AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భూమి అమ్మి భార్యను చదివించాడు.. టీచర్ ఉద్యోగం రాగానే..

భూమి అమ్మి భార్యను చదివించాడు.. టీచర్ ఉద్యోగం రాగానే..

Phani CH
|

Updated on: Jun 02, 2026 | 5:37 PM

Share

భార్యను ఉన్నత చదువులు చదివించి, ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలా చేసేందుకు తన ఆస్తిని సైతం అమ్ముకున్నాడు ఓ భర్త. తీరా టీచర్ ఉద్యోగం రాగానే, శిక్షణ కాలంలో పాత స్నేహితుడితో ఏర్పడిన వివాహేతర సంబంధం కారణంగా ఆ భార్య ప్రియుడితో పారిపోయింది. భర్తను, పదేళ్ల కొడుకును రోడ్డున పడేసి ఆమె చేసిన ఈ ఘోర మోసం బీహార్‌లో తీవ్ర సంచలనంగా మారింది.

సినిమా కథలను తలపించే ఘటన ఇది. కట్టుకున్న భర్త చేసిన త్యాగాన్ని మరిచిపోయింది. ఉద్యోగం రాగానే భర్తను, పదేళ్ల కొడుకును నడిరోడ్డుపై వదిలేసి ప్రియుడితో పారిపోయిన ఒక ఉపాధ్యాయురాలి ఉదంతం బీహార్‌లో సంచలనంగా మారింది. పోలీసుల కథనం ప్రకారం.. హాజీపూర్ నగర్ పరిధికి చెందిన అమన్ కుమార్‌కు, గుంజన్ కుమారికి 2013లో వివాహమైంది. ఇంటర్ మాత్రమే చదివిన భార్యను పెద్ద చదువులు చదివించి, టీచర్‌ను చేయాలనేది భర్త ఆశయం. అందుకోసం పట్టణంలో ఇల్లు అద్దెకు తీసుకుని, రాత్రిపగలు కష్టపడ్డాడు. చివరికి 2022లో తన పూర్వీకుల నుంచి వచ్చిన ఒకటిన్నర ఎకరాల భూమిని కూడా అమ్మేసి భార్యను గ్రాడ్యుయేషన్, బీఈడీ పూర్తి చేయించాడు. భర్త త్యాగం ఫలించి, గుంజన్ ఇటీవల బీపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం సంపాదించింది. ఇక్కడ ట్విస్ట్‌ ఏంటంటే..ఉద్యోగ శిక్షణ సమయంలో గుంజన్‌కు తన పాత కాలేజీ మిత్రుడు మళ్లీ పరిచయమయ్యాడు. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీయడంతో ఆమె ప్రవర్తన మారింది. అనుమానం వచ్చిన భర్త అమన్.. మే 23న భార్య ఉంటున్న అద్దె గదికి వెళ్లి చూడగా, ప్రియుడితో కలిసి ఆమె రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయింది. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేశారు. అయితే, తాను భర్తతో ఉండలేనని.. ప్రియుడితోనే కలిసి జీవిస్తానని సదరు మహిళ తెగేసి చెప్పింది. భార్యని నమ్మి, భవిష్యత్తులో తన జీవితం బావుండాలని సర్వస్వం ధారపోస్తే ఇలా నట్టేట ముంచిందని భర్త కన్నీరుమున్నీరవుతున్నాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

యువ‌త‌లో పెరుగుతున్న పెద్ద పేగు క్యాన్స‌ర్‌.. అప్ర‌మ‌త్తంగా ఉండ‌క‌పోతే ముప్పే

సాధారణ మోడల్.. ‘కొకైన్ క్వీన్’ ఎలా అయింది?

చందమామపై మనిషి కాపురం! ఎప్పటి నుంచో తెలుసా?

Allu Arjun: అల్లు అర్జున్ పై ప్రశంసలు.. చార్టర్డ్ విమానం వదిలి.. ఎకానమీ క్లాస్‌లో ప్రయాణం

Satyadev: ‘నన్ను హీరోగా తీసేయ్ అన్నారు.. RGV గారు అలా అంటారనుకోలేదు’

Follow Us