AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: జాక్‌పాట్.. రూ.1.25 కోట్ల లాటరీ తగిలింది.. కట్ చేస్తే, ఆశ దోశ అప్పడం వడ..

‘మీ మొబైల్ నంబర్‌ కు కౌన్ బనేగా క్రోర్‌పతి - KBC లాటరీ తగిలింది.. రూ.1.25 కోట్లు వస్తాయి’.. మీకు డబ్బులు కావాలంటే.. ఇప్పుడే త్వరపడండి.. లేదంటే.. 1.25 కోట్లు అట్లనే పోతాయ్.. అనగానే.. ఆ వృద్ధుడు ఆశపడ్డాడు.. వాళ్లు చేసేది మోసం అని తెలియక.. అత్యాశతో తన దగ్గరున్న డబ్బులు కూడా పోగొట్టుకున్నాడు..

Hyderabad: జాక్‌పాట్.. రూ.1.25 కోట్ల లాటరీ తగిలింది.. కట్ చేస్తే, ఆశ దోశ అప్పడం వడ..
Money
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Mar 14, 2026 | 3:14 PM

Share

‘మీ మొబైల్ నంబర్‌ కు కౌన్ బనేగా క్రోర్‌పతి – KBC లాటరీ తగిలింది.. రూ.1.25 కోట్లు వస్తాయి’.. మీకు డబ్బులు కావాలంటే.. ఇప్పుడే త్వరపడండి.. లేదంటే.. 1.25 కోట్లు అట్లనే పోతాయ్.. అనగానే.. ఆ వృద్ధుడు ఆశపడ్డాడు.. వాళ్లు చేసేది మోసం అని తెలియక.. అత్యాశతో తన దగ్గరున్న డబ్బులు కూడా పోగొట్టుకున్నాడు.. కౌన్ బనేగా క్రోర్‌పతి లాటరీ తగిలింది.. 1.25 కోట్లు వస్తాయంటూ మాయమాటలు చెప్పి ఓ వృద్ధుడిని సైబర్ మోసగాళ్లు మోసం చేసిన ఘటన హైదరాబాద్‌లో వెలుగుచూసింది. క్రమంగా వివిధ ఛార్జీల పేరుతో డబ్బులు వసూలు చేసి మొత్తం రూ.4.4 లక్షలు కాజేశారు. మోసపోయానని తెలుసుకున్న తర్వాత బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.

పోలీసుల వివరాల ప్రకారం.. హైదరాబాద్ నగరానికి చెందిన 71 ఏళ్ల వృద్ధుడికి గత ఏడాది అక్టోబర్ 15న వాట్సాప్ కాల్ వచ్చింది. తనను అభిషేక్ అని పరిచయం చేసుకున్న వ్యక్తి మాట్లాడుతూ.. బాధితుడి మొబైల్ నంబర్ KBC లాటరీలో ఎంపికైందని చెప్పాడు. టికెట్ నంబర్ 8891 అంటూ, అతనికి రూ.1.25 కోట్లు గిఫ్ట్ గా వస్తాయని నమ్మబలికాడు. అయితే ఆ మొత్తాన్ని పంపించడానికి ట్యాక్స్, ప్రాసెసింగ్ ఫీజు, క్లియరెన్స్ ఛార్జీలు వంటి పేర్లతో ముందుగా కొంత డబ్బు చెల్లించాలని కోరాడు. లాటరీ నిజమని నమ్మిన వృద్ధుడు.. మోసగాళ్లు చెప్పిన అకౌంట్లకు దశల వారీగా రూ.4.4 లక్షలు పంపించాడు.

కొంతకాలం గడిచినా బహుమతి డబ్బు రాకపోవడంతో అనుమానం వచ్చిన వృద్ధుడు తాను మోసపోయినట్టు గ్రహించి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు ఐటీ చట్టంతో పాటు సెక్షన్లతో పాటు BNSలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లాటరీలు, బహుమతుల పేరుతో వచ్చే కాల్స్‌, మెసేజ్‌లను నమ్మకూడదని.. ముందుగా డబ్బు అడిగితే వెంటనే అప్రమత్తం కావాలని సైబర్ క్రైమ్ పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us