సోషల్ మీడియా స్టార్ అగ్గిపెట్టె మచ్చ మరణం అందరినీ కలచివేసింది. తాగుడుకు బానిసై అనారోగ్యంతో మరణించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, తన సోదరుడు తాగుడుకు బానిసై చనిపోవడానికి కొన్నేళ్ల క్రితం తలపై తగిలిన దెబ్బే కారణమని మచ్చ అక్క బోరున విలపిస్తున్నారు. ఆ గాయం వల్లే మానసికంగా, శారీరకంగా దెబ్బతిన్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.