AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిరు - ఓదెల సినిమాపై.. నాని షాకింగ్ కామెంట్స్! ఉన్నట్టా.. లేనట్టా.. అంటే..?

చిరు – ఓదెల సినిమాపై.. నాని షాకింగ్ కామెంట్స్! ఉన్నట్టా.. లేనట్టా.. అంటే..?

Phani CH
|

Updated on: Oct 09, 2026 | 5:45 PM

Share

‘ది ప్యారడైజ్‌’ సినిమా ఫలితంపై వచ్చిన మిశ్రమ స్పందన నేపథ్యంలో దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల తదుపరి ప్రాజెక్టులపై పలు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ముఖ్యంగా చిరంజీవితో చేయాల్సిన సినిమా ఆగిపోయిందనే ప్రచారంపై నాని స్పందించారు. సినిమా ఆలస్యం కావడంతో చిరంజీవి ఇతర కమిట్‌మెంట్లతో ముందుకు వెళ్లారని తెలిపారు. అయితే ప్రాజెక్ట్‌ ఆగిపోయిందని తాను చెప్పలేదని స్పష్టం చేశారు. చిరంజీవితో మాట్లాడిన తర్వాత ఈ సినిమా భవిష్యత్తుపై మరింత స్పష్టత వస్తుందని నాని పేర్కొన్నారు.

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన ‘ది ప్యారడైజ్’ భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఆశించిన స్థాయిలో సినిమా మెప్పించలేకపోవడంతో ఈ మూవీపై మిక్స్డ్ టాక్ వచ్చింది. కొంతమంది సినిమా అదిరిపోయింది అంటుంటే మరికొంతమంది మాత్రం సినిమా అంతగా లేదంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సినిమా ఫలితం ప్రభావం దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తదుపరి ప్రాజెక్టులపై పడిందంటూ సోషల్ మీడియాలో రకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఇదే సమయంలో శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవితో తెరకెక్కాల్సిన సినిమా కూడా ఆగిపోయిందనే ప్రచారం ఊపందుకుంది. అయితే తాజాగా ఈ రూమర్స్‌పై హీరో నాని రియాక్టయ్యారు.‘ది ప్యారడైజ్’ విడుదల తర్వాత తొలిసారి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాని.. సినిమా రిజల్ట్, శ్రీకాంత్ ఓదెల టాలెంట్, అలాగే చిరంజీవి ప్రాజెక్ట్ పై తన అభిప్రాయాలను పంచుకున్నారు. సినిమాను ఇంకా మెరుగ్గా తెరకెక్కించే అవకాశం ఉందని అభిప్రాయపడిన నాని.. అయితే ప్యారడైజ్ మూవీ ఫలితాన్ని పక్కన పెడితే శ్రీకాంత్ ఓదెల టాలెంట్‌పై తనకు ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశాడు. శ్రీకాంత్ దగ్గర చాలా బలమైన ఆలోచనలు ఉన్నాయని, అతడి ప్రతిభపై తనకు పూర్తి నమ్మకం ఉందని నాని చెప్పారు. ది ప్యారడైజ్ తర్వాత శ్రీకాంత్ మరింత బలంగా తిరిగి వస్తాడనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు నాని. ‘ది ప్యారడైజ్’ తర్వాత శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చిరంజీవితో సినిమా చేయాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్‌ను నాని ప్రొడక్షన్‌లో నిర్మిస్తున్నారు. ఈ సినిమాను చాలా కాలం క్రితమే అధికారికంగా ప్రకటించారు. అయితే ది ప్యారడైజ్ రిజల్ట్ నేపథ్యంలో చిరంజీవి ప్రాజెక్ట్‌కి బ్రేక్ పడిందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ప్రచారంపై నాని స్పందిస్తూ.. ది ప్యారడైజ్ ఆలస్యం కావడం వల్ల చిరంజీవి తన ఇతర ప్రాజెక్టులు, కమిట్‌మెంట్స్‌తో ముందుకు వెళ్లారని తెలిపారు. సినిమా ఆగిపోయిందని మాత్రం తాను చెప్పలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ది ప్యారడైజ్ తర్వాత తాను చిరంజీవిని కలవలేదని, ఇద్దరూ కూర్చొని మాట్లాడిన తర్వాత ఈ ప్రాజెక్ట్‌పై మరింత క్లారిటీ వస్తుందని నాని అన్నారు. దీంతో చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల సినిమా పూర్తిగా ఆగిపోయిందనే ప్రచారానికి నాని వ్యాఖ్యలు చెక్ పెట్టినట్టయ్యింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దిమ్మతిరిగే ఫోక్‌ సాంగ్‌తో.. కంబ్యాక్‌ ఇచ్చిన మాధురి రాథోడ్‌

Allu Arjun: శివాజీ మహరాజ్‌ గడ్డపై.. ఐకాన్ స్టార్‌ సేవా కార్యక్రమం

Kangana Ranaut: ఏఐతో అసభ్యక పోస్టులు.. కోర్టుకెక్కిన నటి

నిన్ను తీసుకెళ్లిన ఆ దేవుడిని చంపాలనిపిస్తోంది! నానా మరణంతో ఆర్జీవీలో ఉప్పొంగిన భావోద్వేగం

నానా పటేకర్ మృతి.. ఎన్టీఆర్‌ ఎమోషనల్ పోస్ట్

Follow Us