Telangana Rains Alert: తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆగస్టు 25న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి హెచ్చరించింది. మంగళవారం మధ్యాహ్నం నుంచి బుధవారం ఉదయం వరకు పశ్చిమ, మధ్య, తూర్పు తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతాయి. సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి సహా 12 జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండి సూచించింది.