AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చుక్క రక్తంతో క్యాన్సర్‌ గుట్టురట్టు.. మన నిమ్స్‌లో ఫ్రీగానే పరీక్ష!

చుక్క రక్తంతో క్యాన్సర్‌ గుట్టురట్టు.. మన నిమ్స్‌లో ఫ్రీగానే పరీక్ష!

Phani CH
|

Updated on: Jun 02, 2026 | 7:46 PM

Share

హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రి క్యాన్సర్ నిర్ధారణలో విప్లవాత్మక మార్పు తీసుకురానుంది. త్వరలో ప్రారంభం కానున్న లిక్విడ్ బయాప్సీ ద్వారా కేవలం ఒక్క చుక్క రక్తంతోనే క్యాన్సర్‌ను గుర్తించవచ్చు. శరీరం నుంచి కణజాలం సేకరించాల్సిన అవసరం లేకుండా అత్యాధునిక సాంకేతికతతో పరీక్షలు నిర్వహించనున్నారు. పేద రోగులకు ఆరోగ్యశ్రీ పథకం కింద ఈ సేవలను ఉచితంగా అందించనున్నట్లు నిమ్స్ ప్రకటించింది.

హైదరాబాద్‌లోని నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ క్యాన్సర్ రోగుల కోసం మరో అత్యాధునిక వైద్య సేవను అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఇకపై కేవలం ఒక్క చుక్క రక్తంతోనే శరీరంలో ఉన్న క్యాన్సర్ గుట్టును రట్టు చేసే ‘లిక్విడ్ బయాప్సీ’ పరీక్షలను త్వరలోనే ప్రారంభించనున్నట్లు నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప వెల్లడించారు. నిమ్స్‌లో ఇప్పటికే ‘నెక్స్ట్‌ జనరేషన్‌ సీక్వెన్సింగ్‌’ సాంకేతికతతో క్యాన్సర్‌కు కారణమయ్యే జన్యుపరమైన మార్పులను డీఎన్‌ఏ, ఆర్‌ఎన్‌ఏ స్థాయిలో గుర్తిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ‘డైమండ్‌ ప్రాజెక్టు’లో భాగంగా 2024 నుంచి ఇప్పటివరకు సుమారు 1,443 మంది రోగులకు ఈ పరీక్షలను ఉచితంగా అందించారు. దీని ఆధారంగా రోగులకు టార్గెటెడ్‌ థెరపీ చికిత్స అందిస్తున్నారు. ఈ సేవల పొడిగింపులో భాగంగా త్వరలో లిక్విడ్ బయాప్సీ సేవలు రానున్నాయి. ఈ పరీక్ష ప్రత్యేకత ఏంటంటే.. సాధారణ బయాప్సీ లాగా శరీరం లోపలి నుంచి కణజాలాన్ని ముక్కలుగా సేకరించాల్సిన అవసరం లేదు. కేవలం రక్త పరీక్ష ద్వారానే క్యాన్సర్ తీవ్రతను నిర్ధారించవచ్చు. ఊపిరితిత్తుల క్యాన్సర్లు, బ్రెయిన్ ట్యూమర్లు, ఎముకల్లోకి పాకిన క్యాన్సర్ల విషయంలో లోపలికి వెళ్లి కణజాలం సేకరించడం వైద్యులకు చాలా కష్టమైన పని. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఈ లిక్విడ్ బయాప్సీ ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతుందని నిమ్స్ పాథాలజీ విభాగాధిపతి డాక్టర్ శాంతవీర్‌ జి. ఉప్పిన్‌ వివరించారు. ఈ ఖరీదైన అత్యాధునిక పరీక్షలన్నింటినీ పేద రోగులకు ‘ఆరోగ్యశ్రీ’ పథకం కింద ఉచితంగానే అందించనున్నట్లు నిమ్స్ యాజమాన్యం స్పష్టం చేసింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

యువకుడిగా ఉండగా పరీక్ష.. వృద్ధుడయ్యాక వచ్చిన కొలువు!

తండ్రి ప్రేమ.. కొడుకు హోంవర్క్‌ చేద్దామని ప్రయత్నిస్తే..

రబ్బరు పడవలో 30 గంటల జర్నీ.. కుటుంబాన్ని కలవడం కోసం సాహసం

చెన్నకేశవ స్వామి పాదాల నుంచి ఎర్రని ద్రవం! కలియుగాంతానికి సంకేతమంటూ భక్తుల్లో భయం

భూమి అమ్మి భార్యను చదివించాడు.. టీచర్ ఉద్యోగం రాగానే..

Follow Us