AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nani : 9 నెలలు భోజనం మానేసి ఆఫీసుల చుట్టూ తిరిగాను.. అన్నం తినకుండా డైరెక్టర్ అయ్యా.. హీరో నాని..

ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ లేకుండా సాధారణ కుర్రాడు సినీరంగంలోకి అడుగుపెట్టి అసిస్టెంట్ డైరెక్టర్ గా.. తర్వాత హీరోగా.. ఇప్పుడు నిర్మాతగా మారి తనదైన ముద్ర వేశాడు న్యాచురల్ స్టార్ నాని. సహజ నటనతో పక్కింటి కుర్రాడిలా కనిపిస్తూ కోట్లాది తెలుగు ప్రేక్షకుల హృదయాలు గెలుచుకున్నారు.

Nani : 9 నెలలు భోజనం మానేసి ఆఫీసుల చుట్టూ తిరిగాను.. అన్నం తినకుండా డైరెక్టర్ అయ్యా.. హీరో నాని..
Nani
Rajitha Chanti
|

Updated on: Aug 05, 2026 | 12:35 PM

Share

న్యాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ లేకుండానే సినీరంగంలోకి అడుగుపెట్టి… ఎన్నో సవాళ్లు ఎదుర్కొని అసిస్టెంట్ డైరెక్టర్ గా అవకాశం అందుకున్నారు. ఆ తర్వాత అష్టా చెమ్మా సినిమాతో హీరోగా పరిచయమైన నాని మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ హిట్ చిత్రాలతో స్టార్ ఇమేజ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా, నిర్మాతగా దూసుకుపోతున్నారు. లవర్ బాయ్ ఇమేజ్ మాత్రమే కాకుండా మాస్ యాక్షన్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద రఫ్పాడిస్తున్నాడు ఈ హీరో. ప్రస్తుతం నాని ది ప్యారడైజ్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ నుంచి విడుదలైన ఆయ షేర్ సాంగ్ అటు యూట్యూబ్ లో దుమ్మురేపుతుంది. మిలియన్ వ్యూస్ అందుకుంటూ సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఇదిలా ఉంటే గతంలో రవితేజతో జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం, మొదటి అవకాశం గురించి నాని చెప్పిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

ఎక్కువమంది చదివినవి : Aamani : సినిమాలు మానేసి సీరియల్స్ చేయడానికి కారణం అదే.. ఎట్టకేలకు ఆమని ఓపెన్ కామెంట్స్..

టాలీవుడ్ లో దర్శకుడిగా మారాలనే తపనతో ఎందరో నిత్యం శ్రమిస్తుంటారు. అయితే, కొందరు తమ కలను నెరవేర్చుకోవడానికి అసాధారణమైన త్యాగాలు చేస్తుంటారు. అలాంటి ఒక స్ఫూర్తిదాయకమైన కథే నాని సినీ ప్రయాణం అని చెప్పాలి. అసిస్టెంట్ డైరెక్టర్ పోస్ట్ ను సాధించడానికి తాను ఎన్నో నెలలు మధ్యాహ్నం భోజనం చేయకుండా ఎదురుచూశానని అన్నారు.

ఎక్కువమంది చదివినవి :  K. Raghavendra Rao: ఆ హీరోయిన్‏తో 24 సినిమాలు చేశా.. అలాంటి చావు ఎవరికీ రాకూడదు.. డైరెక్టర్ రాఘవేంద్ర రావు..

నాని మాట్లాడుతూ.. “సాధారణంగా, లంచ్ విరామ సమయంలో కార్యాలయ సిబ్బంది లేదా సెట్ లోని వారంతా బయటకు వస్తుంటారు. ఆ సమయంలో తాను బయట భోజనానికి వెళ్తే, కీలక వ్యక్తుల దృష్టిలో పడలేనని భావించి, లంచ్ మానేయాలని నిర్ణయించుకున్నాను. సుమారు తొమ్మిది నెలల నుండి సంవత్సరంన్నర పాటు మధ్యాహ్నం భోజనం చేయకుండా వెయిట్ చేశాను. ఇక నేను వదిలేలా లేను అని చెప్పేసి నాకు ఆ పోస్ట్ ఇచ్చారు”అంటూ చెప్పుకొచ్చారు నాని. నాని భోజనం లేకుండానే పని చేస్తూ, తన అంకితభావాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్.

ఎక్కువమంది చదివినవి : Tollywood : రూ.16 కోట్లతో తీస్తే 400 కోట్ల కలెక్షన్.. యావత్ దేశమే ఆశ్చర్యపోయేలా చేసిన సినిమా..

ఎక్కువమంది చదివినవి : Ramayana Trailer : ఏముందిరా బాబూ.. కుర్రాళ్లు తెగ వెతుకున్న చిన్నది.. రామాయణ ట్రైలర్‏లో తనే స్పెషల్..

Follow Us