- Telugu News Photo Gallery Cinema photos Kavya Thapar latest dazzling looks in orange dress goes viral in internet
Kavya Thapar: హంసలో సోగాయాన్ని అంత తనలోనే మలచుకుంది ఈ సొగసరి.. డేజ్లింగ్ కావ్య..
కావ్య ప్రవీణ్ థాపర్.. తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో కథానాయికగా బాగా ఫేమస్.. ఈమె పూర్తి పేరు కావ్య ప్రవీణ్ థాపర్. చేసింది తగ్గువ సినిమాలే అయినా కుర్రకారులో మంచి క్రేజీ సొంతం చేసుకుంది ఈ బ్యూటీ. ఎప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ఫోటోలను పంచుకుంటుంది ఈ బ్యూటీ. తాజా షేర్ చేసిన కొన్ని ఫోటోలు సెగలు పుట్టిస్తున్నాయి.
Updated on: Jul 01, 2025 | 9:14 AM

20 ఆగస్టు 1995న మహారాష్ట్ర రాష్ట్ర రాజదాని ముంబై మహానగరంలో పుట్టి పెరిగింది వయ్యారి భామ కావ్య థాపర్. ఈమె తండ్రి విక్కీ థాపర్ ఓ వ్యాపారవేత్త. తల్లి ఆర్తి థాపర్ గృహిణి. ఈమెకి అభిమన్యు థాపర్ అనే ఓ సోదరుడు కూడా ఉన్నాడు.

మహారాష్ట్రలోని ముంబైలో ఉన్న పోవైలో బాంబే స్కాటిష్ స్కూల్ లో పాఠశాల విద్యను పూర్తి చేసింది ఈ అందాల తార. ముంబైలోని ఠాకూర్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ కామర్స్ నుంచి అండర్ గ్రాడ్యుయేట్ పట్టా పొందింది ఈ అందాల భామ.

సినిమాలకి ముందు పతంజలి, మేక్‌మైట్రిప్, కోహినూర్ వంటి అనేక వాణిజ్య ప్రకటనలలో నటించింది ఈ వయ్యారి భామ. 2018లో ఈ మాయ పేరేమిటో అనే తెలుగు రొమాంటిక్ చిత్రంలో కాదహనాయకిగా చలనచిత్ర అరంగేట్రం చేసింది ఈ ముద్దుగుమ్మ.

2021లో సంతోష్ శోభన్ సరసన ఏక్ మినీ కథ అనే తెలుగు అడల్ట్ కామెడీ చిత్రంలో హీరోయిన్ గా ఆకట్టుకుంది ఈ భామ. గత ఏడాది ఈమె నటించిన ఈగల్, ఊరు పేరు భైరవకోన, డబల్ ఇస్మార్ట్, విశ్వం సినిమాల్లో కథానాయికగా కనిపించింది.

ఈమె 2021లో కాళీ పీలీ టేల్స్, 2022లో CAT, 2023లో ఫర్జీ అనే మూడు వెబ్ సిరీస్ లు కూడా చేసింది. తమిళంలో కూడా మార్కెట్ రాజా ఎంబిబిఎస్, పిచైకారన్ 2 (తెలుగులో బిచ్చగాడు 2) చిత్రాల్లో నటించింది. అలాగే హిందీలో మిడిల్ క్లాస్ లవ్ అనే సినిమా చేసింది.




