- Telugu News Photo Gallery Cinema photos Actress Shriya Saran Shares Beautiful Lehenga Photos In Social Media
Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..
సినిమా రంగంలో తన నటనతో అడియన్స్ హృదయాలను గెలుచుకుంది. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా చక్రం తిప్పింది. ఇక ఇప్పుడు ఫ్యాషన్ రంగంలో అదరగొడుతుంది. తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోస్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. 42 ఏళ్ల వయసులోనూ గ్లామర్ అరాచకం సృష్టిస్తోంది ఈ వయ్యారి.
Updated on: Jun 28, 2025 | 12:53 PM

ఒకప్పుడు తెలుగు సినిమా రంగంలో తోపు హీరోయిన్ శ్రియా. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, రజినీకాంత్, ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ బాబు ఇలా స్టార్ హీరోస్ అందరి సరసన నటించి మెప్పించింది. అప్పట్లో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలోత నంబర్ వన్ హీరోయిన్ గా అదరగొట్టింది.

ఇక పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ఈ అమ్మడు ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. కథానాయికగా కాకుండా సహయ పాత్రలలోనూ కనిపిస్తుంది. అలాగే లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో సందడి చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో షేర్ చేసి ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి.

ప్రముఖ డిజైనర్ లేబుల్ కోసం ఆమె చేసిన ఫోటోషూట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. మాలిబులో గార్డెన్ ఆఫ్ ఈడెన్ కలెక్షన్ కు చెందిన ప్యాస్టెల్ బ్లూ కలర్ లెహంగాలో ఆమె లుక్ ఆకట్టుకుంటుంది. మృదువైన రంగులు, ఆకర్షించే డిజైన్ శ్రియా లుక్ ను మరింత ఎలివేట్ చేస్తున్నారు. ఇందులో శ్రియా లెహంగా లైట్ బ్లూ షేడ్స్ తో నాజూగ్గా కనిపిస్తుంది.

మెరుస్తున్న బ్లౌజు డిజైన్, మ్యాచ్ అయిన స్కర్ట్ పై పువ్వుల ఎంబ్రాయిడరీ శ్రియను ఒక యువరాణిలా చూపిస్తుంది. ప్రస్తుతం శ్రియా ఫోటోస్ నెట్టింట వైరలవుతుండగా..ఆమె వయసు 42 సంవత్సరాలు అని తెలిసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం తెలుగు, హిందీ భాషలలో వరుస సినిమాల్లో నటిస్తుంది.

కొన్నాళ్ల క్రితం ఆర్ఆర్ఆర్ సినిమాలో అజయ్ దేవగన్ భార్యగా కనిపించింది. ఇక ఇప్పుడు దృశ్యం 3 చిత్రంలో మరోసారి అదే హీరో సరసన నటిస్తుంది. అయితే ఆమెకు ఇప్పుడు సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. ఎప్పటికప్పుడు సరికొత్త ఫోటోషూట్స్ షేర్ చేస్తుంది.




