AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hotel Wi-Fi: హోటల్‌లో వైఫై వాడితే మీ ఫోన్‌ స్క్రీన్ రికార్డ్ అవుతుందా..? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మీ ఖాతా ఖాళీ అవ్వాల్సిందే..

ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు చాలామంది పబ్లిక్ వైఫైను ఉపయోగిస్తున్నారు. ఇక హోటళ్లకు వెళ్లినప్పుడు అక్కడ అందుబాటులో ఉండే వైఫై వాడుతుంటారు. ఇలా ఉపయోగించడం వల్ల అనేక నష్టాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నికిలీ పేర్లతోవైఫై రౌటర్ ఏర్పాటు చేసి మిమ్మల్ని మోసగించే అవకాశముంటుంది.

Hotel Wi-Fi: హోటల్‌లో వైఫై వాడితే మీ ఫోన్‌ స్క్రీన్ రికార్డ్ అవుతుందా..? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మీ ఖాతా ఖాళీ అవ్వాల్సిందే..
Wifi Internet
Venkatrao Lella
|

Updated on: Aug 25, 2026 | 6:19 PM

Share

హోటల్‌కి వెళ్లినప్పుడు చాలామంది అక్కడ వై-ఫైను వాడుతూ ఉంటారు. అయితే దీని వల్ల ఫోన్‌లోని స్క్రీన్, ఆడియోతో పాటు ప్రతీది రికార్డ్ అవుతుందని చాలామంది హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు ఆన్‌లైన్‌లో అనేకమంది హెచ్చరిస్తున్నారు. దీంతో హోటల్‌లో వై-ఫైను ఉపయోగించడం మానేయాలని చెబుతున్నారు. హోటల్ వైఫై పబ్లిక్ వైఫై కిందకు వస్తుంది. మీతో పాటు చాలామందికి దానిని ఉపయోగిస్తున్నారు. దీని వల్ల హోటల్ వైఫై సురక్షితం కాదని, జాగ్రత్తగా వాడాలని నిపుణులు చెబుతున్నారు. ఓపెన్ నెట్‌వర్క్‌ల వల్ల నేరగాళ్లు సలువుగా మీ డివైస్‌లోకి చొరబడగలరు. అంతేకాకుండా మీ ఫోన్‌లోని సున్నితమైన సమాచారాన్ని దొంగలించే అవకాశం ఉంటుంది.

హోటళ్ల పేరుతో నకిలీ పేర్లు

సైబర్ నేరగాళ్లు బాగా పాపులర్ అయిన హోటల్, ఎయిర్‌పోర్ట్ లేదా కాపీ షాప్ పేర్లతో నకిలీ వైఫై హాట్‌స్పాట్లు సృష్టించే అవకాశముంది. అలాగే ఎన్‌క్రిప్టెడ్ నెట్‌వర్క్స్ ఉపయోగించడం, ఆటోమేటిక్ కనెక్షన్లను నివారించడం, పబ్లిక్ వైఫైలను వీపీఎన్‌లో వాడటం వంటివి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే హోటల్ వైఫైకి కనెక్ట్ అయినంత మాత్రాన మీ ఫోన్ స్క్రీన్ రికార్డ్ అవ్వదు. లేదా కెమెరాకు ఆటోమేటిక్‌గా యాక్సెస్ లభించదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే హానికరమైన సాఫ్ట్‌వేర్స్, దొగలించబడ్డ ఆధారాలు, దుర్వినియోగం చేయబడ్డ భద్రతా లోపాలు, రిమోట్ యాక్సెస్ సాఫ్ట్‌వేర్ వంటి మార్గాల ద్వారా మీ ఫోన్‌లోని సైబర్ నేరగాళ్లు చొరబడే అవకాశం ఉంటుందని అంటున్నారు.మీరు ఉపయోగిస్తున్న వైఫై పేరును లేదా వైఫై రూటర్‌ను ఉపయోగించి సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశముంటుంది. ఆటోమేటిక్‌గా తిరిగి కనెక్ట్ అయ్యేలా కాన్ఫిగర్ చేయబడిన ఒక పరికరం ఆ నకిలీ నెట్‌వర్క్‌లో చేసే అవకాశముంటుందని హెచ్చరిస్తున్నారు.

అసలైన పేరు తనిఖీ చేయండి

మీరు హోటల్‌లో వైఫై వాడుతుంటే అసలైన పేరును తనిఖీ చేయండి. అలాగే ఆటో కనెక్ట్ అవ్వగుండా ఆప్షన్ డిసేబుల్ చేసుకోండి. సురక్షితమైన నెట్‌వర్క్‌లకు ప్రయారిటీ ఇవ్వండి. సున్నితమైన సమాచారం ఉపయోగించేముందు వీపీఎన్ ఉపయోగించాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇక బస్టాండ్లు, మెట్రో స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, ఇతర పబ్లిక్ ప్రాంతాల్లో కూడా వైఫై వాడుతున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. నకిలీ వైఫై పేర్లతో మీ అకౌంట్లలోని డబ్బులను ఖాళీ చేసే అవకాశముంది. దీంతో బ్యాంకింగ్,ఇతర సున్నితమైన సమాచారం పబ్లిక్ వైఫై ఉపయోగించి వాడేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. వైఫై ద్వారా మీ ఫోన్‌లోని మాల్వేర్ పంపించి మీ ఫోన్‌ను హ్మాక్ చేసే అవకాశం కూడా ఉంటుంది.

Follow Us
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం
భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం
భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!
వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్
వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?
పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!
పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!
పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన
పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన
అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..
అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..
బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా
బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా