Tollywood: సీరియల్లో క్రేజీ హీరోయిన్.. కట్ చేస్తే.. భవన కార్మికురాలిగా పనిచేస్తున్న బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టారా..?
సినీరంగుల ప్రపంచంలో నటీనటులుగా గుర్తింపు తెచ్చుకుని అనుహ్యంగా సినిమాలకు దూరమైన తారలు చాలా మంది ఉన్నారు. స్టార్ హీరోహీరోయిన్లతోపాటు బుల్లితెరపై సీరియల్స్ ద్వారా ఓ రేంజ్ ఫాలోయింగ్ సంపాదించుకున్న స్టార్స్ గురించి చెప్పక్కర్లేదు. సినీతారల కంటే ఎక్కువగా అభిమానులను సంపాదించుకున్నారు. కానీ ఇప్పుడు ఓ సీరియల్ హీరోయిన్ కు సంబంధించిన ఓ ఫోటో ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా..?

బుల్లితెరపై పలు సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎన్నో ధారవాహికలలో ప్రధాన పాత్రలు పోషించి తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అందం, అభినయంతో హీరోయిన్స్ కంటే ఎక్కువ క్రేజ్ సొంతం చేసుకుంది. కట్ చేస్తే.. ఇప్పుడు భవన నిర్మాణ కార్మికురాలిగా మారింది. ఇప్పుడు ఈ అమ్మడు ఫోటోస్ చూసి నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ పైన ఫోటోలో ఇటుకలు మోస్తూ కనిపిస్తున్న బ్యూటీ బుల్లితెరపై చాలా ఫేమస్. ఒకప్పుడు అనేక సీరియల్స్ చేసి మెప్పించింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా..కోలీవుడ్ నటి సత్య థెరాజన్. సాధారణంగా సినిమాల్లో తమ పాత్ర కోసం హీరోయిన్స్ ఎలాంటి రిస్క్ అయినా చేసేందుకు ముందుంటారు. తమ ఫిట్నెస్ విషయంలో అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. అలాగే పాత్ర, కథ డిమాండ్ బట్టి తమ లుక్ పూర్తిగా మార్చుకునేందుకు ట్రై చేస్తుంటారు. ఇక ఇప్పుడు ఓ సీరియల్ హీరోయిన్ సైతం తన తదుపరి ప్రాజెక్ట్ కోసం ఇలా భవన నిర్మాణ కార్మికురాలిగా మారింది. తనే టీవీ నటి సత్య థెరాజన్.
కోలీవుడ్ ఇండస్ట్రీలో పలు సీరియల్స్ ద్వారా చాలా పాపులర్ అయ్యింది ఈ అమ్మడు. తాజాగా తన ఇన్ స్టాలో సెట్ లో తాను భవన నిర్మాణ కార్మికురాలిగా పనిచేసేందుకు రెడీ అవుతున్న వీడియో షేర్ చేసింది. ఇప్పుడు అదే వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. తమిళంలో ప్రసారమయ్యే ధనం సీరియల్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైంది సత్య. ఇందులో ఆమె ప్రధాన పాత్రలో నటిస్తుంది. చిన్న మరుమకలు అనే సీరీస్‌కి దర్శకత్వం వహించిన మనోజ్ కుమార్ ఈ సీరియల్ కు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఆటో నడిపించే తన భర్త మరణంతో కుటుంబ బాధ్యతలు తీసుకుంటుంది సత్య.
తన కుటుంబానికి అండగా నిలిచేందుకు.. ఆర్థిక సమస్యలను తగ్గించేందుకు భవన కార్మికురాలిగా మారుతుంది. ఇప్పుడు తన పాత్రకు సంబంధించిన వీడియో షేర్ చేయడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. సత్య దేవరాజన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..
Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..
Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..








