AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

150 శాతం ఎఫర్ట్ ఇచ్చేందుకే 6 నెలలు మందు మానేశా..: పంజాబ్ కింగ్స్ స్టార్ షాకింగ్ కమెంట్స్..!

Yuzvendra Chahal: ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే పంజాబ్ కింగ్స్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ వార్తల్లో నిలిచాడు. తన ఫిట్‌నెస్‌పై దృష్టి సారించిన చాహల్, గత ఆరు నెలలుగా మద్యపానానికి దూరంగా ఉంటున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ముప్పై ఐదేళ్ల వయసులో కూడా జట్టు కోసం 150 శాతం కష్టపడాలనే పట్టుదలతో ఆయన ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు.

150 శాతం ఎఫర్ట్ ఇచ్చేందుకే 6 నెలలు మందు మానేశా..: పంజాబ్ కింగ్స్ స్టార్ షాకింగ్ కమెంట్స్..!
Yuzvendra Chahal Ipl Team
Venkata Chari
|

Updated on: Mar 19, 2026 | 6:59 PM

Share

IPL 2026: భారత వెటరన్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తన కెరీర్‌లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాడు. మార్చి 28 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 2026 కోసం ఆయన తన జీవనశైలిని పూర్తిగా మార్చుకున్నాడు. గత కొంతకాలంగా గాయాలు, అనారోగ్య సమస్యలతో సతమతమైన చాహల్.. ఈసారి తన శరీరానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఏబీ డివిలియర్స్ యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడిన చాహల్, “నేను మద్యం మానేసి ఆరు నెలలు దాటింది. ఇప్పుడు నాకు 35 ఏళ్లు, నా జట్టు కోసం మైదానంలో 150 శాతం శక్తిని ధారబోయాలని అనుకుంటున్నాను” అని స్పష్టం చేశాడు.

గత సీజన్ చేదు జ్ఞాపకాలు, గాయాలు..

గత ఐపీఎల్ సీజన్లలో చాహల్ అద్భుతంగా రాణించినప్పటికీ, టైటిల్ మాత్రం చేజారిపోతూనే ఉంది. 2013లో ముంబై ఇండియన్స్‌తో టైటిల్ గెలిచిన తర్వాత, ఆర్‌సీబీ, రాజస్థాన్ రాయల్స్, గత ఏడాది పంజాబ్ కింగ్స్ తరపున ఫైనల్స్ ఆడినా ట్రోఫీని అందుకోలేకపోయాడు. గత సీజన్ చివర్లో ఎదురైన గాయాలు తన ప్రదర్శనపై ప్రభావం చూపాయని చాహల్ ఆవేదన వ్యక్తం చేశాడు. కేకేఆర్‌తో మ్యాచ్ తర్వాత రిబ్ ఫ్రాక్చర్, నకిల్ ఇంజ్యూరీ కారణంగా సెమీఫైనల్, ఫైనల్స్‌లో తాను సరిగ్గా బౌలింగ్ చేయలేకపోయానని ఆయన గుర్తు చేసుకున్నాడు.

మార్కో జాన్సెన్ లేకపోవడం పెద్ద లోటు..

గత సీజన్ ఫైనల్ ఓటమిపై స్పందిస్తూ, ఆల్ రౌండర్ మార్కో జాన్సెన్ సేవలను పంజాబ్ కింగ్స్ కోల్పోవడం కోలుకోలేని దెబ్బ అని చాహల్ అభిప్రాయపడ్డాడు. జాన్సెన్ ఉండి ఉంటే ఫలితం మరోలా ఉండేదని, బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ ఆయన కీలక సిక్సర్లు కొట్టగల సామర్థ్యం కలవాడని కొనియాడాడు. ప్రస్తుతం జాన్సెన్ ఫామ్‌లో ఉండటం జట్టుకు కొండంత బలాన్ని ఇస్తుందని ధీమా వ్యక్తం చేశాడు.

మళ్ళీ వేట మొదలుపెట్టనున్న రికార్డుల రారాజు..

ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన బౌలర్లలో ఒకరైన చాహల్, ఇప్పటివరకు 172 మ్యాచ్‌ల్లో 221 వికెట్లు పడగొట్టాడు. నవంబర్ 2025లో హర్యానా తరపున ఆడిన తర్వాత డెంగ్యూ, చికన్ గున్యా బారిన పడి విశ్రాంతి తీసుకున్నాడు. ఇప్పుడు పూర్తి ఆరోగ్యంతో, కొత్త ఉత్సాహంతో మార్చి 31న గుజరాత్ టైటాన్స్‌తో జరగబోయే తొలి మ్యాచ్ కోసం సిద్ధమవుతున్నాడు. న్యూ చండీగఢ్ వేదికగా జరగనున్న ఈ పోరులో చాహల్ తన మ్యాజిక్ స్పిన్‌తో మళ్ళీ అలరించాలని అభిమానులు కోరుకుంటున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
వాస్తు ప్రకారం డబ్బు నిల్వ పెరగాలంటే ఇవి తప్పక చేయాలి!
వాస్తు ప్రకారం డబ్బు నిల్వ పెరగాలంటే ఇవి తప్పక చేయాలి!
ఇదేందౌర్జన్యం? రసీదు ఇవ్వకుండానే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల సీజ్
ఇదేందౌర్జన్యం? రసీదు ఇవ్వకుండానే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల సీజ్
జబర్దస్త్ నుంచి నెలకు ఎంత సంపాదించానంటే..
జబర్దస్త్ నుంచి నెలకు ఎంత సంపాదించానంటే..
133 కిలోల బరువున్న మహిళ.. ఈ ట్రిక్స్‌తో 76 కిలోలు తగ్గింది.. ఎలా
133 కిలోల బరువున్న మహిళ.. ఈ ట్రిక్స్‌తో 76 కిలోలు తగ్గింది.. ఎలా
దండెంపై ఆరేసిన జాకెట్ పొరుగింట్లో ప్రత్యక్షం.. ఏరులై పారిన రక్తం!
దండెంపై ఆరేసిన జాకెట్ పొరుగింట్లో ప్రత్యక్షం.. ఏరులై పారిన రక్తం!
'150 శాతం ఎఫర్ట్ ఇచ్చేందుకే 6 నెలలు మందు మానేశా'
'150 శాతం ఎఫర్ట్ ఇచ్చేందుకే 6 నెలలు మందు మానేశా'
రోడ్డున పడ్డప్పుడు మమ్మల్ని ఆదుకున్న దేవుడు ఆయనే..
రోడ్డున పడ్డప్పుడు మమ్మల్ని ఆదుకున్న దేవుడు ఆయనే..
హైదరాబాద్ నుంచి కేరళ అడ్వెంచర్: ఐఆర్‌సీటీసీ సూపర్ డీల్ టూర్..
హైదరాబాద్ నుంచి కేరళ అడ్వెంచర్: ఐఆర్‌సీటీసీ సూపర్ డీల్ టూర్..
పదో తరగతి హిందీ క్వశ్చన్ పేపర్ లిక్‌.. వాట్సప్‌లో చక్కర్లు!
పదో తరగతి హిందీ క్వశ్చన్ పేపర్ లిక్‌.. వాట్సప్‌లో చక్కర్లు!
వేసవిలో మట్టి కుండలో నీరు తాగడం మంచిదా? కుండ నాణ్యతను ఇలా..
వేసవిలో మట్టి కుండలో నీరు తాగడం మంచిదా? కుండ నాణ్యతను ఇలా..