AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tech Tips: కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ చిట్కాతో నల్లగా మారిన కేబుల్‌ను క్షణాల్లో మెరిపించండి!

సాధారణంగా మనం మొబైల్‌ను ఛార్జ్ చేసేందుకు వాడే కేబుల్ ఎక్కువ రోజులు ఉపయోగించడం వల్ల మురికిగా, నల్లగా మారిపోతుంది. చూడటానికి కూడా చాలా అసహ్యంగా కనిపిస్తుంది. ఈ క్రమంలో చాలా మంది ఆ కేబుల్‌ను పడేసి కొత్తది కొంటూ ఉంటారు. కానీ ఓ చిన్న చిట్కా ఉపయోగించి మురికిగా మారిన కేబుల్‌ను కొత్తదానిలా మార్చవచ్చని చాలా మందికి తెలియదు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

Tech Tips: కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ చిట్కాతో నల్లగా మారిన కేబుల్‌ను క్షణాల్లో మెరిపించండి!
How To Clean Dirty Mobile Charging Cable At Home
Anand T
|

Updated on: Aug 05, 2026 | 1:26 PM

Share

ప్రస్తుత రోజుల్లో మొబైల్ ఫోన్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగమైపోయింది. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఫోన్ చేతిలో లేకపోతే చాలా మందికి రోజే గడవదు. అయితే ఫోన్‌ ఛార్జింగ్ చేయడానికి ఛార్జర్లను వాడుతూ ఉంటాం. వీటిని ఎక్కువ రోజులు వాడటం వల్ల ఛార్జింగ్ కేబుల్స్ నల్లగా, అసహ్యంగా మారిపోతాయి. చాలా మందికి వీటిని ఎలా క్లీన్ చేయాలో తెలియక, పాత వాటిని పడేసి కొత్త కేబుల్స్ కొంటూ ఉంటారు. కానీ ఒక చిన్న చిట్కాతో పాత కేబుల్‌ను కొత్తదానిలా మెరిపించవచ్చు.

మార్కెట్‌లో దొరికే ఐసోప్రొపైల్ ఆల్కహాల్, కాటన్ స్వాబ్ (దూది పింజ/పుల్ల), పెన్సిల్ ఎరేజర్, మైక్రోఫైబర్ క్లాత్ ఉపయోగించి ఛార్జింగ్ కేబుల్‌పై ఉన్న నల్లని మురికిని, ఛార్జింగ్ పిన్‌ను సులభంగా శుభ్రం చేయవచ్చు. అదెలాగో స్టెప్ బై స్టెప్ వివరంగా చూద్దాం.

మెటల్ కనెక్టర్ పిన్ శుభ్రం చేయడం:

మీ ఛార్జింగ్ కేబుల్‌కు ఉండే మెటల్ కనెక్టర్ పిన్ శుభ్రం చేయడానికి ముందుగా ఒక కాటన్ స్వాబ్‌ను తీసుకోండి. దాన్ని దాదాపు 70 శాతం ఐసోప్రొపైల్ ఆల్కహాల్‌లో ముంచి, ఎక్కువగా ఉన్న ద్రవాన్ని పిండేయండి. ఇప్పుడు ఆ కాటన్ స్వాబ్‌తో మెటల్ పిన్స్‌పై ఉన్న మురికి, ఆక్సిడేషన్‌ను తొలగించడానికి మెల్లగా రుద్దండి. తర్వాత పెన్సిల్ వెనుక ఉండే ఎరేజర్ తీసుకొని మెటల్ కాంటాక్ట్‌లపై ఉన్న నల్లటి మచ్చలను తుడువండి.

ఒకవేళ మెటల్ పిన్ కాలిపోయినట్లు, లోతుగా గుంట పడినట్లు లేదా కరిగిపోయినట్లు అనిపిస్తే, ఆ కేబుల్ పూర్తిగా పాడైపోయిందని అర్థం. దాన్ని ఎంత శుభ్రం చేసినా ఫలితం ఉండదు. మీ ఫోన్ పాడుకాకుండా ఉండాలంటే వెంటనే కొత్త కేబుల్‌ను కొనుగోలు చేయడం మంచిది.

ఛార్జింగ్ కేబుల్‌ను శుభ్రం చేయడం..

నల్లగా మారిన ఛార్జింగ్ వైరును క్లీన్ చేయడానికి ఒక మైక్రోఫైబర్ క్లాత్‌ను తీసుకొని, దాన్ని కొద్దిగా సబ్బు నీళ్లతో లేదా ఆల్కహాల్‌తో తడిపి వైరుపై మురికి ఉన్న ప్రాంతంలో శుభ్రంగా తుడువండి. తర్వాత దానిని ఒక పొడి గుడ్డతో మరకలు పోయేలా మరొకసారి తుడువండి. ఇలా చేసిన వెంటనే కేబుల్‌ను పవర్ సోర్స్‌కు లేదా ఫోన్‌కు కనెక్ట్ చేయకూడదు. దాదాపు 10–15 నిమిషాల పాటు దాన్ని పూర్తిగా ఆరనివ్వాలి. ఆ తర్వాతే ఉపయోగించాలి.

Note: ఫైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా అందించబడినవి.. వీటిని Tv9 దృవీకరించడం లేదు. వీటిపై మీకు సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us