AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

B12 Deficiency Symptoms: మీకు ఈ లక్షణాలు ఉంటే మీకు విటమిన్ B12 లోపించినట్లే

ప్రస్తుత కాలంలో వయసుతో నిమిత్తం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య విటమిన్ బి12 లోపం. దీని వల్ల తీవ్రమైన రక్తహీనత, కాళ్ల తిమ్మిర్లు, మతిమరుపు మరియు మానసిక ఆందోళన వంటి ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. ప్రముఖ సీనియర్ వైద్యులు డాక్టర్ సి.ఎల్. వెంకట్రావు గారు అందించిన బి12 లోప నివారణ గైడ్ మరియు ఉత్తమ ఆహారాల వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

Phani CH
|

Updated on: Jun 02, 2026 | 9:24 PM

Share
మారుతున్న ఆహార అలవాట్లు, ఆధునిక జీవనశైలి కారణంగా నేడు చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరిలో విటమిన్ బి12 లోపం సర్వసాధారణంగా కనిపిస్తోంది. పూర్వకాలంలో రక్తంలో ఈ విటమిన్ శాతాన్ని గుర్తించే పరీక్షలు లేవు. కానీ, నేడు వైద్య విజ్ఞానం పెరగడంతో రక్త పరీక్ష ద్వారా దీనిని సులభంగా తెలుసుకోవచ్చు. సాధారణంగా శరీరంలో బి12 స్థాయి 200 కంటే ఎక్కువగా ఉండాలి. అంతకంటే తగ్గితే దానిని లోపంగా భావించాలి. ఈ విటమిన్ తగ్గడం వల్ల శరీరంలో ఎలాంటి భారీ నష్టాలు తెలుసుకుందాం.

1 / 5
విటమిన్ బి12 లోపించడం వల్ల శరీరంలో మొట్టమొదటగా వచ్చే సమస్య రక్తహీనత (Anemia). కంప్లీట్ బ్లడ్ పిక్చర్ (CBP) పరీక్ష చేసినప్పుడు సాధారణంగా ఉండాల్సిన 12 నుండి 15 గ్రాముల హిమోగ్లోబిన్ కాస్తా 6 లేదా 7 గ్రాములకు పడిపోతుంది. ఈ రక్తహీనత వల్ల విపరీతమైన అలసట, ఏ పని చేయలేకపోవడం, ముఖం మరియు కాళ్లలో వాపులు రావడం, నాలుగు అడుగులు వేయగానే ఆయాసం రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మైక్రోస్కోప్ కింద పరిశీలిస్తే, ఈ లోపం ఉన్నవారిలో ఎర్ర రక్తకణాల సంఖ్య తగ్గి, వాటి పరిమాణం (సైజు) సాధారణం కంటే పెద్దదిగా మారుతుంది.

2 / 5
ఈ విటమిన్ ప్రభావం కేవలం శరీరం పైనే కాదు, మెదడు పనితీరుపై కూడా తీవ్రంగా ఉంటుంది. విటమిన్ బి12 లోపించినప్పుడు తీవ్రమైన మానసిక కుంగుబాటు (Depression), చిరాకు, కోపం, మానసిక ఒత్తిడి పెరుగుతాయి. అలాగే జ్ఞాపకశక్తి క్షీణిస్తుంది. విద్యార్థులు ఎన్ని గంటలు చదివినా గుర్తుండకపోవడం, పెద్దవారిలో మతిమరుపు రావడం జరుగుతుంది.

3 / 5
కొందరికి తల తేలిపోతున్నట్లు, అసలు తలలో బరువే లేనట్లు వింతగా అనిపిస్తుంది. నరాల బలహీనత ఏర్పడి కాళ్లు, చేతులు తిమ్మిర్లు రావడం, నడిచేటప్పుడు శరీరం తూలుతున్నట్లు అవ్వడం ఈ లోపానికి ప్రధాన కారణాలు. గ్రామీణ ప్రాంతాలలో చాలా మంది ఈ విటమిన్ లోపం వల్ల వచ్చే తిమ్మిర్లు, తూలిపోవడం, తీవ్రమైన నీరసాన్ని చూసి దెయ్యం పట్టిందని, ఎవరో చేతబడి చేశారని లేదా మందు పెట్టారని భ్రమపడుతుంటారు. ఇది చాలా తప్పుడు ఆలోచన.

4 / 5
ఎలాంటి దెయ్యాలు, చేతబడులు లేవు.. ఇదంతా కేవలం విటమిన్ బి12 లోపం వల్ల వచ్చే శారీరక సమస్యే. మూఢనమ్మకాలతో భూత వైద్యుల చుట్టూ తిరిగి డబ్బులు వృథా చేసుకోవడమే కాకుండా ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించి రక్త పరీక్ష చేయించుకోవాలి. మాంసం, గుడ్లు, పాలు, పెరుగు మరియు మొలకెత్తిన గింజలు వంటి బి12 పుష్కలంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా లేదా వైద్యుల సలహాతో సప్లిమెంట్స్ వాడటం ద్వారా ఈ సమస్య నుండి సులభంగా బయటపడవచ్చు.

5 / 5
Follow Us