AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaibhav Sooryavanshi : సచిన్, కోహ్లీల రికార్డులు అవుట్.. 15 ఏళ్లకే బ్లాంక్ చెక్కులు అందుకుంటున్న వైభవ్ సూర్యవంశీ

Vaibhav Sooryavanshi : ఐపీఎల్ ముగింపు వేడుకల్లో మేజర్ అవార్డులన్నింటినీ ఇతడే క్లీన్ స్వీప్ చేశాడు. దాంతో రాత్రికి రాత్రే ఈ బిహార్ కుర్రాడి బ్రాండ్ వాల్యూ ఆకాశాన్ని తాకింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను సైతం పక్కకు నెట్టి కార్పొరేట్ కంపెనీలు ఈయన వెనుక పరుగులు పెడుతున్నాయి.

Vaibhav Sooryavanshi : సచిన్, కోహ్లీల రికార్డులు అవుట్.. 15 ఏళ్లకే బ్లాంక్ చెక్కులు అందుకుంటున్న వైభవ్ సూర్యవంశీ
Vaibhav Sooryavanshi
Rakesh
|

Updated on: Jun 02, 2026 | 7:01 PM

Share

Vaibhav Sooryavanshi : క్రికెట్ ప్రపంచంలో ప్రస్తుతం ఒకే ఒక్కడి పేరు మారుమోగిపోతోంది. అతడే 15 ఏళ్ల టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 2026 సీజన్‌లో ఈ బుడ్డోడు సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. రాజస్థాన్ రాయల్స్ (RR) జట్టు తరఫున ఆడిన వైభవ్.. తన బ్యాటింగ్ విశ్వరూపంతో క్రికెట్ దిగ్గజాలనే ఆశ్చర్యపరిచాడు. ఐపీఎల్ ముగింపు వేడుకల్లో మేజర్ అవార్డులన్నింటినీ ఇతడే క్లీన్ స్వీప్ చేశాడు. దాంతో రాత్రికి రాత్రే ఈ బిహార్ కుర్రాడి బ్రాండ్ వాల్యూ ఆకాశాన్ని తాకింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను సైతం పక్కకు నెట్టి కార్పొరేట్ కంపెనీలు ఈయన వెనుక పరుగులు పెడుతున్నాయి.

ఐపీఎల్ 2026 సీజన్‌లో రన్నరప్ రేసులో రాజస్థాన్ క్వాలిఫైయర్-2 లో ఓడిపోయినప్పటికీ, వైభవ్ సూర్యవంశీ మాత్రం చరిత్ర సృష్టించాడు. ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ సాధించడంతో పాటు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ (MVP), ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్, సూపర్ స్ట్రైకర్, సూపర్ సిక్సెస్ అవార్డులను కైవసం చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చిన్న వయసులో ఈ అవార్డులు గెలవడమే కాకుండా.. ఒకే సీజన్‌లో ఎంవీపీ, ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డులు రెండూ సాధించిన ఏకైక ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీ సైతం స్పందిస్తూ.. భవిష్యత్తులో బాలీవుడ్, హాలీవుడ్ స్టార్ల కంటే పెద్ద సెలబ్రిటీ వైభవ్ అవుతాడని జోస్యం చెప్పారు.

ఐపీఎల్‌లో వైభవ్ చూపించిన ప్రతాపానికి బ్యాట్ స్పాన్సర్‌షిప్ మార్కెట్ అప్సెట్ అయిపోయింది. కోహ్లీ బ్యాట్ స్పాన్సర్ ఎమ్ఆర్ఎఫ్, రోహిత్ శర్మ బ్యాట్ స్పాన్సర్ సియట్ లాంటి దిగ్గజ క్రీడా సంస్థలు వైభవ్ బ్యాట్ రైట్స్ కోసం పోటీ పడుతున్నాయి. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం ఒక ప్రముఖ కంపెనీ అయితే ఈ 15 ఏళ్ల కుర్రాడికి ఏకంగా బ్లాంక్ చెక్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రేజ్ చూసి వైభవ్ తన కమర్షియల్ యాడ్స్ రేట్లను ఏకంగా రెట్టింపు చేసేశాడు.

కాంప్లాన్ ఇండియా.. కోట్లతో తొలి అడుగు

వైభవ్ సూర్యవంశీ కమర్షియల్ జర్నీ ప్రముఖ న్యూట్రిషన్ బ్రాండ్ కాంప్లాన్ ఇండియాతో ప్రారంభమైంది. 2026 ప్రారంభంలోనే కాంప్లాన్ సంస్థ అతనితో థోడా ప్లాన్, థోడా కాంప్లాన్ అనే క్యాంపెయిన్ కోసం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ విలువ దాదాపు రూ.75 నుంచి 80 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఈ యాడ్‌లో వైభవ్ క్రమశిక్షణతో కూడిన శిక్షణ, క్రీడాకారులకు పోషకాహారం ఎంత ముఖ్యమనే విషయాలను హైలైట్ చేశారు.

రెడ్ బుల్ ఛాలెంజ్.. గూగుల్ పే పాకెట్ మనీ యాడ్

ఐపీఎల్ 2026 టోర్నీ జరుగుతున్న సమయంలోనే వైభవ్ తన రాజస్థాన్ రాయల్స్ టీమ్‌మేట్ ధ్రువ్ జురెల్‌తో కలిసి రెడ్ బుల్ ఇన్నోవేటివ్ ఛాలెంజ్‌లో కనిపించాడు. స్పిన్నింగ్ వీల్ గేమ్ ద్వారా 30 బంతుల్లో 60 పరుగులు చేసే టాస్క్‌లో పాల్గొని అలరించాడు. దీనితో పాటు ప్రముఖ డిజిటల్ పేమెంట్ యాప్ గూగుల్ పే పాకెట్ మనీ క్యాంపెయిన్‌లో కూడా వైభవ్ ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. టీనేజర్లు తమ యూపీఐ ఐడీలను తల్లిదండ్రుల బ్యాంక్ అకౌంట్లకు లింక్ చేసుకునే ఈ ఫీచర్ యాడ్‌లో 15 ఏళ్ల వైభవ్ రోజువారీ డిజిటల్ పేమెంట్స్ చేస్తూ కనిపించాడు.

జార్ఖండ్ ఆరోగ్య శాఖ అంబాసిడర్‌గా.. ఎస్ఎస్ బ్యాట్ డీల్

మే 30వ తేదీన జార్ఖండ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఇర్ఫాన్ అన్సారీ ఒక కీలక ప్రకటన చేశారు. వైభవ్‌ను యూత్ ఎనర్జీకి నిలువెత్తు రూపంగా అభివర్ణిస్తూ, త్వరలోనే జార్ఖండ్ ఆరోగ్య శాఖ తరుఫున ప్రచారకర్తగా నియమించనున్నట్లు పేర్కొన్నారు. ఇక క్రికెట్ కిట్ విషయానికి వస్తే.. ప్రముఖ స్పోర్ట్స్ తయారీ సంస్థ సరీన్ స్పోర్ట్స్ (SS – Sareen Sports)తో వైభవ్‌కు ఎప్పటి నుంచో ఒప్పందం ఉంది. ఈ ఎస్ఎస్ బ్యాట్ స్పాన్సర్‌షిప్ ద్వారా వైభవ్‌కు ఏడాదికి దాదాపు రూ.50 లక్షల ఆదాయం లభిస్తోంది.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us