AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఆ 23 మంది చావుకు కారణమెవరు? ఏపీలో సంచలనం సృష్టించిన సంఘటనపై తెరకెక్కిన రియల్ స్టోరీ.. మిస్ కావొద్దు

నిజ జీవితంలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. సున్నితమైన ప్రేమకథకు క్రైమ్ ఎలిమెంట్స్ ను జోడించి ఈ సినిమాను రూపొందించారు. ఇటీవల థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఓటీటీలోకి కూడా వచ్చేసింది.

OTT Movie: ఆ 23 మంది చావుకు కారణమెవరు? ఏపీలో సంచలనం సృష్టించిన సంఘటనపై తెరకెక్కిన రియల్ స్టోరీ.. మిస్ కావొద్దు
OTT Movie
Basha Shek
|

Updated on: Jun 27, 2025 | 6:31 PM

Share

ఎప్పటిలాగే ఈ శుక్రవారం (జూన్ 27) పలు కొత్త సినిమాలు, ఆసక్తికర వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. తెలుగుతో పాటు వివిధ భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు ఓటీటీ ఆడియెన్స్ కు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో ఒక ఆసక్తికరమైన తెలుగు సినిమా కూడా ఉంది. నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటలన ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. గత నెలలో థియేటర్లలో విడుదలైన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. పాజిటివ్ రివ్యూలతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా వచ్చాయి. అయితే పేరున్న నటీనటులు లేకపోవడంతో లాంగ్ రన్ ఆడలేకపోయింది. అయితే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. 1993 నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. ఒకే గ్రామానికి చెందిన సాగర్‌, సుశీల ఇద్దరూ ప్రేమించుకుంటారు. సాగర్‌కు దాస్ అనే మరో స్నేహితుడు కూడా ఉంటాడు. దళితులు కావడంతో బాగా అప్పట్లో బాగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాంటి సమయంలో ఏం చేయాలో తెలియక ఓసారి బస్సు దోపిడీ చేయాలనుకుంటారు. దానికోసం బెదిరించడానికి వెంట తెచ్చుకున్న పెట్రోల్ బస్సులో పోస్తారు. అయితే ప్రయాణికులు గగ్గోలు పెట్టడంతో కంగారులో బస్సుకు నిప్పంటిస్తాడు సాగర్. అంతే 23 మంది అక్కడికక్కడే సజీవ దహనం అయిపోతారు. అందులో చిన్న పిల్లలు కూడా ఉంటారు. దీంతో న్యాయ స్థానం వారికి ఉరి శిక్ష వేస్తుంది. అయితే ఈ ఘటన జరిగిన నాలుగేళ్లకు జూబ్లీ హిల్స్ బాంబు బ్లాస్టులో 28 మంది అమాయకులు చనిపోతారు. మరి ఈ పేలుడుకు కారణమైన వారికి కోర్టు ఏం తీర్పు ఇచ్చింది. వారికి కూడా ఉరిశిక్ష విధించిందా లేదా అనేదే ఈ సినిమా కథ.

దీనిని చదివిన చాలా మందికి ఈపాటికే అర్థమై ఉంటుంది మనం దేని గురించి మాట్లాడుకుంటున్నామో? 1993లో ఏపీలో సంచలనం సృష్టించిన చిలకలూరి పేట బస్సు దహనం, అంతకు ముందు చుండూరు మారణకాండ, అలాగే 1997 జూబ్లీ హిల్స్ బాంబు బ్లాస్టుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. మల్లేశం, 8 AM మెట్రో సినిమాలతో ట్యాలెంటెడ్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాజ్ రాచకొండ ఈ 23 (ఇరవై మూడు) సినిమాను తెరకెక్కించాడు. తేజ, తన్మయా, వేద వ్యాస్, ఝాన్సీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. గత నెలలో థియేటర్లలో రిలీజై మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .

Follow Us
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
కోడిలో ఏ భాగాన్ని తినకుండా ఉండాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే..!
కోడిలో ఏ భాగాన్ని తినకుండా ఉండాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే..!
పాన్ కార్డులో ఫొటోను ఇంట్లో నుంచే నిమిషాల్లో మార్చుకోండి..
పాన్ కార్డులో ఫొటోను ఇంట్లో నుంచే నిమిషాల్లో మార్చుకోండి..