AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thaman: నీ అడ్రస్ పంపు బే.. నెటిజన్ ట్వీట్ పై తమన్ రియాక్షన్.. అసలు ఏం జరిగిందంటే..

సోషల్ మీడియాలో సినీతారలు ఎంత యాక్టివ్ గా ఉంటారో చెప్పక్కర్లేదు. నెట్టింట తమపై నెటిజన్స్ చేసే కామెంట్స్ పై పలువురు సెలబ్రెటీస్ రియాక్ట్ అవుతుంటారు. మరికొందరు చూసి చూడనట్టు వదిలేస్తుంటారు. తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కు కోపం తెప్పించాడు ఓ నెటిజన్. దీంతో తనదైన స్టైల్లో గట్టి కౌంటర్ ఇచ్చారు తమన్. అసలేం జరిగిందంటే..

Thaman: నీ అడ్రస్ పంపు బే.. నెటిజన్ ట్వీట్ పై తమన్ రియాక్షన్.. అసలు ఏం జరిగిందంటే..
Thaman
Rajitha Chanti
|

Updated on: Jun 26, 2025 | 8:11 AM

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో తమన్ ఒకరు. ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఓవైపు వరుస చిత్రాలతో క్షణం తీరిక లేకుండా ఉన్న తమన్.. ఇటు సోషల్ మీడియాలోనూ అంతే యాక్టివ్ గా ఉంటారు. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంటారు. అలాగే పలు అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు. అలాగే తన ఫాలోవర్ల పోస్టులకు రిప్లై ఇస్తుంటారు. అయితే తాజాగా ఓ నెటిజన్ తమన్ కు కోపం తెప్పించేలా కామెంట్ చేశారు. దీంతో తన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు తమన్. అసలు విషయానికి వస్తే.. తమన్.. ప్రతి సినిమాకు తమన్ ఏ రేంజ్ మ్యూజిక్ ఇస్తుంటారో తెలిసిందే. క్లాసిక్ అయినా.. మాస్ అయిన తన మ్యూజిక్ తో సినిమాను మరో రేంజ్ కు తీసుకువెళ్తుంటారు. అలాగే ఇటు క్రికెట్ లోనూ అదరగొట్టేస్తారు. సీసీఎల్ లీగ్ లో తెలుగు వారియర్స్ టీమ్ లో తమన్ కీలక ప్లేయర్ సైతం కూడా. అలాంటి ఓ క్రికెట్ వీడియోను షేర్ చేస్తూ డోంట్ బౌల్ షార్ట్ బాల్ బ్రో అంటూ పోస్ట్ చేశారు.

అయితే ఆ వీడియోకు ఓ నెటిజన్ రిప్లై ఇస్తూ తమన్ ను ఉద్దేశించి కామెంట్ చేశారు. షార్ట్ కు.. స్లాట్ కు తేడా తెలియనప్పుడే నాకు అర్థమైంది.. నువ్వు ధోని ఫ్యాన్ అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేశారు. ఇది చూసిన తమన్.. ఎప్పటిలాగే తన స్టైల్లో కౌంటరిచ్చాడు. “ఒకే రా.. వచ్చి నేర్చుకుంటా అడ్రస్ పంపు బే” అంటూ రిప్లై ఇచ్చారు తమన్. ఇప్పుడు ఇది కాస్తా నెట్టింట తెగ వైరల్ కావడంతో నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. ఆ వీడియోలో తమన్ చెప్పింది కరెక్ట్ అని.. నువ్వే అనవసరంగా తెలియకుండా కామెంట్ చేశావంటూ సదరు నెటిజన్ కు ఇచ్చిపడేస్తున్నారు. ఇలాంటి కామెంట్స్ ఎందుకు పట్టించుకుంటావ్ అన్నా.. వాళ్లను వదిలేయ్ అన్నా అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇక తమన్ విషయానికి వస్తే.. ప్రస్తుతం చేతి నిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇప్పుడు అఖండ 2, ఓజీ చిత్రాలకు మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ రెండు సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్స్ వేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ రెండు చిత్రాలు అడియన్స్ ముందుకు రానున్నాయి.

తమన్ ట్వీట్.. 

ఇవి కూడా చదవండి : 

Telugu Cinema: టాలీవుడ్ ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. ఇప్పుడేం స్పెషల్ సాంగ్స్‏తో రచ్చ చేస్తుంది.. ఈ క్యూటీ ఎవరంటే..

చేసిన సినిమాలన్నీ అట్టర్ ప్లాప్.. అయినా ఒక్కో సినిమాకు రూ.11 కోట్లు.. తెలుగువారికి ఇష్టమైన హీరోయిన్..

Nuvvostanante Nenoddantana: ఫ్యాషన్ ప్రపంచంలో స్టార్ హీరోయిన్.. మహిళలకు రోల్ మోడల్‏.. ఇప్పుడేం చేస్తుందంటే..

Tollywood: సినిమాలు వదిలేసి సన్యాసిగా మారిన హీరోయిన్.. కారణం ఇదేనట..

Follow Us
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం