AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సాధారణ మోడల్.. ‘కొకైన్ క్వీన్’ ఎలా అయింది?

సాధారణ మోడల్.. ‘కొకైన్ క్వీన్’ ఎలా అయింది?

Phani CH
|

Updated on: Jun 02, 2026 | 5:33 PM

Share

మోడల్‌గా గుర్తింపు పొందాలనే కలతో కరాచీ చేరుకున్న అన్మోల్ అలియాస్ ‘పింకీ’, చివరకు పాకిస్థాన్‌లో ప్రముఖ డ్రగ్స్ మాఫియా నిర్వాహకురాలిగా మారింది. కరాచీ పోలీసుల దాడిలో భారీ మొత్తంలో కోకైన్‌తో అరెస్టైన ఆమె, 17 ఏళ్లుగా అక్రమ వ్యాపారాన్ని నడిపినట్లు విచారణలో తేలింది. ఈ కేసులో రాజకీయ నాయకుల పేర్లు వినిపించడం పాకిస్థాన్ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది.

బలూచిస్థాన్‌కు చెందిన అన్మోల్ మోడలింగ్ రంగంలో నిలదొక్కుకోవాలని కరాచీకి చేరుకుంది. గ్లామర్ ప్రపంచంలో రాణించాలని ప్రయత్నించిన ఆమెకు, కరాచీలోని హై-ప్రొఫైల్ పార్టీలు, డ్రగ్స్ సంస్కృతితో పరిచయం ఏర్పడింది. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశ, జీవనశైలిపై వ్యామోహం ఆమెను మెల్లమెల్లగా మాదకద్రవ్యాల వైపు నెట్టాయి. ఒక మోడల్‌గా ప్రయత్నించి విఫలమైన ఆమె, ఆ తర్వాత డ్రగ్స్ వ్యాపారంలో తిరుగులేని శక్తిగా ఎదిగింది. పింకీ డ్రగ్స్ నెట్‌వర్క్ కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్ లో వేళ్లూనుకుంది. తన గ్యాంగ్‌లో మహిళలను కొరియర్‌లుగా వాడుకుంటూ, ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్త పడేది. వాట్సాప్ ద్వారా ఆర్డర్లు స్వీకరించి, నేరుగా డెలివరీ చేసేది. పింకీ స్వయంగా డ్రగ్స్ తయారీలోనూ, వాటి నాణ్యతను పరీక్షించడంలోనూ శిక్షణ పొందిందని, తన వద్ద ఉన్న ‘వైట్’, ‘గోల్డెన్ స్టఫ్’ అత్యుత్తమమైనవని ఆమె గర్వంగా చెప్పుకునేదని పోలీసులు తెలిపారు. కరాచీ పోలీసుల మెరుపు దాడిలో పింకీ అరెస్టయింది. ఆమె వద్ద కోకైన్ భారీ మొత్తంలో దొరికింది. విచారణలో గత 17 ఏళ్లుగా ఈ అక్రమ వ్యాపారాన్ని ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగించగలిగిందని తేలింది. ఆమె వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరనే దానిపై ఇప్పుడు విచారణ ముమ్మరంగా సాగుతోంది. అరెస్టు తర్వాత పింకీ ప్రవర్తన, పోలీసుల పనితీరు పై విమర్శలొచ్చాయి. కోర్టులో ఆమె సంకెళ్లు లేకుండా, నల్ల కళ్ళద్దాలతో ఫోన్ వాడుతూ కనబడటం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. డ్రగ్స్ కేసులో అరెస్టయిన వ్యక్తికి ఇంతలా వీఐపీ ట్రీట్‌మెంట్ ఎలా అనే ప్రశ్నలు తలెత్తాయి. ఘటనకు సంబంధించి వీడియోలు వైరల్ కావడంతో, ఆమెకు సహకరించిన ముగ్గురు పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు. మాజీ ప్రధాని రాజా పర్వేజ్ అష్రఫ్ పేరును ఆమె ప్రస్తావించడం పాకిస్తాన్ రాజకీయాల్లో పెద్ద దుమారాన్ని రేపింది. ఆ వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేయడం దేశ రాజకీయాలను కుదిపేసింది. అష్రఫ్ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించినప్పటికీ, కేసు దర్యాప్తులో పింకీ బయటపెట్టే మరిన్ని పేర్లు ఎవరికి చిక్కులు తెచ్చిపెడతాయోనన్న భయం రాజకీయ వర్గాల్లో మొదలైంది. డ్రగ్స్ మాఫియాతో నేతలకు సంబంధాలు ఉన్నాయన్న వార్తలకు పింకీ ఉదంతం బలం చేకూర్చింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చందమామపై మనిషి కాపురం! ఎప్పటి నుంచో తెలుసా?

Allu Arjun: అల్లు అర్జున్ పై ప్రశంసలు.. చార్టర్డ్ విమానం వదిలి.. ఎకానమీ క్లాస్‌లో ప్రయాణం

Satyadev: ‘నన్ను హీరోగా తీసేయ్ అన్నారు.. RGV గారు అలా అంటారనుకోలేదు’

లిటిల్ హార్ట్స్ డైరెక్టర్ తాతయ్య పెద్ద దర్శకుడా? ఎన్టీఆర్, చిరంజీవి, కృష్ణలతో సినిమాలు చేశాడా?

Follow Us