AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హెయిర్ కలర్స్ వద్దు! ఈ ఒక్క నూనె చాలు.. తెల్ల జుట్టు నల్లగా మారి ఒత్తుగా పెరుగుతుంది!

మన శరీరానికి విటమిన్లు, ఖనిజాలు ఎంతగానో అవసరం. ముఖ్యంగా విటమిన్ బి12, డి3 లోపాల వల్ల జుట్టు రాలడం, కాళ్ల తిమ్మిర్లు, తీవ్రమైన నీరసం వంటి సమస్యలు వస్తాయి. వీటికి ఎలాంటి ఇంగ్లీష్ సప్లిమెంట్స్ లేకుండా, మన ఇంట్లో దొరికే సహజ ఆహార పదార్థాలతో మరియు నాచురోపతీ విధానంలో ఎలా శాశ్వత ముగింపు పలకాలో డాక్టర్ షగుఫ్త గారి అద్భుతమైన గైడ్ ఇక్కడ చూద్దాం.

Phani CH
|

Updated on: Jun 02, 2026 | 9:38 PM

Share
ప్రస్తుత కాలంలో చాలా మంది రకరకాల డైట్లు పాటిస్తున్నారు కానీ శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలను అందించడం మర్చిపోతున్నారు. ముఖ్యంగా విటమిన్ బి12 మరియు విటమిన్ డి ల లోపం నేడు 80 శాతం మందిలో కనిపిస్తోంది. జుట్టు విపరీతంగా రాలడం, అరికాళ్లలో తిమ్మిర్లు, మంటలు, తీవ్రమైన అలసట మరియు మూడ్ స్వింగ్స్ వంటివన్నీ ఈ విటమిన్ల లోపానికి ప్రధాన సంకేతాలు.

1 / 5
జుట్టు రాలుతుందని షాంపూలు, సీరమ్స్ మార్చడం కాదు.. శరీరానికి లోపలి నుండి సరైన పోషకాలు అందించాలని ప్రముఖ నాచురోపతీ నిపుణులు డాక్టర్ షగుఫ్త గారు స్పష్టం చేస్తున్నారు. నల్లటి, ఒత్తైన జుట్టు పెరుగుదలకు మరియు విటమిన్ల లోపాన్ని అధిగమించడానికి జావ (మల్టీగ్రెయిన్ అంబలి) ఒక అద్భుతమైన ఆహారం. రాగిపిండి, జొన్నపిండి, సజ్జపిండి, బార్లీ మరియు తోటకూర విత్తనాల (రాజగిరా) పొడులను సమానంగా కలుపుకోవాలి. వీటికి దోరగా వేయించిన గుమ్మడి గింజలు, పుచ్చగింజలు, పొద్దుతిరుగుడు గింజలు, తెల్ల నువ్వులు మరియు తామర గింజల (పూల్ మఖానా) పౌడర్‌ను కూడా జోడించాలి.

2 / 5
ప్రతిరోజు ఉదయం క్యారెట్, పాలకూర వంటి కూరగాయలు ఉడికించి అందులో ఈ పిండిని వేసి జావలా కాచుకుని తాగితే శరీరానికి కావలసిన అన్ని విటమిన్లు సహజంగా అందుతాయి. ఇది జుట్టును కుదుళ్ల నుండి బలంగా మార్చి నల్లగా పెరిగేలా చేస్తుంది. జుట్టు సంరక్షణ కోసం డాక్టర్ షగుఫ్త గారు ఒక ప్రత్యేకమైన నూనెను సూచించారు. స్వచ్ఛమైన కొబ్బరి నూనెలో కొద్దిగా మెంతులు, కరివేపాకు మరియు చిన్న ఉల్లిపాయలు (సాంబార్ ఆనియన్స్) వేసి మూడు నుండి నాలుగు నిమిషాల పాటు బాగా వేడి చేయాలి. ఆ తర్వాత ఆ నూనెను చల్లార్చి వడకట్టుకుని నిల్వ చేసుకోవాలి.

3 / 5
వారానికి రెండు సార్లు ఈ నూనెను తలకు పట్టించి మసాజ్ చేయడం వల్ల స్కాల్ప్ ఆరోగ్యం మెరుగుపడి జుట్టు బౌన్సీగా, ఒత్తుగా పెరుగుతుంది. చర్మానికి, జుట్టుకు రసాయన రంగులు, హెన్నా వాడటం కంటే ఈ సహజ నూనె ఎంతో శ్రేష్ఠమైనది.ఇక అరికాళ్ల తిమ్మిర్లు, మంటలు ఉన్నవారు రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటిలో ఒక చెంచా మెంతులు వేసి పది నిమిషాల పాటు కాళ్లను అందులో ఉంచాలి. ఆ తర్వాత కాళ్లను తుడుచుకుని కొబ్బరి నూనెతో మసాజ్ చేసుకోవాలి.

4 / 5
అలాగే తోటకూర విత్తనాలు, డ్రై నట్స్, ఖర్జూరాలతో చేసిన లడ్డూను రోజుకొకటి చొప్పున తింటే బి12 లోపం తగ్గి తిమ్మిర్లు మాయమవుతాయి. పొట్ట ఉబ్బరం, అధిక వేడి ఉన్నప్పుడు బొడ్డులో రెండు చుక్కల ఆముదం నూనె వేయడం వల్ల శరీరం చల్లబడి గట్ హెల్త్ మెరుగుపడుతుంది. ప్రకృతి ప్రసాదించిన ఈ సహజ పద్ధతులను పాటిస్తూ మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవచ్చు.

5 / 5
Follow Us