AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: శివాజీ మహరాజ్‌ గడ్డపై.. ఐకాన్ స్టార్‌ సేవా కార్యక్రమం

Allu Arjun: శివాజీ మహరాజ్‌ గడ్డపై.. ఐకాన్ స్టార్‌ సేవా కార్యక్రమం

Phani CH
|

Updated on: Oct 09, 2026 | 5:42 PM

Share

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ అభిమాన సంఘం మహారాష్ట్రలో తన కార్యకలాపాలను విస్తరిస్తోంది. ముంబైలో జరిగిన కార్యక్రమంలో AAFA రాష్ట్ర కమిటీతో పాటు 10 జిల్లాల్లో జిల్లా కమిటీలను ఏర్పాటు చేశారు. అభిమానులను ఒకే వేదికపైకి తీసుకురావడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయడం ఈ కమిటీల లక్ష్యం. ఇందులో భాగంగా HPV నివారణ, వ్యాక్సినేషన్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రతి సంవత్సరం ఒక మంచి పని చేయాలనే లక్ష్యంతో సంఘం ముందుకు సాగుతోంది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఉన్న క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పుష్ప, పుష్ప 2 సినిమాలతో ఆయనకు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ఐకాన్ స్టార్ కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఈ నేపథ్యంలో పాన్ ఇండియా స్టార్‌గా బన్నీకి క్రేజ్ పెరుగుతున్న నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో అభిమానుల సంఘాలు కూడా మరింత గా పెరుగుతున్నాయి. తాజాగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ మహారాష్ట్రలో ఓ అడుగు ముందుకేసింది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ మహారాష్ట్ర రాష్ట్ర కమిటీని ముంబైలో జరిగిన కార్యక్రమంలో అధికారికంగా ఏర్పాటు చేశారు. దీంతో మహారాష్ట్రలో AAFA కార్యకలాపాలు మరింత విస్తరించనున్నాయి. రాష్ట్ర కమిటీతో పాటు పరభణి, నాందేడ్, ముంబై, పుణే, పాలం, హింగోలి, ఉమ్రి, సోలాపూర్, గడ్చిరోలి, షిర్డీ జిల్లాల్లో మొత్తం 10 జిల్లా కమిటీలను ఏర్పాటు చేశారు. సామాజిక బాధ్యతలో భాగంగా AAFA ఆధ్వర్యంలో HPV పై అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. HPV నివారణ, వ్యాక్సినేషన్‌పై ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం లక్ష్యం. మహారాష్ట్రలో AAFA నెట్‌వర్క్‌ను మరింత విస్తరించడంతో పాటు, అభిమానులను సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయాలని కొత్తగా ఏర్పాటైన కమిటీలు పనిచేయనున్నాయి. “ప్రతి సంవత్సరం ఒక మంచి పని” అనే AAFA లక్ష్యానికి అనుగుణంగా ఈ కార్యక్రమాలను కొనసాగించనున్నారు. ఇప్పటివరకు వ్యక్తిగతంగా, స్థానిక స్థాయిలో బన్నీ అభిమానుల కార్యక్రమాలు నిర్వహిస్తున్న అభిమానులను ఒకే వేదికపైకి తీసుకురావడంతో పాటు, రాష్ట్ర వ్యాప్తంగా అభిమానుల కార్యకలాపాలను మరింత వ్యవస్థీకృతంగా నిర్వహించేందుకు ఈ కమిటీల ఏర్పాటు ఉపయోగపడనుందని సంఘంలోని కీలక సభ్యులు తెలిపారు. ముంబైలో జరిగిన ఈ కార్యక్రమానికి అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై తమ అభిమాన హీరోపై ఉన్న ప్రేమను చాటుకున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Kangana Ranaut: ఏఐతో అసభ్యక పోస్టులు.. కోర్టుకెక్కిన నటి

నిన్ను తీసుకెళ్లిన ఆ దేవుడిని చంపాలనిపిస్తోంది! నానా మరణంతో ఆర్జీవీలో ఉప్పొంగిన భావోద్వేగం

నానా పటేకర్ మృతి.. ఎన్టీఆర్‌ ఎమోషనల్ పోస్ట్

Aggipetta Macha Game: అగ్గిపెట్టె మచ్చా మీద.. ఏకంగా గూగుల్‌ ప్లే స్టోర్‌లో గేమ్‌ ఉంది తెలుసా?

Bigg Boss Telugu 10: 15 లక్షల్లో.. మిథిలేష్‌కు మిగిలేది మరీ అంతేనా.. ఏదో అనుకున్నాడు పాపం!

Follow Us