AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రబ్బరు పడవలో 30 గంటల జర్నీ.. కుటుంబాన్ని కలవడం కోసం సాహసం

రబ్బరు పడవలో 30 గంటల జర్నీ.. కుటుంబాన్ని కలవడం కోసం సాహసం

Phani CH
|

Updated on: Jun 02, 2026 | 6:14 PM

Share

చైనా మాజీ పోలీసు అధికారి డాంగ్ గాంగ్‌పింగ్ స్వేచ్ఛ కోసం చేసిన సాహస యాత్ర ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. చిన్న రబ్బరు పడవలో 30 గంటల పాటు సముద్ర ప్రయాణం చేసి దక్షిణ కొరియాకు చేరుకున్న ఆయన కథ సంచలనంగా మారింది. కుటుంబాన్ని కలుసుకోవాలనే లక్ష్యంతో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న డాంగ్‌ను తిరిగి చైనాకు పంపొద్దంటూ మానవ హక్కుల సంస్థలు విజ్ఞప్తి చేస్తున్నాయి.

చైనా ప్రభుత్వం కళ్లుగప్పి, ఒక చిన్న రబ్బరు పడవలో ఏకంగా 30 గంటల పాటు సముద్రంపై ప్రాణాలకు తెగించి ప్రయాణించిన ఓ మాజీ పోలీసు అధికారి సాహసోపేత కథనం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. స్వేచ్ఛ కోసం, తన కుటుంబాన్ని కలుసుకోవడం కోసం ఆయన చేసిన ఈ ‘డేరింగ్ జర్నీ’ నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. 68 ఏళ్ల డాంగ్‌ గాంగ్‌పింగ్‌ చైనాలో ఒకప్పుడు పోలీసు అధికారిగా పనిచేశారు. 1989 నాటి చారిత్రాత్మక తియాన్‌మెన్ స్క్వేర్ అణచివేత ఘటన జరిగి పదేళ్లు పూర్తయిన సందర్భంగా.. చైనా ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ ఆయన ఒక లేఖపై సంతకం చేశారు. దాంతో ఆయన తన ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా ప్రభుత్వ విధానాలపై నిరంతరాయంగా అసమ్మతి గళం వినిపించడంతో చైనా అధికారులు ఆయన్ను పలుమార్లు జైలులో పెట్టారు. చైనాలో ఉంటే తనకు స్వేచ్ఛ దొరకదని భావించిన డాంగ్, 2015లో తన కుటుంబంతో కలిసి థాయ్‌లాండ్‌కు పారిపోయారు. అక్కడ ఒక విచిత్ర పరిస్థితి ఎదురైంది. ఆయన కుటుంబ సభ్యులకు కెనడా వెళ్లేందుకు అనుమతి లభించినప్పటికీ, డాంగ్‌ను మాత్రం థాయ్ అధికారులు తిరిగి చైనాకు పంపించేసారు. చైనాలో ఆయనకు మళ్లీ జైలు శిక్ష తప్పలేదు. 2019లో జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా, కెనడాలో ఉన్న తన కుటుంబాన్ని చేరుకోవాలనే పట్టుదలను ఆయన వదులుకోలేదు. ఇటీవల చైనా సరిహద్దులు దాటేందుకు ప్రయత్నించి మరోసారి పట్టుబడ్డారు డాంగ్. విడుదలయ్యాక ప్రమాదకర నిర్ణయం తీసుకున్నారు. చైనాలోని వెయిహై తీరం నుంచి ఒక చిన్న రబ్బరు బోటులో ఒంటరిగా సముద్రంలోకి బయల్దేరారు. ఎలాంటి రక్షణ లేని ఆ పడవపై దాదాపు 30 గంటల పాటు సముద్ర కెరటాలతో పోరాడుతూ ప్రయాణించి, చివరికి దక్షిణ కొరియా తీరానికి చేరుకున్నారు. తీరంలో అతడిని గమనించిన స్థానిక మత్స్యకారులు కోస్ట్ గార్డ్‌కు సమాచారం అందించడంతో అధికారులు అతన్ని ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రస్తుతం డాంగ్ దక్షిణ కొరియా అధికారుల ఆధీనంలో ఉన్నారు. అయితే ఈ వ్యవహారం చైనా, దక్షిణ కొరియా దౌత్య సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో, కొరియా ఆయన్ను తిరిగి చైనాకు పంపించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కొన్నేళ్లుగా కేవలం స్వేచ్ఛ కోసం, తన భార్యాపిల్లలను కలుసుకోవడం కోసం డాంగ్ పోరాడుతున్నారని, దయచేసి ఆయన్ను మళ్లీ చైనాకు పంపొద్దని అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు దక్షిణ కొరియా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చెన్నకేశవ స్వామి పాదాల నుంచి ఎర్రని ద్రవం! కలియుగాంతానికి సంకేతమంటూ భక్తుల్లో భయం

భూమి అమ్మి భార్యను చదివించాడు.. టీచర్ ఉద్యోగం రాగానే..

యువ‌త‌లో పెరుగుతున్న పెద్ద పేగు క్యాన్స‌ర్‌.. అప్ర‌మ‌త్తంగా ఉండ‌క‌పోతే ముప్పే

సాధారణ మోడల్.. ‘కొకైన్ క్వీన్’ ఎలా అయింది?

చందమామపై మనిషి కాపురం! ఎప్పటి నుంచో తెలుసా?

Follow Us