AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

41 సిక్సర్లు, 39 ఫోర్లతో 487 పరుగులు.. భారీ ప్రపంచ రికార్డ్‌తో టీ20 హిస్టరీనే షేక్ చేశారుగా..!

World Record T20 Match: పసికూన జట్లే అయినప్పటికీ, మైదానంలో ఈ రెండు జట్లు చూపించిన ధాటికి అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచం నోరెళ్లబెట్టింది. క్రికెట్‌లో చిన్నా పెద్దా తేడా లేకుండా నాణ్యమైన హిట్టింగ్ ఉంటే ఎలాంటి భారీ లక్ష్యాన్నైనా కరిగిపోతుందని ఈ మ్యాచ్ మరోసారి నిరూపించింది. రాబోయే మ్యాచ్‌లలోనూ ఇవే తరహా రికార్డులు నమోదవుతాయేమో వేచి చూడాలి.

41 సిక్సర్లు, 39 ఫోర్లతో 487 పరుగులు.. భారీ ప్రపంచ రికార్డ్‌తో టీ20 హిస్టరీనే షేక్ చేశారుగా..!
World Record Bulgaria Vs Gibraltar T20
Venkata Chari
|

Updated on: Aug 13, 2026 | 11:34 AM

Share

World Record T20 Match: క్రికెట్ చరిత్రలోనే ఎన్నడూ చూడని డేంజరస్ బ్యాటింగ్ ప్రదర్శనతో టీ20 ప్రపంచ రికార్డులు బద్దలయ్యాయి. బల్గేరియా, జిబ్రాల్టర్ జట్ల మధ్య జరిగిన పోరులో రన్ రేట్ ఏకంగా 14 దాటేసి సంచలనం సృష్టించింది. 244 పరుగుల కొండంత లక్ష్యాన్ని బల్గేరియా ఊహించని వేగంతో ఛేదించి, సరికొత్త చరిత్ర పుటల్లోకెక్కింది.!

41 సిక్సర్లతో దద్దరిల్లిన మైదానం..

సోఫియాలోని నేషనల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా జరిగిన ఈసీఎన్ బల్గేరియా టీ20 టోర్నమెంట్ మ్యాచ్ అభిమానులకు పూనకాలు తెప్పించింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న జిబ్రాల్టర్ జట్టు ఆరంభం నుంచే బాదుడే ధ్యేయంగా ముందుకు సాగింది. ఫిల్ రైక్స్ కేవలం 33 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్సర్లతో 73 పరుగులు చేసి ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఇయాన్ లాటిన్ 51 పరుగులతో మద్దతు ఇవ్వడంతో జిబ్రాల్టర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 243 పరుగుల భారీ స్కోరు సాధించింది. బల్గేరియా బౌలర్లలో జాకబ్ గుల్ 4 వికెట్లు తీసి పరుగుల ప్రవాహానికి కాస్త అడ్డుకట్ట వేశాడు.

ఎక్కువమంది చదివింది: Pakistan: డబ్బు కోసమే పాకిస్థాన్ ఆటగాళ్ల ఆరాటం.. మాజీ సెలెక్టర్ సంచలన వ్యాఖ్యలు..!

ఇవి కూడా చదవండి

కొండంత లక్ష్యం.. విధ్వంసకర ఛేదన..

244 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బల్గేరియా ఏమాత్రం ఒత్తిడికి గురికాకుండా బ్యాటింగ్ ప్రారంభించింది. జిబ్రాల్టర్ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా మొదటి ఓవర్ నుంచే ఊచకోత కోశారు. ఇసా జరూ కేవలం 24 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 69 పరుగులు చేసి పునాది వేశాడు. మిలెన్ గోగేవ్ 27 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లతో 69 పరుగులు చేసి మ్యాచ్‌ను పూర్తిగా తమవైపు తిప్పుకున్నాడు. వీరికి తోడుగా మనాన్ బషీర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.

టీ20 చరిత్రలోనే అత్యధిక రన్ రేట్..

మనాన్ బషీర్ కేవలం 21 బంతుల్లో 3 ఫోర్లు, 9 సిక్సర్లతో 70 పరుగులు చేసి జిబ్రాల్టర్ ఆశలపై నీళ్లు చల్లాడు. బల్గేరియా ఆటగాళ్ల విధ్వంసకర బ్యాటింగ్ దెబ్బకు 244 పరుగుల విక్టరీ టార్గెట్ కేవలం 14.2 ఓవర్లలోనే పూర్తయింది. ఈ మ్యాచ్‌లో రెండు జట్ల రన్ రేట్ కలిపి 14.18గా నమోదైంది. టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక రన్ రేట్ నమోదైన మ్యాచ్‌గా ఇది సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. గతంలో 2009లో న్యూజిలాండ్, స్కాట్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో నమోదైన 13.76 రన్ రేట్ రికార్డు ఇప్పుడు కనుమరుగైంది.

ఎక్కువమంది చదివింది: Video: ట్రావిస్ హెడ్‌కి అసలైన మొగుడు ఎంట్రీ ఇచ్చేశాడుగా.. సొంతగడ్డపై దిమ్మతిరిగే షాక్..!

రికార్డుల వేటలో మైలురాళ్లు..

ఈ చారిత్రక మ్యాచ్‌లో రెండు జట్ల బ్యాటర్లు కలిసి ఏకంగా 41 సిక్సర్లు బాదారు. కేవలం 35 ఓవర్ల వ్యవధిలోనే రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 487 పరుగులు నమోదవడం క్రీడా ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో మెరిసిన జాకబ్ గుల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. బుల్గేరియా సాధించిన ఈ గెలుపు టోర్నమెంట్‌లో వారికి అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చింది. కాగా, ఈ మ్యాచ్ జులై 11, 2025న జరిగింది. ఇప్పటికీ ఈ మ్యాచ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us