AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గండికోటలో హీరో విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. జోరుగా రణబలి షూటింగ్

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా రణబాలి. ఈ చిత్రాన్ని టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

గండికోటలో హీరో విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. జోరుగా రణబలి షూటింగ్
Vijay Deverakonda , Rashmi
Sudhir Chappidi
| Edited By: |

Updated on: Jun 02, 2026 | 9:43 PM

Share

హిట్ పెయిర్ గా పేరు పేరుపొందిన హీరో విజయ్ దేవరకొండ , రష్మిక ల కొత్త సినిమా షూటింగ్ మొదలైంది… పెళ్ళైన తర్వాత మొదటి సినిమా చేస్తున్న ఈ జంట కడప జిల్లాలో సందడి చేస్తుంది. కడప జిల్లాలోని పర్యాటక ప్రాంతమైన ద గ్రాండ్ కెన్యాన్ ఆఫ్ ఇండియా గా పేరుపొందిన గండికోట ప్రాంతంలో హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక దంపతుల మధ్య కొత్త సినిమా షూటింగ్ జరుగుతుంది. దీనికోసం చిత్ర యూనిట్ కడప జిల్లాకు చేరుకొని దాదాపు రెండు రోజుల నుంచి కడప జిల్లాలోని మైదుకూరు అలాగే ప్రొద్దుటూరు ప్రాంతాలలో షూటింగ్ నిర్వహించారు.

ఈ రోజు గండికోట ప్రాంతంలో హార్స్ రైడింగ్ కు సంబంధించిన కొన్ని సన్నివేశాలను చిత్రీకరించినట్లు చిత్ర యూనిట్ చెబుతున్నారు. పెళ్ళైన తర్వాత మొదటి సినిమా షూటింగ్ ప్రారంభించారు ఈ హిట్ పెయిర్. ఈ సినిమా షూటింగ్ ఈనెల 12వ తేదీ వరకు కడప జిల్లాలోని గండికోట అలాగే పరిసర ప్రాంతాలలోనే జరగనున్నట్లు సమాచారం. ఇక్కడ జరుగుతున్న షూటింగ్లో విజయ్ దేవరకొండ వింటేజ్ లుక్ లో కనిపిస్తున్నారు.

విజయ్, రష్మికాను చూడటానికి అభిమానులు పెద్దెత్తున ఎగబడ్డారు. రాహుల్‌ సంక్రిత్యాన్‌ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతుంది. ఈ సినిమాకు `రణబాలి` అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఖరారు చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన విజయ్, రష్మిక పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. త్వరలోనే ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్స్ రానున్నాయి. “రణబాలి” సెప్టెంబర్ 11న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ కు రాబోతోంది.

విజయ్ దేవరకొండ ఇన్ స్టాగ్రామ్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us