AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చందమామపై మనిషి కాపురం! ఎప్పటి నుంచో తెలుసా?

చందమామపై మనిషి కాపురం! ఎప్పటి నుంచో తెలుసా?

Phani CH
|

Updated on: Jun 02, 2026 | 5:30 PM

Share

చంద్రుడిపై శాశ్వత మానవ నివాసాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో నాసా భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. దక్షిణ ధ్రువ ప్రాంతంలో వందల చదరపు మైళ్ల విస్తీర్ణంలో ‘మూన్ బేస్’ నిర్మాణానికి మూడు దశల రోడ్‌మ్యాప్ రూపొందించింది. నీటి మంచు నిల్వలు, విద్యుత్ వ్యవస్థలు, రోవర్లు, మానవ ఆవాసాలతో కూడిన ఈ ప్రాజెక్టు అంతరిక్ష పరిశోధనలో కొత్త అధ్యాయానికి నాంది పలకనుంది.

కథల్లో చదువుకున్న చందమామపై ఇక మనుషులు కాపురం పెట్టబోతున్నారు. చరిత్రలోనే అద్భుత ప్రయోగానికి ‘నాసా’ శ్రీకారం చుట్టింది. ఏకంగా వందల చదరపు మైళ్ల విస్తీర్ణంలో, అన్ని వసతులతో కూడిన ఒక ‘మెగా చంద్ర నగరం లేదా Moon Base నిర్మించేందుకు అమెరికా ప్లాన్ సిద్ధం చేసింది. పదేళ్లలో సిబ్బందితో శాశ్వత స్థావరాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా నాసా అడుగులు వేస్తోంది. ఇటీవల నాసా తన ‘మూన్ బేస్’ ప్రోగ్రామ్ వివరాలను బయటపెట్టింది. “చంద్రుడిపై శాశ్వత మానవ ఉనికిని ఏర్పాటు చేయడమే తమ అంతిమ లక్ష్యం అంది నాసా. ఇందుకోసం వందల చదరపు మైళ్ల విస్తీర్ణంలో మౌలిక సదుపాయాలను, విభిన్న రకాల ఆస్తులను సమకూర్చుకోబోతున్నాం అని ప్రకటించింది. నాసా రోడ్‌ మ్యాప్ ప్రకారం.. 2026 నుండి 2032 వరకు మూడు దశల్లో ఈ చంద్ర స్థావర నిర్మాణం జరగనుంది: మొదటి దశ 2029 వరకు కొనసాగుతుంది. చంద్రుడి ఉపరితలంపై సురక్షితమైన ప్రదేశాన్ని నిర్ధారించుకోవడం, ప్రాథమిక సమాచారాన్ని సేకరించడం ఈ దశలో చేస్తారు. 2029 నుంచి 2032 వరకు ఉండే రెండవ దశలో స్థావరం ప్రారంభ ఆపరేటింగ్ సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో ఏర్పాటు చేస్తారు. 2032 తర్వాత మొదలయ్యే మూడవ దశలో చంద్రుడిపై కొంత మంది సిబ్బంది నివాసం ఉండేలా చూస్తారు. ఈ భారీ నగరాన్ని చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో నిర్మించనున్నారు. బిలియన్ల సంవత్సరాలుగా సూర్యకాంతి పడకుండా శాశ్వత నీడలో ఉంది చంద్రుడి దక్షిణ ప్రాంతం. ఇక్కడి బిలాల కింద ‘నీటి మంచు’ నిల్వలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. భవిష్యత్తులో మానవ మనుగడకు, రాకెట్ ఇంధన తయారీకి ఈ నీరే ముఖ్యం కానుంది. ఇక్కడి భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా అన్ని వసతులు ఒకే చోట నిర్మించడం సాధ్యం కాదు. సూర్యకాంతి లభించే కొండ శిఖరాలపై మానవ ఆవాసాలు ఉంటే, వాటి రేడియేషన్ రక్షణ కోసం అణు విద్యుత్ వ్యవస్థలను కిలోమీటరు దూరంలో నిర్మిస్తారు. వీటన్నింటినీ కలిపినప్పుడు అది ఒక పెద్ద నగరంగా విస్తరిస్తుంది. వ్యోమగాములు ప్రయాణించడానికి సెల్ఫ్ డ్రైవ్ వాహనాల తయారీ కోసం ‘ఆస్ట్రోలాబ్’ సంస్థకు 21.9 కోట్ల డాలర్లు, ‘లూనార్ ఔట్‌పోస్ట్’ సంస్థకు 22 కోట్ల డాలర్ల నిధులను నాసా కేటాయించింది. ఆర్టెమిస్-4 మిషన్ 2028 ల్యాండ్ అవ్వడానికి ముందే కనీసం ఒక రోవర్ అక్కడ సిద్ధంగా ఉంటుంది. రోవర్‌ను జెఫ్ బెజోస్‌కు చెందిన ‘బ్లూ ఆరిజిన్’ సంస్థ నిర్మించే ‘బ్లూ మూన్ ల్యాండర్’ ద్వారా చంద్రుడి పైకి చేరవేస్తారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Allu Arjun: అల్లు అర్జున్ పై ప్రశంసలు.. చార్టర్డ్ విమానం వదిలి.. ఎకానమీ క్లాస్‌లో ప్రయాణం

Satyadev: ‘నన్ను హీరోగా తీసేయ్ అన్నారు.. RGV గారు అలా అంటారనుకోలేదు’

లిటిల్ హార్ట్స్ డైరెక్టర్ తాతయ్య పెద్ద దర్శకుడా? ఎన్టీఆర్, చిరంజీవి, కృష్ణలతో సినిమాలు చేశాడా?

Follow Us