AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హిట్స్ కోసం హీరోల సొంత డైరెక్షన్..

హిట్స్ కోసం హీరోల సొంత డైరెక్షన్..

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Oct 09, 2026 | 6:01 PM

Share

టాలీవుడ్‌లో కొందరు హీరోలు నటనకే పరిమితం కాకుండా దర్శకత్వ బాధ్యతలు కూడా చేపడుతున్నారు. కిరణ్‌ అబ్బవరం ‘రియాలిటీ’తో మధ్యతరగతి భావోద్వేగాలను చూపించేందుకు సిద్ధమవుతుండగా, రామ్‌ పోతినేని ‘నియో నాయిర్‌’ శైలిలో క్రైమ్‌, సస్పెన్స్‌ కథను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. కార్తికేయ బాక్సింగ్‌ నేపథ్యంలో ‘కమ్‌బ్యాక్‌’ స్పోర్ట్స్‌ డ్రామాతో రానుండగా, సుధీర్‌ బాబు మార్షల్‌ ఆర్ట్స్‌ కథతో దర్శకుడిగా మారనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

హిట్స్ కొట్టేందుకు మన హీరోలు ఎవరి మీద ఆధారపడకుండా, నేరుగా వాళ్లే మెగాఫోన్ పట్టుకుని రంగంలోకి దిగుతున్నారిప్పుడు. తమకు బాగా కలిసొచ్చే స్ట్రాంగ్ జోనర్స్‌ను ఎంచుకుంటూ.. సొంతంగా కథలు రాసుకుని మరీ డైరెక్టర్స్‌గా మారిపోతున్నారు. మరి ఇండస్ట్రీలో ఏ హీరో తన బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా ఎలాంటి సబ్జెక్టును హ్యాండిల్ చేస్తున్నాడో డీటెయిల్‌గా చూద్దామా..? చెన్నై లవ్‌స్టోరీతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయిన కిరణ్ అబ్బవరం.. తాను డైరెక్ట్ చేస్తున్న ‘రియాలిటీ’ సినిమాతో మరోసారి మిడిల్ క్లాస్ ఎమోషన్స్‌ను టచ్ చేస్తున్నారు. ఓ మధ్యతరగతి యువకుడు ఆనంద్‌గా తన కుటుంబ బాధ్యతలు, భావోద్వేగాలను ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఈ సినిమాతో తొలిసారి మెగాఫోన్ పడుతున్న కిరణ్.. డిసెంబర్ 25న రియాలిటీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రామ్ పోతినేని సైతం తన రూట్ మార్చి ‘నియో నాయిర్’ అనే ఒక సరికొత్త హాలీవుడ్ క్లాసిక్ స్టైల్ జోనర్‌తో సక్సెస్ ట్రాక్ ఎక్కేందుకు రెడీ అవుతున్నారు. 1940ల నాటి క్రైమ్, సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో సాగే ఈ స్పెషల్ సినిమా కోసం రామ్ స్వయంగా కథ రాసుకుని డైరెక్ట్ చేస్తుండటం విశేషం. రొటీన్ ఫార్ములాలకు భిన్నంగా రామ్ చేస్తున్న ఈ డార్క్ అండ్ ఇంటెన్స్ ఎక్స్‌పర్మెంట్ ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. మూడేళ్లుగా స్క్రీన్‌కు దూరంగా ఉన్న హీరో కార్తికేయ కూడా మెగాఫోన్ పట్టి.. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో ‘కమ్ బ్యాక్’ అనే పవర్‌ఫుల్ స్పోర్ట్స్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సుధీర్ బాబు సైతం తన ఫిట్నెస్‌కు పర్ఫెక్ట్‌‌గా సెట్టయ్యే మార్షల్ ఆర్ట్స్ మూవీతో డైరెక్టర్ చైర్ ఎక్కబోతున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి మన హీరోలంతా దర్శకుల కోసం వెయిట్ చేయకుండా.. స్ట్రెంగ్త్‌పై ఫోకస్ చేస్తూ సొంత కథలు రాసుకుంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్

ఏఐతో రిస్క్ తప్పదు.. అయినా ఆపలేం!

బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్.. నెటిజన్ల రియాక్షన్‌ ఇదే

Rashmika Mandanna: ఓవరాక్షన్, క్రింజ్ అంటారా.. ట్రోలర్స్‌కు ఇచ్చిపడేసిన రష్మిక

చిరు – ఓదెల సినిమాపై.. నాని షాకింగ్ కామెంట్స్! ఉన్నట్టా.. లేనట్టా.. అంటే..?

Follow Us