Rashmika Mandanna: ఓవరాక్షన్, క్రింజ్ అంటారా.. ట్రోలర్స్‌కు ఇచ్చిపడేసిన రష్మిక
‘రణబాలి’ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న రష్మిక మందన్న తనపై వస్తున్న ట్రోలింగ్‌పై స్పందించారు. ఈవెంట్లలో సరదాగా, ఉత్సాహంగా ఉండటాన్ని కొందరు ‘ఓవరాక్షన్’, ‘క్రింజ్’ అంటూ విమర్శిస్తున్నా పట్టించుకోనని చెప్పారు. అందరినీ మెప్పించడం సాధ్యం కాదని, తన సహజమైన వ్యక్తిత్వాన్ని మార్చుకునే అవసరం లేదని స్పష్టం చేశారు. విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ‘రణబాలి’ అక్టోబర్ 16న విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ కొనసాగుతున్నాయి.
టాలీవుడ్‌లో క్రేజీ కాంబినేషన్లలో ఒకటైన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంట మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. వీరిద్దరూ కలిసి నటించిన భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా రణబాలి విడుదలకు సిద్దమవుతుంది. నేపథ్యంలో ప్రస్తుతం ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. దసరా కానుకగా ఈ నెల 16న సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూలు, ఈవెంట్లతో సినిమాపై అంచనాలు పెంచే ప్రయత్నం చేస్తోంది.అయితే సినిమా ప్రమోషన్స్ కంటే విజయ్, రష్మికల మధ్య ఉన్న వ్యక్తిగత అనుబంధానికి సంబంధించిన విషయాలే ఎక్కువగా చర్చకు రావడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా రష్మిక ప్రమోషన్ ఈవెంట్లలో ఎంతో సరదాగా, ఉత్సాహంగా కనిపించడం కొందరు నెటిజన్లకు నచ్చకపోవడంతో సోషల్ మీడియాలో ఆమెపై ట్రోలింగ్ కూడా జరుగుతోంది. తాజా ఇంటర్వ్యూలో ఇదే విషయంపై రష్మికకు ప్రశ్న ఎదురవగా.. ఆమె ఎలాంటి మొహమాటం లేకుండా తన అభిప్రాయాన్ని తెలిపింది. తాను ఎక్కడ ఉన్నా అక్కడి వాతావరణాన్ని సంతోషంగా ఉంచాలని కోరుకుంటానని చెప్పుకొచ్చింది రష్మిక. తన చుట్టూ ఉన్నవారితో సరదాగా మాట్లాడటం, నవ్వుతూ ఉండటం తన సహజ స్వభావమని చెప్పుకొచ్చింది. అలాగే తన వ్యక్తిత్వాన్ని కొందరు ఓవరాక్షన్, క్రింజ్ అంటూ కామెంట్ చేసినా వాటిని పెద్దగా పట్టించుకోనని రష్మిక స్పష్టం చేసింది. అందరినీ మెప్పించడం సాధ్యం కాదని, తనకు నచ్చిన విధంగా సహజంగా ఉండటానికే తాను ప్రాధాన్యం ఇస్తానని రష్మిక చెప్పుకొచ్చింది. ఇతరుల అభిప్రాయాల కోసం తన అసలైన వ్యక్తిత్వాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదని రష్మిక స్పష్టం చేసింది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు తనలోని ఈ ఎనర్జీని ఇష్టపడతారని, అందుకే విమర్శల వస్తున్నాయని తన సహజత్వాన్ని వదులుకునే ప్రసక్తే లేదనే రష్మిక చెప్పింది. కాగా రణబాలి ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన నేపథ్యంలో కథ, పాత్రలు, భారీ యాక్షన్ సన్నివేశాలు, ఎమోషనల్ కంటెంట్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని చిత్ర బృందం చెబుతోంది. భారీ అంచనాల మధ్య అక్టోబర్ 16న థియేటర్లలోకి రాబోతున్న రణబాలి ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చిరు – ఓదెల సినిమాపై.. నాని షాకింగ్ కామెంట్స్! ఉన్నట్టా.. లేనట్టా.. అంటే..?
దిమ్మతిరిగే ఫోక్ సాంగ్‌తో.. కంబ్యాక్ ఇచ్చిన మాధురి రాథోడ్
Allu Arjun: శివాజీ మహరాజ్ గడ్డపై.. ఐకాన్ స్టార్ సేవా కార్యక్రమం
Kangana Ranaut: ఏఐతో అసభ్యక పోస్టులు.. కోర్టుకెక్కిన నటి
నిన్ను తీసుకెళ్లిన ఆ దేవుడిని చంపాలనిపిస్తోంది! నానా మరణంతో ఆర్జీవీలో ఉప్పొంగిన భావోద్వేగం
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు
ఖరీదైన బట్టలు, చేతిలో రిచ్ లుక్ బ్యాగ్.. చేసేది మాత్రం..
చదువుకుంటాను.. సాయం చేయండి!
శివలింగం చుట్టూ నాగుపాముల ప్రదక్షిణలు
వామ్మో అంత రేటా..? కేజీ రూ. 83కి చేరిన సన్నబియ్యం..

