AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్.. నెటిజన్ల రియాక్షన్‌ ఇదే

బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్.. నెటిజన్ల రియాక్షన్‌ ఇదే

Phani CH
|

Updated on: Oct 09, 2026 | 5:56 PM

Share

బెంగళూరు వంటి మహానగరాల్లో సమయం సరిపోనట్లు అనిపిస్తుంటే, బీదర్‌ వంటి చిన్న పట్టణాల్లో మాత్రం ప్రశాంతంగా గడపడానికి ఎక్కువ సమయం దొరుకుతోందని ఓ వైద్యుడు చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. ‘ది ఫిట్‌డాక్‌’ పేరుతో ఎక్స్‌ ఖాతా నిర్వహించే ఆయన తన అనుభవాలను పంచుకున్నారు. ట్రాఫిక్‌, ప్రయాణాలు, పనుల ఒత్తిడి మెట్రో నగరాల్లో సమయాన్ని హరించేస్తున్నాయని పలువురు నెటిజన్లు అభిప్రాయపడ్డారు.

మహానగరాలలోని యాంత్రిక జీవన శైలికి, చిన్న పట్టణాలలోని ప్రశాంత వాతావరణానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వివరిస్తూ ఓ వైద్యుడు చేసిన సోషల్ మీడియా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో సమయం ఎప్పుడూ సరిపోనట్లుగా అనిపిస్తుందని, అదే బీదర్ వంటి చిన్న పట్టణాల్లో పుష్కలంగా ఖాళీ సమయం దొరుకుతోందని ఆయన తన అనుభవాలను పంచుకోవడంతో నెటిజన్ల మధ్య ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ‘ది ఫిట్‌డాక్’ పేరుతో ‘ఎక్స్’ ఖాతా నిర్వహిస్తున్న సదరు వైద్యుడు బెంగళూరులో నివసిస్తున్న సమయంలో తనకు ఎదురైన పరిస్థితులను గుర్తుచేసుకున్నారు. మెట్రో నగరాల్లో ఉన్నప్పుడు ఒక్క రోజు సెలవు కూడా క్షణాల్లో గడిచిపోయేదని, రోజంతా పనులతో పరిగెత్తడం వల్ల ఎప్పుడూ అసంతృప్తిగానే అనిపించేదని పేర్కొన్నారు. అయితే కర్ణాటకలోని టైర్-3 పట్టణమైన బీదర్‌లో తన అనుభవం ఇందుకు పూర్తి భిన్నంగా ఉందని తెలిపారు. “ఇక్కడ ఉదయాన్నే లాంగ్ రన్‌‌కు వెళ్లాను, ప్రశాంతంగా భోజనం ముగించి కాసేపు నిద్రపోయాను. అయినా సరే అప్పటికి సమయం మధ్యాహ్నం రెండు గంటలే అయింది! బహుశా ఈ సాయంత్రం ప్రశాంతంగా సినిమాకు కూడా వెళ్లేంత ఖాళీ సమయం ఉంది” అని ఆయన రాసుకొచ్చారు. వైద్యుడి పోస్ట్‌పై నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున ప్రతిస్పందనలు వచ్చాయి. మెట్రో నగరాల్లో ఉండే విపరీతమైన ట్రాఫిక్, ప్రయాణాలకే ఎక్కువ సమయం వృథా అవుతుందని మెజారిటీ నెటిజన్లు అభిప్రాయపడ్డారు. “చిన్న పట్టణాల్లో మన సమయాన్ని వేస్ట్ చేసే అంశాలు, పరధ్యానానికి గురిచేసే ఆకర్షణలు తక్కువగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం” అని ఒక యూజర్ కామెంట్ చేయగా, “నాకు కూడా సరిగ్గా ఇలాంటి అనుభవమే ఎదురైంది” అని మరొకరు మద్దతు తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Rashmika Mandanna: ఓవరాక్షన్, క్రింజ్ అంటారా.. ట్రోలర్స్‌కు ఇచ్చిపడేసిన రష్మిక

చిరు – ఓదెల సినిమాపై.. నాని షాకింగ్ కామెంట్స్! ఉన్నట్టా.. లేనట్టా.. అంటే..?

దిమ్మతిరిగే ఫోక్‌ సాంగ్‌తో.. కంబ్యాక్‌ ఇచ్చిన మాధురి రాథోడ్‌

Allu Arjun: శివాజీ మహరాజ్‌ గడ్డపై.. ఐకాన్ స్టార్‌ సేవా కార్యక్రమం

Kangana Ranaut: ఏఐతో అసభ్యక పోస్టులు.. కోర్టుకెక్కిన నటి

Follow Us