ఐదు రోజుల పని దినాలు అమలు చేయాలని డిమాండ్‌తో బ్యాంక్ యూనియన్లు సెప్టెంబర్ 11న సమ్మెకు పిలుపునిచ్చాయి. దీని కారణంగా సెప్టెంబర్ 11, 12, 13, 14 తేదీలలో వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు మూతబడనున్నాయి. సెప్టెంబర్ 28, 29, 30 తేదీలలోనూ సమ్మెకు దిగనున్నట్లు ఉద్యోగులు అల్టిమేటం జారీ చేశారు.