AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఐదేళ్లుగా సినిమాల్లేవ్.. ఇప్పుడు ఒక్కో మూవీకి 40 కోట్లు.. ఈ అందాల తార ఆస్తులు 700 కోట్లకు పైనే

సాధారణంగా భారతీయ సినిమా ఇండస్ట్రీలో హీరోలకు మాత్రమే భారీగా రెమ్యునరేషన్లు ఉంటాయి. హీరోయిన్ల విషయంలో ఓ సినిమాకు రూ. 10 కోట్లు ఇస్తేనే గొప్ప. అలాంటిది ఈ క్రేజీ హీరోయిన్ మాత్రం ఒక్కో సినిమాకు రూ. 40 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటోంది.

Tollywood: ఐదేళ్లుగా సినిమాల్లేవ్.. ఇప్పుడు ఒక్కో మూవీకి 40 కోట్లు.. ఈ అందాల తార ఆస్తులు 700 కోట్లకు పైనే
Tollywood Actress
Basha Shek
|

Updated on: Jun 29, 2025 | 4:56 PM

Share

సినిమా ఇండస్ట్రీలో హీరోలతో పోల్చితే హీరోయిన్ల రెమ్యునరేషన్లు చాలా తక్కువ. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లుగా చెలామణి అవుతోన్న దీపికా పదుకునే, అలియా భట్, కరీనా కపూర్, కత్రినా కైఫ్, కియారా అద్వానీ తదితరులు కూడా 20 కోట్లకు పైగా రెమ్యునరేషన్లు తీసుకుంటున్నారు. ఇక దక్షిణాదిలో నయనతార, రష్మిక మందన్నా, త్రిష, సమంత లాంటి క్రేజీ హీరోయిన్లు ఒక్కో సినిమాకు రూ. 10 కోట్లు తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే హీరోయిన్ మాత్రం నెక్ట్స్ లెవెల్. భాషతో సంబంధం లేకుండా ఒక్కో సినిమాకు రూ. 30-40 కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకుంటోంది. తద్వారా భారతీయ సినిమాలో చరిత్రలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటోన్న హీరోయిన్ గా ఈ ముద్దుగుమ్మ రికార్డుల కెక్కింది. బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ సినిమాల్లోనూ నటించిన ఈ సొగసరికి అంతర్జాతీయ స్థాయిలోనూ మంచి గుర్తింపు ఉంది.

హాలీవుడ్ సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు, ఇంటర్నేషనల్ ఈవెంట్‌ల తో గ్లోబల్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుందీ ముద్దుగుమ్మ. త్వరలోనే తెలుగు ఆడియెన్స్ ను కూడా పలకరించేందుకు రెడీ అవుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు- రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో ఈ అందాల తారనే హీరోయిన్ గా ఎంపికైంది. ఈ పాటికే చాలా మందికి అర్థమై ఉంటుంది.. మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్. తను మరెవరో కాదు ప్రియాంక చోప్రా.

ఇవి కూడా చదవండి

ప్రియాంక చోప్రా లేటెస్ట్ ఫొటోస్..

View this post on Instagram

A post shared by Priyanka (@priyankachopra)

మహేష్ బాబు- రాజమౌళి సినిమా కోసం ప్రియాంక చోప్రా రూ. 30 కోట్ల పారితోషికం తీసుకుంటోందని తెలుస్తోంది. అయతే గతంలో సిటాడెల్ కోసం ప్రియాంక చోప్రా సుమారు $5 మిలియన్లు అంటే దాదాపు రూ.41 కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు వచ్చిన ఆ వెబ్‌ సిరీస్ మొత్తం రన్‌టైమ్ 6 గంటలు ఉంది. అదే క్రమంలో ప్రియాంకకు చెల్లించిన మొత్తం చాలా పెద్దది. ఇక ఈ ముద్దుగుమ్మకు ఇప్పటివరకు రూ.700 కోట్లకు పైగా ఆస్తులున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆమె భర్త, ప్రముఖ అమెరికన్ సింగర్ నిక్ జోనస్‌ నెట్‌వర్త్‌ సుమారు రూ.666 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. అలా వీరిద్దరి ఆస్తులు కలుపుకుని 1300 కోట్ల వరకూ ఉంటాయని తెలుస్తోంది.

View this post on Instagram

A post shared by Priyanka (@priyankachopra)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..