AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Toxic Movie: యశ్‌ పక్కన అలా చేయలేను.. ‘టాక్సిక్’లో నయనతార రోల్‌ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

కన్నడ స్టార్ హీరో, రాకింగ్ స్టార్ యశ్ నటించిన 'టాక్సిక్' సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో యశ్ సరసన ఏకంగా ఐదుగురు హీరోయిన్లు నటించారు. అందులో నయనతార కూడా ఒకటి.

Toxic Movie: యశ్‌ పక్కన అలా చేయలేను.. 'టాక్సిక్'లో నయనతార రోల్‌ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
Toxic Movie
Basha Shek
|

Updated on: Aug 25, 2026 | 7:39 PM

Share

రాకింగ్ స్టార్ యశ్ నటించిన లేటెస్ట్ సినిమా ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ మరికొన్ని గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. శుక్రవారం (ఆగస్టు 26) ఈ సినిమా పెద్ద ఎత్తున థియేటర్లలో రిలీజ్ కానుంది. భారతీయ భాషలతో పాటు ఇంగ్లిష్ లోనూ ఈ సినిమా రిలీజ్ కానుండడం విశేషం. దీంతో మొదటి రోజు టాక్సిక్ సినిమాకు వచ్చే కలెక్షన్లు, రికార్డులపై అప్పుడే చర్చ జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్ద ఎత్తున టాక్సిక్ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో ఏకంగా ఐదు గురు హీరోయిన్లు నటిస్తున్నారు. నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్, కియారా అద్వానీ యశ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి విడుదలైన కంటెంట్ ను బట్టి చూస్తే.. ఇందులో తండ్రీ కొడుకుల సెంటిమెంట్ తో పాటు బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ కూడా ఉందని తెలుస్తోంది. ఇందులో నయనతార యశ్ కు సోదరిగా గంగ అనే పాత్రలో నటిస్తోంది. సినిమాలో ఈ రోల్ చాలా కీలకమని మేకర్స్ ఇది వరకే ప్రకటించారు కూడా. అయితే ఆ పాత్ర కోసం ముందుగా ఓ స్టార్ హీరోయిన్‌ను ఎంపిక చేశారు. కొన్ని రోజులు షూటింగ్ కూడా చేశారట. అయితే ఉన్నట్లుండి సదరు హీరోయిన్ ఈ క్రేజీ ప్రాజెక్టు నుంచి తప్పుకుందట. ఆ హీరోయిన్ మరెవరో కాదు బాలీవుడ్ అందాల తార కరీనా కపూర్.

టాక్సిక్ సినిమాలో యశ్ రాయ, టికెట్ అనే రెండు పాత్రలు పోషిస్తున్నాడు. ఇక రాయ కు సోదరి గా గంగ పాత్రలో నయనతార నటిస్తోంది. మొదట ఈ పాత్ర కోసం పలువురు హీరోయిన్లను పరిశీలించారట. చివరకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ను ఫైనల్ చేశారట. టాక్సిక్ సినిమాలో నటిస్తున్నట్లు స్వయంగా కరీనానే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన తర్వాత అనూహ్యంగా కరీనా తప్పుకుంది. దీనికి కారణాలు విశ్లేషిస్తే.. స్టార్ హీరో అయిన యశ్ కు సోదరిగా తాను నటించలేనందట కరీనా. ఒకవేళ ఛాన్స్ వస్తే.. హీరోయిన్‌గా నటిస్తానని చెప్పి టాక్సిక్ సినిమా నుంచి వైదొలిగిందట కరీనా. ఆ తర్వాత నయనతార లైన్లోకి వచ్చిందట. మొదట నయన్ కూడా ఈ పాత్రకు ఒప్పుకోలేదట. అయితే డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ గంగ పాత్రలో ఉన్న ఇంటెన్స్, ఇంపార్టెన్స్ ను నయన్ కు వివరించిందట. దీంతో లేడీ సూపర్ స్టార్ ఈ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పిందట.

ఇవి కూడా చదవండి

తబాహి  సాంగ్ లో కియారా అద్వానీ, యశ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
'టాక్సిక్'లో నయనతార రోల్‌ను రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా?
'టాక్సిక్'లో నయనతార రోల్‌ను రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా?
చాణక్య నీతి: డబ్బు విషయంలో ఈ తెలివి తక్కువ పనులు చేయకండి..!
చాణక్య నీతి: డబ్బు విషయంలో ఈ తెలివి తక్కువ పనులు చేయకండి..!
మసూద్ అజర్ ‘త్యాగం’ పేరుతో కొత్త కుట్రకు తెరలేపిన ఐఎస్ఐ
మసూద్ అజర్ ‘త్యాగం’ పేరుతో కొత్త కుట్రకు తెరలేపిన ఐఎస్ఐ
ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్.. నగదు విత్ డ్రా రూల్స్‌లో మార్పులు..
ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్.. నగదు విత్ డ్రా రూల్స్‌లో మార్పులు..
చెమటలు పట్టిస్తోన్న సస్పెన్స్ థ్రిల్లర్.. ఓటీటీలో దుమ్మురేపుతుంది
చెమటలు పట్టిస్తోన్న సస్పెన్స్ థ్రిల్లర్.. ఓటీటీలో దుమ్మురేపుతుంది
చనిపోయీ ముగ్గురికి పునర్జన్మచ్చిన హైదరాబాద్‌ యువకుడు
చనిపోయీ ముగ్గురికి పునర్జన్మచ్చిన హైదరాబాద్‌ యువకుడు
ఇరుముడి వివాదం.. క్రియేటివ్‌ ఫ్రీడమ్‌కు హద్దులెక్కడ?
ఇరుముడి వివాదం.. క్రియేటివ్‌ ఫ్రీడమ్‌కు హద్దులెక్కడ?
సమాజంలో మీ విలువను, గౌరవాన్ని పెంచే 6 శక్తివంతమైన నియమాలు..
సమాజంలో మీ విలువను, గౌరవాన్ని పెంచే 6 శక్తివంతమైన నియమాలు..
అందుకే కుక్కకు రాఖీ కట్టాను.. విమర్శలపై ఆదిపురుష్ హీరోయిన్
అందుకే కుక్కకు రాఖీ కట్టాను.. విమర్శలపై ఆదిపురుష్ హీరోయిన్
ఆ 2 డిమాండ్లు తీర్చాల్సిందే.. లేదంటే ఫ్రాంచైజీని వదిలేసుడే..
ఆ 2 డిమాండ్లు తీర్చాల్సిందే.. లేదంటే ఫ్రాంచైజీని వదిలేసుడే..