లిటిల్ హార్ట్స్ డైరెక్టర్ తాతయ్య పెద్ద దర్శకుడా? ఎన్టీఆర్, చిరంజీవి, కృష్ణలతో సినిమాలు చేశాడా?
‘లిటిల్ హార్ట్స్’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు సాయి మార్తాండ్ తాజాగా తన సినీ నేపథ్యాన్ని వెల్లడించారు. తన తాత బి.వి. ప్రసాద్ ప్రముఖ దర్శకుడిగా ఎన్టీఆర్, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి వంటి స్టార్ హీరోలతో పలు చిత్రాలు తెరకెక్కించినట్లు తెలిపారు. జాతీయ అవార్డు అందుకున్న బి.వి. ప్రసాద్ వారసుడిగా ఇప్పుడు సాయి మార్తాండ్ దర్శకుడిగా రాణించడం ఆసక్తికరంగా మారింది.
ఇటీవల లిటిల్ హార్ట్స్ అనే చిన్న సినిమాతో భారీ విజయం సాధించాడు కొత్త దర్శకుడు సాయి మార్తాండ్. చిన్న సినిమాగా ఒక యూత్ ఫుల్ లవ్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన లిటిల్ హార్ట్స్ సినిమా అన్ని జనరేషన్స్ ని మెప్పించింది. ఈ ఒక్క సినిమాతో దర్శకుడు సాయి మార్తాండ్ కూడా మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు. తన తర్వాతి సినిమా అడివి శేష్ తో ప్రకటించాడు. తాజాగా సాయి మార్తాండ్ తన బ్యాక్ గ్రౌండ్ ని బయటపెట్టాడు. ఎన్టీఆర్ పేరిట ఇచ్చే ఓ అవార్డు వేడుకలో పాల్గొన్న సాయి మార్తాండ్ తన తాతయ్య బివి ప్రసాద్ దర్శకుడిగా ఎన్టీఆర్ తో మూడు సినిమాలు చేసారని చెప్పుకొచ్చాడు. దీంతో సాయి మార్తాండ్ తాతయ్య ఎవరా అని వెతుకులాట మొదలయింది. సాయి మార్తాండ్ తాతయ్య బివి ప్రసాద్ దర్శకుడిగా 1965 నుంచి దాదాపు 20 సినిమాలకు పైగా చేసారు. ఎన్టీఆర్ తో ఆరాధన, మేలుకొలుపు, మనుషుల్లో దేవుడు సినిమాలు చేసారు. చిరంజీవితో తాతయ్య ప్రేమలీలలు అనే సినిమా చేసారు. కృష్ణతో చుట్టాలున్నారు జాగ్రత్త, నాయుడు గారి అబ్బాయి, శోభన్ బాబుతో ఊరికి సోగ్గాడు.. లాంటి సినిమాలు చేసారు. ఇలా అప్పటి నటీనటులతో దర్శకుడిగా సినిమాలు చేసారు బివి ప్రసాద్. ఆయన తీసిన మట్టిలో మాణిక్యం అనే సినిమాకు నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు. అప్పట్లో తాతయ్య స్టార్స్ తో దర్శకుడిగా పనిచేస్తే ఇప్పుడు మనవడు కూడా దర్శకుడిగా మారి సినిమాలు తీయడం ఇంట్రెస్టింగ్ గా మారిందిప్పుడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇంటిపై భారీ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
ఉద్యోగాలన్నీ ఏఐ తీసేస్తుందా..? మనుషులను టెక్నాలజీ భర్తీ చేయలేదు!
అంతరిక్షంలో ‘రమ్’వాసన.. వింత మేఘాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు
ఫిట్‌నెస్ ట్రెండ్..బరువు తగ్గడానికి ‘6-6-6 వాకింగ్ టెక్నిక్’
తెల్లవారేసరికి ఇళ్ల ముందు క్షుద్రపూజలు
లక్షల ఖర్చు లేదు.. రోడ్డుపైనే పెళ్లి.. వీడియో వైరల్!
తిరుమల గదిలో 9 అడుగుల జర్రిపోతు.. భక్తుల్లో భయం!
ప్రపంచ రికార్డు సృష్టించిన 13 రోజుల చిన్నారి
అర్థరాత్రి రోడ్డు దాటుతూ కనిపించిన వింత జీవి!
62 ఏళ్ల వయసులోనూ వర్కవుట్స్.. నీతా అంబానీ ఫిట్‌నెస్ రహస్యం ఇదే!
కదులుతున్న రైల్లోకి పార్శిల్ డెలివరీ.. వాటే టైమింగ్ బాస్!
అయ్యో.. ఈ భర్త కష్టం ఎవరికీ రాకూడదు!
హిట్టు కొడితే.. కోట్ల విలువ చేసే లగ్జరీ కార్ చేతిలో పడ్డట్టే..
బిగ్ బాస్ 10 - కామనర్స్ Vs సెలబ్రిటీస్ మధ్యలో మంట పెట్టిన మానస్
మహేష్ బాబు, రాజమౌళిలకు నోటీసులు..అసలేం జరిగిందంటే?
మీర్జాపూర్ ఊచకోత.. రూ.200 కోట్ల కలెక్షన్స్ దిశగా అడుగులు

