అగ్గిపెట్టె మచ్చా అలియాస్ కిరణ్ కుమార్ మరణానికి సంబంధించిన వైద్య నివేదిక కీలక విషయాలను వెల్లడించింది. కాలేయ వైఫల్యం, ఇతర అంతర్గత అవయవాలు తీవ్రంగా దెబ్బతినడమే ఆయన మృతికి ప్రధాన కారణమని వైద్యులు తెలిపారు. తాగుడుకు బానిస కావడమే ఆరోగ్యం క్షీణించడానికి దోహదపడిందని నివేదిక పేర్కొంది.