Aggipetta Macha Game: అగ్గిపెట్టె మచ్చా మీద.. ఏకంగా గూగుల్ ప్లే స్టోర్‌లో గేమ్ ఉంది తెలుసా?
తన మీమ్స్, వింత డైలాగులతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన అగ్గిపెట్టె మచ్చా అలియాస్ కిరణ్ కుమార్ పాత్రతో ఓ వీడియో గేమ్ రూపొందింది. ‘గేమ్ ఆన్ మీమ్’ లేదా ‘అగ్గిపెట్టె మచ్చా గేమ్’ పేరుతో గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులోకి వచ్చిన ఈ గేమ్‌లో ఆయన డైలాగులు, మీమ్ సౌండ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తాజాగా మచ్చా మరణవార్తతో ఆయన అభిమానులు విషాదంలో మునిగిపోయారు.
తన మీమ్స్‌తో.. రీల్స్‌తో సోషల్ మీడియాలో విపరీతంగా పాపులర్ అయిన అగ్గిపెట్టె మచ్చా..పేరు మీద ఓ వీడియో గేమ్ ఉంది తెలుసా.. ఆ వీడియో గేమ్ కూడా ఎక్కడో కాదు.. గూగుల్ ప్లే స్టోర్‌లోనే ఉంది తెలుసా? ఎస్ ! పెద్ద పెద్ద హీరోల పేరు మీద కూడా లేదా వాళ్ల ఫిల్మ్ క్యారెక్టర్స్ మీద వీడియో గేమ్స్ లేవు కానీ.. అగ్గిపెట్టె మచ్చా మీద మాత్రం పాపుల్ వీడియో గేమ్ అయితే ఉంది. అది అందర్నీ ఆకట్టుకుంది కూడా..! ఇక ఈ గేమ్ గురించి చర్చ జరుగుతున్న సమయంలోనే అగ్గిపెట్టె మచ్చా మరణించడం ఆయన ఫాలోవర్స్‌ను కలిచివేస్తోందిఇప్పుడు. అగ్గిపెట్టె మచ్చా ఇంటర్వ్యూలలో చెప్పిన వింత డైలాగులు, కోపంగా ఊగిపోతూ మాట్లాడే తీరు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. దీనిని గమనించిన “కూల్‌శాండ్ బాయ్” అనే ఇండిపెండెంట్ గేమ్ డెవలపర్ మచ్చా క్యారెక్టర్‌తో ఒక ఫన్నీ Stickman స్టైల్ గేమ్‌ను డిజైన్ చేశారు. ఇందులో ప్లేయర్స్ ‘అగ్గిపెట్టె మచ్చా’ క్యారెక్టర్‌ను కంట్రోల్ చేస్తూ శత్రువులతో ఫైట్ చేయాల్సి ఉంటుంది. మచ్చా ఫైట్ చేసేటప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో అతని రియల్ వాయిస్ మీమ్ సౌండ్స్, ఫేమస్ డైలాగులు వినిపిస్తూ గేమర్స్‌కు నవ్వు తెప్పిస్తాయి. Game on Meme’ లేదా ‘Aggipetti Macha Game’ పేరుతో గూగుల్ ప్లే స్టోర్‌లోకి వచ్చిన ఈ చిన్న గేమ్, తెలుగు మీమ్ లవర్స్ దెబ్బకి విపరీతమైన డౌన్‌లోడ్స్‌తో ఒకానొక దశలో ట్రెండింగ్‌లోకి వెళ్లి ప్లేస్టోర్‌ను షేక్ చేసింది. ఇక ఈ గేమ్ గురించి అంతటా చర్చ జరుగుతున్న సమయంలోనే ఒక తీవ్ర విషాదకరమైన వార్త బయటకు వచ్చింది. సోషల్ మీడియా స్టార్‌గా ఎంతో మందిని నవ్వించిన అగ్గిపెట్టె మచ్చా అలియాస్ కిరణ్ కుమార్ తిరుపతిలో అనారోగ్యంతో మరణించారు. తాను బ్రతికి ఉన్నప్పుడు తన మీమ్స్ అండ్ వీడియో గేమ్ ద్వారా వేలాది మందిని ఎంటన్ టైన్ చేసిన అగ్గిపెట్టె మచ్చా, ఇలా చిన్న వయసులోనే మరణించడంతో సోషల్ మీడియా ఫాలోవర్స్ అందరూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మచ్చాకు నివాళులు అర్పిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Bigg Boss Telugu 10: 15 లక్షల్లో.. మిథిలేష్‌కు మిగిలేది మరీ అంతేనా.. ఏదో అనుకున్నాడు పాపం!
OTTలో మెంటలెక్కించే క్రైమ్ థ్రిల్లర్ ఈ సినిమా ఎలా ఉందంటే…?
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు
ఖరీదైన బట్టలు, చేతిలో రిచ్ లుక్ బ్యాగ్.. చేసేది మాత్రం..
చదువుకుంటాను.. సాయం చేయండి!
శివలింగం చుట్టూ నాగుపాముల ప్రదక్షిణలు
వామ్మో అంత రేటా..? కేజీ రూ. 83కి చేరిన సన్నబియ్యం..

