AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sai Pallavi: మేడమ్ సార్ మేడమ్ అంతే.. మరో సర్‌ప్రైజింగ్ లుక్‌లో సాయి పల్లవి.. ట్రెండింగ్‌లో ‘అల్లం బెల్లం’ సాంగ్

మణి రత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఇంజి వెల్లం' చిత్రంలోని 'ఆచీ ఆచీ' పాట విడుదలైంది. ఈ పాటలో సాయి పల్లవి షార్ట్ హెయిర్ తో, గర్భవతిగా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. విజయ్ సేతుపతితో హీరోగా నటిస్తోన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Sai Pallavi: మేడమ్ సార్ మేడమ్ అంతే.. మరో సర్‌ప్రైజింగ్ లుక్‌లో సాయి పల్లవి.. ట్రెండింగ్‌లో 'అల్లం బెల్లం' సాంగ్
Sai Pallavi
Basha Shek
|

Updated on: Nov 26, 2026 | 8:49 AM

Share

ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తోన్న ‘ఇంజి వెల్లం’ (తెలుగులో అల్లం బెల్లం) సినిమా నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఆచీ.. ఆచీ’ పాట ఎట్టకేలకు విడుదలైంది. ఈ పాట సోషల్ మీడియాలో భారీ సంచలనం సృష్టిస్తోంది. ఈ పాట సంగీతంతో పాటు, నటి సాయి పల్లవి కొత్త లుక్ కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. గతంలో ‘ఓం’ సినిమాలో విభిన్నంగా కనిపించిన సాయి పల్లవి, ఇప్పుడు మళ్లీ పొట్టి జుట్టుతో మెరుస్తోంది. ఆమె ‘ఇంజి వెల్లం’ పాటలో గర్భిణీ పాత్రలో కనిపించింది. నిండు గర్భిణిగా ఉన్న ఈ అవతార్‌లో కూడా ఆమె చాలా ముద్దుగా కనిపిస్తోంది. అంతేకాకుండా ఎప్పటిలాగే తన ఎనర్జిటిక్ డ్యాన్స్ తో ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. ఈ పాట విడుదలైనప్పటి నుండి, ఆమె గెటప్ హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రంలో సాయి పల్లవి పాత్రపై ప్రేక్షకులలో చాలా ఆసక్తి నెలకొంది. ఆమె క్యాన్సర్ రోగి పాత్ర పోషిస్తోందని కొందరు ఊహిస్తున్నారు. మరికొందరు ఇది ఆమె భర్త విజయ్ సేతుపతి నుండి విడిపోవడం వెనుక ఉన్న కథ కావచ్చని అంటున్నారు. అయితే, చిత్ర బృందం ఇప్పటివరకు సాయి పల్లవి పాత్ర గురించి ఎలాంటి అప్డేట్స్ అధికారికంగా వెల్లడించలేదు.

ఇటీవల ‘రామాయణం’ చిత్ర సంగీతానికి విమర్శలు ఎదుర్కొన్న ఏ.ఆర్. రెహమాన్, ఈ పాటతో తిరిగి ఫామ్‌లోకి వచ్చారు. ఆయన ‘ఆచీ ఆచీ’ పాటకు అందించిన సంగీతం మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటోంది. సీత, నిత్యా రెడ్డి వంటి పాత్రల తర్వాత, సాయి పల్లవి ఇప్పుడు ‘ఇంజి వెల్లం’ చిత్రంతో ఒక కొత్త ప్రయోగాన్ని చేస్తోంది. ఆమె ఎప్పుడూ కొత్త పాత్రలనే ఎంచుకుంటూ ఉంటుంది. ఆమె ప్రత్యేకమైన పొట్టి జుట్టు లుక్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ చిత్రంలో సాయి పల్లవి కోసం మణిరత్నం ఎలాంటి ప్రత్యేకతను సృష్టించారో చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కాగా సాయిపల్లవి ఒకే నెలలో మూడు విభిన్న లుక్కుల్లో (రామాయణ, ఓ.ఎం., ఇంజి వెల్లం) కనిపించి సర్‌ప్రైజ్‌ చేసింది. రామాయణ, ఓం సినిమాలు రికార్డు కలెక్షన్లతో బాక్సాఫీస్ దుమ్ము దులిపాయి. ఇక ఫీల్ గుడ్ డైరెక్టర్ గా పేరున్న మణిరత్నం తెరకెక్కిస్తోన్న అల్లం బెల్లం సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. అందులోనూ ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయే విజయ్ సేతుపతి ఈ మూవీలో హీరోగా నటిస్తున్నాడు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి

సాయి పల్లవి కొత్త సినిమా సాంగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మరో సర్‌ప్రైజింగ్ లుక్‌లో సాయి పల్లవి.. కొత్త సినిమా పాట చూశారా?
మరో సర్‌ప్రైజింగ్ లుక్‌లో సాయి పల్లవి.. కొత్త సినిమా పాట చూశారా?
2 రోజుల్లోనే తెలంగాణ SI పరీక్ష.. ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ!
2 రోజుల్లోనే తెలంగాణ SI పరీక్ష.. ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ!
తిరుమలలో అరుదైన ఘట్టం.. శ్రీవారికి 121కిలోల భారీ బంగారు కానుక
తిరుమలలో అరుదైన ఘట్టం.. శ్రీవారికి 121కిలోల భారీ బంగారు కానుక
తోట వైకుంఠం అరుదైన కళాఖండాన్ని సొంతం చేసుకున్న ఎన్టీఆర్..
తోట వైకుంఠం అరుదైన కళాఖండాన్ని సొంతం చేసుకున్న ఎన్టీఆర్..
శ్రీలంకతో సెమీస్ పోరు.. అందరి చూపు సూర్యవంశీపైనే..
శ్రీలంకతో సెమీస్ పోరు.. అందరి చూపు సూర్యవంశీపైనే..
మిస్ యూనివర్స్ చరిత్రలో సంచలనం.. తొలిసారి తల్లికి అందాల కిరీటం!
మిస్ యూనివర్స్ చరిత్రలో సంచలనం.. తొలిసారి తల్లికి అందాల కిరీటం!
పదో తరగతి పరీక్ష ఫీజు 2027 చెల్లింపు షెడ్యూల్‌లో మార్పులు
పదో తరగతి పరీక్ష ఫీజు 2027 చెల్లింపు షెడ్యూల్‌లో మార్పులు
Honda CB500 బైక్ ఇంజిన్‌ గురించి తెలిస్తే షాకవుతారు
Honda CB500 బైక్ ఇంజిన్‌ గురించి తెలిస్తే షాకవుతారు
బేబీ మెడ చుట్టూ పేగు.. భయమేసింది.. హనుమాన్ చాలీసా చదివాం
బేబీ మెడ చుట్టూ పేగు.. భయమేసింది.. హనుమాన్ చాలీసా చదివాం
MBA చేయాలనుకునే వారికి అలర్ట్.. CMAT 2027 దరఖాస్తులు ప్రారంభం
MBA చేయాలనుకునే వారికి అలర్ట్.. CMAT 2027 దరఖాస్తులు ప్రారంభం