Kangana Ranaut: ఏఐతో అసభ్యక పోస్టులు.. కోర్టుకెక్కిన నటి
తనపై సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న అశ్లీల కంటెంట్, ఏఐతో రూపొందించిన నకిలీ పోస్టులను తొలగించాలని కోరుతూ నటి, ఎంపీ కంగనా రనౌత్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కంటెంట్ తన పరువుకు భంగం కలిగించడంతో పాటు వ్యక్తిత్వ హక్కులను ఉల్లంఘిస్తోందని ఆమె తరఫు న్యాయవాది వాదించారు. పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు ప్రతివాదులకు సమన్లు జారీ చేసినట్లు సమాచారం. ఇదే సందర్భంగా విజయ్ దేవరకొండ వ్యక్తిత్వ హక్కుల కేసును కూడా కోర్టు ప్రస్తావించింది.
నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తనపై సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న కొన్ని అశ్లీల, అసభ్యకరమైన కంటెంట్‌తో పాటు ఏఐ ద్వారా రూపొందించిన నకిలీ కంటెంట్‌ను తొలగించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఇలాంటి కంటెంట్ పరువుకు భంగం కలిగించడంతో పాటు వ్యక్తిత్వ హక్కులను ఉల్లంఘిస్తోందని ఆమె తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కంగనా రనౌత్ ప్రస్తుతం హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గురువారం ఆమె తరఫు న్యాయవాది ఢిల్లీ హైకోర్టులో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఇంటర్నెట్‌లో తనకు సంబంధించిన లైంగిక, అశ్లీల కంటెంట్‌తో పాటు.. తాను చెప్పని మాటలను చెప్పినట్లుగా చూపించే ఫేక్ న్యూస్, AI ద్వారా రూపొందించిన పోస్టులు కూడా ఉన్నాయని కోర్టుకు తెలిపారు. కంగనా దాఖలు చేసిన వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ పిటిషన్‌ను విచారించిన ఢిల్లీ హైకోర్టు ప్రతివాదులకు సమన్లు జారీ చేశారు. ఈ కేసులో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామని కోర్టు వెల్లడించినట్లు సమాచారం. ఇదే విచారణ సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ దాఖలు చేసిన వ్యక్తిత్వ హక్కుల కేసును కూడా ఢిల్లీ హైకోర్టు ప్రస్తావించింది. విజయ్ వ్యక్తిత్వాన్ని అనుమతి లేకుండా వాణిజ్యపరంగా ఉపయోగిస్తున్నారని ఆయన తరఫు న్యాయవాది ఆరోపించారు. వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ కోసం కోర్టును ఆశ్రయించిన సెలబ్రిటీల్లో కంగనా ఒక్కరే కాదు. ఐశ్వర్య రాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, సల్మాన్ ఖాన్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కల్యాణ్ తదితరులు కూడా తమ వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్, పాడ్‌కాస్టర్ రాజ్ శమానీ, క్రికెటర్ అభిషేక్ శర్మ కూడా ఇదే తరహాలో కోర్టును ఆశ్రయించారు. వీరిలో పలువురికి హైకోర్టు మధ్యంతర రక్షణ కల్పించింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నిన్ను తీసుకెళ్లిన ఆ దేవుడిని చంపాలనిపిస్తోంది! నానా మరణంతో ఆర్జీవీలో ఉప్పొంగిన భావోద్వేగం
నానా పటేకర్ మృతి.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్
Aggipetta Macha Game: అగ్గిపెట్టె మచ్చా మీద.. ఏకంగా గూగుల్ ప్లే స్టోర్‌లో గేమ్ ఉంది తెలుసా?
Bigg Boss Telugu 10: 15 లక్షల్లో.. మిథిలేష్‌కు మిగిలేది మరీ అంతేనా.. ఏదో అనుకున్నాడు పాపం!
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు
ఖరీదైన బట్టలు, చేతిలో రిచ్ లుక్ బ్యాగ్.. చేసేది మాత్రం..
చదువుకుంటాను.. సాయం చేయండి!
శివలింగం చుట్టూ నాగుపాముల ప్రదక్షిణలు
వామ్మో అంత రేటా..? కేజీ రూ. 83కి చేరిన సన్నబియ్యం..

