- Telugu News Photo Gallery Cinema photos Jabardasth Fame Kevvu Kartheek Visits Temple With Wife And Family, See Photos
Kevvu Kartheek: ఆధ్యాత్మిక యాత్రలో జబర్దస్త్ కెవ్వు కార్తీక్.. భార్యతో కలిసి ప్రముఖ ఆలయాల సందర్శన.. ఫొటోస్
జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో కెవ్వు కార్తీక్ ఒకడు. మొదట ఒక సాధారణ కంటెస్టెంట్ గా ఈ షోలోకి అడుగు పెట్టిన అతను ఆ తర్వాత టీమ్ లీడర్ గా మారిపోయాడు. ఇప్పటికీ అలాగే కొనసాగుతూ బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్విస్తున్నాడు.
Updated on: Jul 01, 2025 | 6:35 PM

మొదట మిమిక్రీ ఆర్టిస్ట్ గా సత్తా చాటిన కార్తీక్ ఆ తరువాత జబర్దస్త్ షోలోకి అడుగు పెట్టి మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. మొదట ధనాధన్ రాజ్ టీమ్ లో కంటెస్టెంట్ గా చేరిన అతను ఆ తర్వాత తిరుపతి ప్రకాశ్ టీమ్ లోనూ మెరిశాడు.

ఇక 2016లో ముక్కు అవినాష్ తో కలిసి టీమ్ లీడర్ గా మారిపోయాడు కార్తీక్. అప్పటి నుంచి ఇప్పటి వరకు టీమ్ లీడర్ గా కొనసాగుతున్నాడీ యాక్టర్. తన కామెడీతో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్విస్తున్నాడు

టీవీ షోలతో పాటు సినిమాల్లోనూ మెరుస్తున్నాడు కార్తీక్. ముఖ చిత్రం, నేడు స్టూడెంట్ సార్ సినిమాల్లో కార్తీక్ కీలక పాత్రలు పోషించాడు.

2023లో శ్రీలేఖ అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడు కార్తీక్. తాజాగా ఈ దంపతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ప్రముఖ ఆలయాల సందర్శనకు బయలు దేరారు.

ఇందులో భాగంగా స్వర్ణగిరి, యాదగిరి ఆలయాలను సందర్శించారు కార్తీక్ ఫ్యామిలీ. అనంతరం ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటున్నాయి.




