Tollywood : హైట్ తక్కువ.. నల్లగా ఉన్నావంటూ అవమానించారు.. కట్ చేస్తే.. ఇండస్ట్రీనే ఏలేసిన హీరోయిన్..
సాధారణంగా సినీరంగంలో విమర్శలు, అవమానాలు సర్వసాధారణం. తమ లుక్స్, హైట్, యాక్టింగ్ పరంగా అనేక విమర్శలు ఎదుర్కోని తమ ప్రతిభతో మెప్పించిన తారలు చాలా మంది ఉన్నారు. కొందరు ఒక్క సినిమాతోనే క్లిక్ అయిన సందర్భాలు ఉన్నాయి. అయితే అలా అవమానాలు, సవాళ్లు దాటుకుని ఇండస్ట్రీని శాసించిన ఈ హీరోయిన్ గురించి మీకు తెలుసా.. ? దశాబ్దాలపాటు సినిమా ప్రపంచాన్ని శాసించింది.

సినిమా పరిశ్రమలో గ్లామర్, ఎత్తు, రంగు వంటి విషయాలకు ప్రాధాన్యత ఎక్కువ. అయితే, బాహ్య సౌందర్యం కంటే నటనలోని ప్రతిభే శాశ్వతమని నిరూపించిన కొద్దిమంది నటీమణుల్లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాణి ముఖర్జీ ఒకరు. 1978 మార్చి 21న ముంబైలో జన్మించిన రాణికి కుటుంబపరంగా సినీ నేపథ్యం ఉన్నప్పటికీ, ఆమె సినీ ప్రయాణం సులువుగా సాగలేదు. కెరీర్ తొలినాళ్లలో రాణి ముఖర్జీ అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. ఎత్తు తక్కువగా ఉండటం, చామనఛాయ (నలుపు) రంగులో ఉండటం వల్ల ఆమెను పలు ప్రాజెక్ట్‌ల నుంచి తీసివేశారు. అంతేకాకుండా తీవ్రమైన బాడీ షేమింగ్ కామెంట్లను కూడా ఆమె సహించాల్సి వచ్చింది. పదవ తరగతి చదువుతున్న సమయంలోనే సల్మాన్ ఖాన్ తండ్రి, ప్రముఖ రచయిత సలీమ్ ఖాన్ ఆమెకు ఒక సినిమా ఆఫర్ ఇచ్చారు. కానీ ఆమె తండ్రి ఆ అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించారు.
ఎక్కువమంది చదివినవి : Aamani: నాకు లైఫ్ ఇచ్చింది ఆయనే.. ఆ హీరోతోనే ఎక్కువ సినిమాలు చేశా.. హీరోయిన్ ఆమని..
1996లో ‘బియేర్ ఫూల్’ అనే బెంగాలీ చిత్రంతో రాణి ముఖర్జీ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టారు. అదే సంవత్సరంలో ‘రాజా కీ ఆయేగి బరాత్’ సినిమాతో హిందీ రంగ ప్రవేశం చేశారు. తొలి చిత్రంతోనే తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూడలేదు. ఆమీర్ ఖాన్ సరసన నటించిన ‘గులామ్’, షారుఖ్ ఖాన్ జోడీగా చేసిన ‘కుచ్ కుచ్ హోతా హై’ చిత్రాలు ఘన విజయం సాధించి ఆమెకు తిరుగులేని స్టార్‌డమ్ తెచ్చిపెట్టాయి. ఆ తర్వాత సల్మాన్ ఖాన్, ఆమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్ వంటి అగ్ర కథానాయకులతో వరుస హిట్లు సాధించి దశాబ్దాల పాటు బాలీవుడ్ ఏకచక్రాధిపత్యంగా ఏలారు.
ఎక్కువమంది చదివినవి : Chalaki Chanti: వాడు నా పొట్ట కొట్టాడు.. నాకు అవకాశాలు రాకుండా చేశాడు.. చలాకీ చంటి..
తక్కువ ఎత్తు, రంగు నెగెటివ్ పాయింట్స్ కావని, అసలైన ప్రతిభ ముందు ఇవన్నీ చిన్నబోతాయని రాణి ముఖర్జీ తన సినీ ప్రయాణంతో నిరూపించారు. రాణి ముఖర్జీ కేవలం కమర్షియల్ చిత్రాలకే పరిమితం కాకుండా, విభిన్నమైన , నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకుని విమర్శకుల ప్రశంసలు పొందారు. 2014లో ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, యష్ రాజ్ ఫిల్మ్స్ అధినేతి ఆదిత్య చోప్రాను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు 2015లో కుమార్తె అధిరా జన్మించారు.
ఎక్కువమంది చదివినవి : Eshwar Sai : ఆ టైంలోనే మాధురి నాకు కనెక్ట్ అయ్యింది.. ఆమె చాలా మంచిది.. నోరు విప్పిన ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర సాయి..
రాణి ముఖర్జీ..
ఎక్కువమంది చదివినవి : Comedian Sudhakar: ఒక్క సినిమాకు రూ.30 వేల రెమ్యునరేషన్.. ఆస్తులపై క్లారిటీ ఇచ్చిన నటుడు సుధాకర్..
