- Telugu News Photo Gallery Cinema photos Do You Know About Manchu Vishnu Kannappa Movie Heroine Preethi Mukundan
Kannappa: కన్నప్పలో అందరి దృష్టి ఆమెపైనే.. కుర్రకారు ఫేవరేట్ లిస్ట్‌లో మరో బ్యూటీ.. ఇంతకీ ఎవరీ సుందరి.. ?
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న సినిమా కన్నప్ప. రామాయణ్, మహా భారతం వంటి అద్భుతమైన సీరియల్స్ తెరకెక్కించిన డైరెక్టర్ ముఖేశ్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇందులో ప్రభాస్, మోహన్ బాబు, మోహన్ లాల్, కాజల్, అక్షయ్ కుమార్ కీలకపాత్రలు పోషించారు. అలాగే ఇప్పుడు ఈ సినిమాలో ఓ ముద్దుగుమ్మ స్పెషల్ అట్రాక్షన్ అవుతుంది.
Updated on: Jun 28, 2025 | 1:16 PM

ప్రస్తుతం థియేటర్లలో కన్నప్ప సినిమా విజయవంతంగా దూసుకుపోతుంది. మంచు విష్ణు, ప్రభాస్, మోహన్ బాబు యాక్టింగ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో ఈ చిత్రంలో మరో బ్యూటీ సైతం స్పెషల్ హైలెట్ అవుతుంది. ఇప్పుడు అందరి కళ్లు ఆమె పైనే ఉన్నాయి. పైన ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో తెలుసా.. ?

కన్నప్ప సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ బ్యూటీ పేరు ప్రీతి ముకుందన్. తమిళనాడులో పుట్టి పెరిగిన ఈ అమ్మడు కోలీవుడ్ ఇండస్ట్రీలో పలు చిత్రాల్లో నటించింది. నిజానికి ఈ సినిమా కోసం ముందుగా ప్రీతి ముకుందన్ అడిషన్ ఇచ్చింది. కానీ అప్పుడు బాలీవుడ్ బ్యూటీ నుపూర్ సనన్ ను ఎంపిక చేశారు.

కానీ అనుకోకుండా ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో ఆ ఛాన్స్ తిరిగి ప్రీతికి చేరింది. ఇప్పుడు కన్నప్ప సినిమాతో తెలుగులో తొలి హిట్టు అందుకుంది. ఈ చిత్రంలో అందం, అభినయంతో కట్టిపడేసింది ప్రీతి. ఈ మూవీతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రీతి కన్నప్ప గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.

ప్రభాస్ తో కలిసి నటిస్తానని తానెప్పుడూ అనుకోలేదని.. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం తన జీవితంలో మర్చిపోలేనని చెప్పుకొచ్చింది. జీవితంలో ప్రభాస్ ను ఒక్కసారైనా కలుస్తానని అనుకోలేదని.. అలాంటిది తనకు ప్రభాస్ తో నటించే ఛాన్స్ రావడంతో ఎంతో సంతోషపడ్డానని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ.

కన్నప్ప సినిమా కోసం తాను గుర్రపు స్వారీతోపాటు కత్తి యుద్ధంలో కూడా ట్రైనింగ్ తీసుకున్నట్లు చెప్పుకొచ్చింది. అలాగే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ అలరిస్తుంది. కన్నప్ప సినిమా కంటే ముందు శ్రీవిష్ణు నటించిన ఓం భీమ్ బుష్ సినిమాలో నటించింది.




