AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 CSK : 24 నెలల నిరీక్షణకు తెర.. మైదానంలో లేకున్నా ధోనీ మ్యాజిక్.. నూర్ సక్సెస్ వెనుక ‘తలా’ మాస్టర్ ప్లాన్

IPL 2026 CSK : ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మళ్లీ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. వరుస ఓటముల తర్వాత పుంజుకున్న ధోనీ సేన, తన హోమ్ గ్రౌండ్ చేపాక్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)పై 32 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.

IPL 2026 CSK : 24 నెలల నిరీక్షణకు తెర.. మైదానంలో లేకున్నా ధోనీ మ్యాజిక్.. నూర్ సక్సెస్ వెనుక 'తలా' మాస్టర్ ప్లాన్
Ipl 2026 Csk
Rakesh
|

Updated on: Apr 15, 2026 | 12:02 PM

Share

IPL 2026 CSK : ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మళ్లీ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. వరుస ఓటముల తర్వాత పుంజుకున్న ధోనీ సేన, తన హోమ్ గ్రౌండ్ చేపాక్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)పై 32 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ నూర్ అహ్మద్ హీరోగా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. అయితే, నూర్ అహ్మద్ ఈ రేంజ్ పెర్ఫార్మెన్స్ వెనుక అసలు మాస్టర్ మైండ్ మహేంద్ర సింగ్ ధోనీ ఉన్నారనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

నూర్ అహ్మద్ విజయంలో ధోనీ పాత్ర

కేకేఆర్‌పై నూర్ అహ్మద్ 4 ఓవర్లలో కేవలం 21 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. ఈ విజయం తర్వాత సీఎస్‌కే అసిస్టెంట్ బౌలింగ్ కోచ్ శ్రీరామ్ శ్రీధరన్ ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో ధోనీ, నూర్ అహ్మద్‌తో చాలా సేపు మాట్లాడారట. ముఖ్యంగా లెగ్ బ్రేక్ బంతులను ఎలా వేయాలో, బ్యాటర్లను ఎలా బోల్తా కొట్టించాలో ధోనీ కొన్ని విలువైన టిప్స్ ఇచ్చారు. ఆ సలహాలే నూర్‌ను మ్యాచ్ విన్నర్‌గా మార్చాయని కోచ్ స్పష్టం చేశారు. అజింక్య రహానే, కామెరాన్ గ్రీన్, రింకూ సింగ్ వంటి దిగ్గజాలను అవుట్ చేయడం ద్వారా నూర్ తన సత్తా చాటాడు.

24 నెలల రికార్డు బద్దలు

ఈ విజయం సీఎస్‌కేకు కేవలం రెండో గెలుపు మాత్రమే కాదు, ఒక సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు. 2024 ఏప్రిల్ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్‌లో వరుసగా రెండు మ్యాచ్‌లు గెలవడం ఇదే మొదటిసారి. దాదాపు 24 నెలల తర్వాత ఈ బ్యాక్ టు బ్యాక్ విక్టరీ రావడంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. వరుస ఓటములతో సతమతమైన జట్టు ఇప్పుడు సరైన లయను అందుకుంది.

మ్యాచ్ ఎలా సాగింది?

మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 192 పరుగులు చేసింది. సంజూ శాంసన్, డేవాల్డ్ బ్రెవిస్ మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడటంతో మంచి స్కోరు నమోదయ్యింది. అనంతరం 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్.. సీఎస్‌కే బౌలర్ల ధాటికి 160 పరుగులకే పరిమితమైంది. నూర్ అహ్మద్ తన స్పిన్‌తో కేకేఆర్ మిడిల్ ఆర్డర్‌ను కుప్పకూల్చగా, ఇతర బౌలర్లు కూడా క్రమశిక్షణతో బౌలింగ్ చేసి జట్టుకు విజయాన్ని అందించారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us