AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : హీరోయిన్‏గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరో కూతురు.. ట్రైలర్ అదిరిపోయిందిగా..

ప్రస్తుతం ట్రెండ్ మారింది. ఒకప్పుడు స్టార్ హీరో వారసులు హీరోలుగా సినీరంగంలోకి అడుగుపెట్టేవాళ్లు. కానీ ఇప్పుడు హీరోల కూతుళ్లు సైతం ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. కథానాయికలుగా, నిర్మాతలుగా సత్తా చాటుతున్నారు. తాజాగా మరో సూపర్ స్టార్ కూతురు కథానాయికగా వెండితెరకు పరిచయం కాబోతుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

Tollywood : హీరోయిన్‏గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరో కూతురు.. ట్రైలర్ అదిరిపోయిందిగా..
Thudukkam Trailer
Rajitha Chanti
|

Updated on: Aug 05, 2026 | 12:02 PM

Share

ప్రస్తుతం సినీరంగంలో స్టార్ హీరోల కూతుర్లు సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. కొందరు హీరోయిన్లుగా దూసుకుపోతుండగా.. మరికొందరు నిర్మాతలుగా, దర్శకులుగా, సింగర్స్ గా రాణిస్తున్నారు. తాజాగా మరో సూపర్ స్టార్ తనయ సైతం కథానాయికగా వెండితెరకు పరిచయం కాబోతున్నారు. ఆమె మరెవరో కాదు.. మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూతురు విస్మయ. చాలా కాలంగా విస్మయకు సంబంధించి అనేక విషయాలు నెట్టింట వైరలవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె నటిస్తున్న కొత్త సినిమా టైటిల్ రిలీజ్ చేశారు మేకర్స్. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటేస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ తుడక్కం. ఇందులో విస్మయతోపాటు ఆశిష్ జో ఆంటోని సైతం మెయిన్ రోల్ పోషిస్తున్నారు. కొన్ని నెలలుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు సైతం కంప్లీట్ చేసుకుంది.

ఎక్కువమంది చదివినవి : Aamani : సినిమాలు మానేసి సీరియల్స్ చేయడానికి కారణం అదే.. ఎట్టకేలకు ఆమని ఓపెన్ కామెంట్స్..

ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ సినిమాను ఆగస్ట్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా తుడక్కం టైటిల్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ మూవీ టైటిల్ సోషల్ మీడియా, యూట్యూబ్ లో తెగ వైరలవుతుంది. తండ్రీ కూతుళ్ల మధ్య ఉండే సంక్లిష్టమైన అనుబంధం, ఎమోషన్స్ ఆధారంగా ఈ సినిమాను రూపొందించినట్లు తెలుస్తోంది. ఇందులో యాక్షన్ అంశాలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.

ఎక్కువమంది చదివినవి :  K. Raghavendra Rao: ఆ హీరోయిన్‏తో 24 సినిమాలు చేశా.. అలాంటి చావు ఎవరికీ రాకూడదు.. డైరెక్టర్ రాఘవేంద్ర రావు..

మంచిగా చదువుకోమని నీకు ఎంతకాలం నుంచి చెబుతున్నాను.. ప్రియను చూడు ఆమె రాసే ప్రతి పరీక్షలోనూ ఉత్తీర్ణత సాధిస్తుంది అంటూ వచ్చే డైలాగ్స్ మధ్యతరగతి కుటుంబ నేపథ్యాన్ని కళ్లకు కట్టినట్లు చెబుతాయి. ఇక ఈ సినిమాలో సూపర్ స్టార్ మోహన్ లాల్ పవర్ ఫుల్ అండ్ సీరియస్ లుక్ లో అతిథి పాత్రలో ఎంట్రీ ఇవ్వనున్నారు. మొదటి సినిమాతోనే లుక్స్, యాక్టింగ్ పరంగా విస్మయ ప్రేక్షకులను ఆకట్టుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ జూడ్ ఆంటోని జోసెఫ్ తెరకెక్కిస్తుండగా.. సాయి కుమార్, బాబీ కురియన్, మనోజ్ కె జయన్, కేబీ గణేష్ కుమార్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.

ఎక్కువమంది చదివినవి : Tollywood : రూ.16 కోట్లతో తీస్తే 400 కోట్ల కలెక్షన్.. యావత్ దేశమే ఆశ్చర్యపోయేలా చేసిన సినిమా..

తుడుక్కం ట్రైలర్..

ఎక్కువమంది చదివినవి : Ramayana Trailer : ఏముందిరా బాబూ.. కుర్రాళ్లు తెగ వెతుకున్న చిన్నది.. రామాయణ ట్రైలర్‏లో తనే స్పెషల్..

Follow Us