AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చెన్నకేశవ స్వామి పాదాల నుంచి ఎర్రని ద్రవం! కలియుగాంతానికి సంకేతమంటూ భక్తుల్లో భయం

చెన్నకేశవ స్వామి పాదాల నుంచి ఎర్రని ద్రవం! కలియుగాంతానికి సంకేతమంటూ భక్తుల్లో భయం

Phani CH
|

Updated on: Jun 02, 2026 | 6:12 PM

Share

ఒకప్పుడు వృద్ధుల్లో ఎక్కువగా కనిపించిన పెద్దపేగు క్యాన్సర్ ఇప్పుడు యువతలోనూ వేగంగా పెరుగుతోంది. ప్రారంభ దశలో లక్షణాలు కనిపించకపోవడం వల్ల ఇది మరింత ప్రమాదకరంగా మారుతోంది. పీచు పదార్థాలు అధికంగా ఉండే ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, మద్యపానానికి దూరంగా ఉండటం, 45 ఏళ్లు దాటిన తర్వాత కొలొనోస్కోపీ పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఈ వ్యాధి ముప్పును గణనీయంగా తగ్గించుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

కలియుగం అంతంపై బ్రహ్మంగారి కాలజ్ఞానంతో పాటు ఎన్నో పురాణాలు భవిష్యత్తును అంచనా వేశాయి. తాజాగా తిరుపతి జిల్లాలో సంభవించిన ఒక వింత పరిణామం ఇప్పుడు కాలజ్ఞాన నిజాలను గుర్తు చేస్తూ భక్తులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. చిట్వేలు మండలంలోని నాగవరం గ్రామంలో వెలసిన చారిత్రాత్మక శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో ఈ వింత చోటుచేసుకుంది. దేవాలయంలోని చెన్నకేశవస్వామివారి పాదాల చెంత పీఠం వద్ద నుండి అకస్మాత్తుగా ఎర్రని వర్ణంతో కూడిన ద్రవం బయటకు వస్తోంది. ఈ దృశ్యాన్ని చూసిన స్థానిక గ్రామస్తులు, భక్తులు దిగ్భ్రాంతికి గురయ్యారు. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం.. కలియుగం అంతమయ్యే ముందు దైవ విగ్రహాల నుంచి రక్తం కారడం, కన్నీరు రావడం వంటి అరిష్ట లక్షణాలు కనిపిస్తాయని, ఇది దానికి సంకేతమేనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కలియుగ దైవమైన వేంకటేశ్వర స్వామి, చెన్నకేశవ స్వామి ఇద్దరూ అన్నదమ్ములని స్థానికుల ప్రగాఢ నమ్మకం. తిరుమలలో ధూపదీప నైవేద్యాలు ఘనంగా జరుగుతుంటే.. క్రీ.శ. 1228లో నిర్మించిన ఈ పురాతన నాగవరం చెన్నకేశవ స్వామి ఆలయంలో మాత్రం కాలక్రమేణా పూజలు, ఆదరణ తగ్గిపోయాయి. ధూపదీప నైవేద్యాలు సక్రమంగా జరగకపోవడం వల్లే స్వామివారు ఆగ్రహించి ఇలా పాదాల నుండి ఎర్రటి ద్రవాన్ని ప్రవహింపచేస్తున్నారని భక్తులు వాపోతున్నారు. వెంటనే దేవాదాయ శాఖ మంత్రి, అధికారులు స్పందించి ఆలయాన్ని సందర్శించాలని, దోష నివారణ కోసం శాంతి హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించి అరిష్టాన్ని నివారించాలని గ్రామస్తులు కోరారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భూమి అమ్మి భార్యను చదివించాడు.. టీచర్ ఉద్యోగం రాగానే..

యువ‌త‌లో పెరుగుతున్న పెద్ద పేగు క్యాన్స‌ర్‌.. అప్ర‌మ‌త్తంగా ఉండ‌క‌పోతే ముప్పే

సాధారణ మోడల్.. ‘కొకైన్ క్వీన్’ ఎలా అయింది?

చందమామపై మనిషి కాపురం! ఎప్పటి నుంచో తెలుసా?

Allu Arjun: అల్లు అర్జున్ పై ప్రశంసలు.. చార్టర్డ్ విమానం వదిలి.. ఎకానమీ క్లాస్‌లో ప్రయాణం

Follow Us