మహమూద్ దాటికి ఆసీస్ బ్యాటర్లు చేతులెత్తేయడంతో క్రికెట్ ప్రపంచంలో సంచలనం నమోదైంది.

బంగ్లాదేశ్ బౌలర్ల చేతిలో నలిగిపోయిన ఆసీస్..

డార్విన్‌లోని మర్రారా స్టేడియంలో ఆగస్టు 13న ప్రారంభమైన ఈ పోరులో ఆస్ట్రేలియా అత్యంత ఘోరమైన ప్రదర్శన ఇచ్చింది. ప్రత్యర్థి ప్రధాన బౌలర్ నాహిద్ రాణా జట్టులో లేకపోవడంతో భారీ స్కోరు సాధిస్తామని భావించిన ఆసీస్ అంచనాలు తలకిందులయ్యాయి. యంగ్ పేసర్ హసన్ మహమూద్ తన పదునైన బంతులతో విరుచుకుపడి 55 పరుగులకే 6 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి నడుము విరిచాడు. స్టీవ్ స్మిత్ ఒక్కడే 71 పరుగులతో పోరాడి కాస్త ఆదుకోగా, మిగతా బ్యాటర్లంతా ఘోరంగా విఫలమయ్యారు. దీంతో మొదటి రోజే ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ 198 పరుగులకే ముగిసిపోయింది.

ఎక్కువమంది చదివింది: 41 సిక్సర్లు, 39 ఫోర్లతో 487 పరుగులు.. భారీ ప్రపంచ రికార్డ్‌తో టీ20 హిస్టరీనే షేక్ చేశారుగా..!

ఇవి కూడా చదవండి

బంగ్లాపై చరిత్రలోనే అత్యల్ప స్కోరు నమోదు..

టెస్టు క్రికెట్ చరిత్రలో బంగ్లాదేశ్‌పై ఆస్ట్రేలియా సాధించిన అత్యల్ప స్కోరు ఇదే కావడం గమనార్హం. గతంలో 2017లో మీర్పూర్ గ్రౌండ్‌లో నమోదైన 217 పరుగుల స్కోరే ఇప్పటివరకు కనిష్టంగా ఉండేది. తాజాగా నమోదైన 198 పరుగుల స్కోరుతో తొమ్మిదేళ్ల నాటి ఆ పాత రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. రెడ్ బాల్ క్రికెట్ లో బంగ్లా జట్టుపై ఆస్ట్రేలియా 200 పరుగులు కూడా చేయలేకపోవడం ఇదే మొదటిసారి కావడంతో అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు.

చారిత్రక ఘనత సాధించిన హసన్ మహమూద్..

ఆస్ట్రేలియా గడ్డపై ఐదు వికెట్లు తీసిన బంగ్లాదేశ్ తొలి బౌలర్‌గా హసన్ మహమూద్ రికార్డుల్లోకెక్కాడు. గతంలో మహమ్మద్ రఫీక్ (5/62), షకీబ్ అల్ హసన్ (5/68) ఆసీస్‌పై ఐదు వికెట్లు సాధించినా, అవి సొంతగడ్డపై వేసిన స్పెల్స్ మాత్రమే. ఆస్ట్రేలియాలో 6/55 ప్రదర్శనతో హసన్ మహమూద్ అగ్రస్థానంలో నిలిచాడు. మరో ఆసక్తికర విషయమేమిటంటే, టెస్టుల్లో బంగ్లాదేశ్ వేగవంతమైన బౌలర్లు ఒకే ఇన్నింగ్స్‌లోని అన్ని 10 వికెట్లనూ పడగొట్టడం ఇది రెండోసారి. 2024లో రావల్పిండి వేదికగా పాకిస్తాన్‌పై సాధించిన తర్వాత, ఇప్పుడు ఆస్ట్రేలియాపై ఈ ఘనత పునరావృతమైంది.

ఎక్కువమంది చదివింది: Video: ట్రావిస్ హెడ్‌కి అసలైన మొగుడు ఎంట్రీ ఇచ్చేశాడుగా.. సొంతగడ్డపై దిమ్మతిరిగే షాక్..!

ఆసియా జట్లపై 4వ అత్యల్ప స్కోరు..

సొంతగడ్డపై ఆస్ట్రేలియా బలమైన జట్టుగా పేరుగాంచింది. ఆసియా ఖండానికి చెందిన జట్లపై టెస్టుల్లో ఆస్ట్రేలియాకు ఇది నాలుగో అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. 1981లో మెల్‌బోర్న్ మైదానంలో భారత్‌పై నమోదైన 83 పరుగులు ఇప్పటికీ అగ్రస్థానంలో ఉన్నాయి. ఆ తర్వాత 2024లో పెర్త్ మ్యాచ్‌లో భారత్‌పై 104 పరుగులు, 1973 సిడ్నీలో పాకిస్తాన్‌పై 184 పరుగులు నమోదు కాగా, ఇప్పుడు డార్విన్ లో బంగ్లాదేశ్ పై 198 పరుగులు చేసి ఆస్ట్రేలియా కొత్త అవమానకర రికార్డును మూటగట్టుకుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఎలుకల భయంతో వణికిపోతున్న బాలికల గురుకులం.. 3 రోజుల్లో ఆరుగురు..
ఎలుకల భయంతో వణికిపోతున్న బాలికల గురుకులం.. 3 రోజుల్లో ఆరుగురు..
బంగ్లా దెబ్బకు 9 ఏళ్ల నాటి చెత్త రికార్డ్ బ్రేక్ చేసిన ఆసీస్
బంగ్లా దెబ్బకు 9 ఏళ్ల నాటి చెత్త రికార్డ్ బ్రేక్ చేసిన ఆసీస్
భారీగా పెరగనున్న నిత్యావసర వస్తువుల ధరలు.. ఒకేసారి ఎంతంటే..?
భారీగా పెరగనున్న నిత్యావసర వస్తువుల ధరలు.. ఒకేసారి ఎంతంటే..?
22 ఏళ్ల వయస్సులోనే సివిల్స్ కొట్టిన తెలుగమ్మాయి.. టాప్ ర్యాంక్..
22 ఏళ్ల వయస్సులోనే సివిల్స్ కొట్టిన తెలుగమ్మాయి.. టాప్ ర్యాంక్..
బోనమెత్తిన సీరియల్ హీరోయిన్ ప్రియాంక.. ఫొటోస్ ఇదిగో
బోనమెత్తిన సీరియల్ హీరోయిన్ ప్రియాంక.. ఫొటోస్ ఇదిగో
ఈ కొండపై ఉన్న గొర్రెను 10 సెకన్లలో గుర్తిస్తే మీరే తోపులు!
ఈ కొండపై ఉన్న గొర్రెను 10 సెకన్లలో గుర్తిస్తే మీరే తోపులు!
సీఎస్కే హెడ్ కోచ్ రేసులో వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్..?
సీఎస్కే హెడ్ కోచ్ రేసులో వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్..?
బిల్ గేట్స్ కూతురుకు 20 ఏళ్ల జైలు శిక్ష..? అసలేంటీ కుకీ స్టఫింగ్
బిల్ గేట్స్ కూతురుకు 20 ఏళ్ల జైలు శిక్ష..? అసలేంటీ కుకీ స్టఫింగ్
ముగ్గురు ఆడబిడ్డల తర్వాత మగ సంతానం.. అయినా ఆస్పత్రిలోనే ఆమె ఈ పని
ముగ్గురు ఆడబిడ్డల తర్వాత మగ సంతానం.. అయినా ఆస్పత్రిలోనే ఆమె ఈ పని
IND vs SL: టీమిండియాకు వార్నింగ్ ఇచ్చిన శ్రీలంక కెప్టెన్..!
IND vs SL: టీమిండియాకు వార్నింగ్ ఇచ్చిన శ్రీలంక కెప్టెన్..!