యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
తమిళనాడుకు చెందిన యూట్యూబర్ మధుమితపై ఐదు సవర్ల బంగారు గొలుసు చోరీకి సంబంధించిన ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. 2022లో తన వాహనంలో ప్రయాణించిన తర్వాత గొలుసు కనిపించకుండా పోయిందని 89 ఏళ్ల వృద్ధుడు ఫిర్యాదు చేసినట్లు కథనం చెబుతోంది. ఫిర్యాదు చేస్తే బెదిరించారని కూడా ఆయన ఆరోపించారు. ఇప్పటికే ఆమె ఇంట్లో బంగారం చోరీ, ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తు వార్తల నేపథ్యంలో ఈ కేసు చర్చనీయాంశమైంది.
తమిళనాడుకు చెందిన ప్రముఖ యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మధుమిత వివాదంలో చిక్కుకుంది. వృద్ధుడి మెడలోని ఐదు సవర్ల బంగారు గొలుసును దొంగిలించి, అడిగితే బెదిరింపులకు పాల్పడిందనే ఆరోపణలపై పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. రెండేళ్ల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం సోషల్ మీడియా వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. తిరునెల్వేలి జిల్లా కేటీసీ నగర్‌కు చెందిన 89 ఏళ్ల భవన నిర్మాణ కాంట్రాక్టర్ పేచ్చిముత్తుకు మధుమితతో పరిచయం ఉంది. 2022లో ఆమె ఆయన వాహనంలో ప్రయాణించి బస్ స్టాప్‌లో దిగింది. అనంతరం తన మెడలోని ఐదు సవర్ల బంగారు గొలుసు కనిపించకపోవడంతో పేచ్చిముత్తుకు అనుమానం వచ్చింది. వెంటనే గొలుసు గురించి మధుమితను ప్రశ్నించగా.. పోలీసులకు ఫిర్యాదు చేస్తే పరువు తీస్తానంటూ బెదిరించినట్లు ఆయన పోలీసుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పేచ్చిముత్తు రాజాక్కమంగళం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, సంఘటన స్థలం ఆధారంగా కేసును తిరునెల్వేలి పోలీసులకు బదిలీ చేసి విచారణ వేగవంతం చేశారు. సోషల్ మీడియాలో విలాసవంతమైన జీవితం, బంగారం మరియు నగదుతో రీల్స్ చేస్తూ మధుమిత పాప్యులారిటీ సంపాదించుకుంది. అయితే ఇటీవల ఆమె ఇంట్లో 118 సవర్ల బంగారం చోరీకి గురికావడం, ఆపై ఆదాయపన్ను శాఖ కూడా ఆమె ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తు చేపట్టడం సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో పాత బంగారం చోరీ కేసు కూడా ఆమె మెడకు చుట్టుకోవడంతో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఏఐతో రిస్క్ తప్పదు.. అయినా ఆపలేం!
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్.. నెటిజన్ల రియాక్షన్ ఇదే
Rashmika Mandanna: ఓవరాక్షన్, క్రింజ్ అంటారా.. ట్రోలర్స్‌కు ఇచ్చిపడేసిన రష్మిక
చిరు – ఓదెల సినిమాపై.. నాని షాకింగ్ కామెంట్స్! ఉన్నట్టా.. లేనట్టా.. అంటే..?
దిమ్మతిరిగే ఫోక్ సాంగ్‌తో.. కంబ్యాక్ ఇచ్చిన మాధురి రాథోడ్
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు
ఖరీదైన బట్టలు, చేతిలో రిచ్ లుక్ బ్యాగ్.. చేసేది మాత్రం..
చదువుకుంటాను.. సాయం చేయండి!

